భారత దేశంలో త్వరలో బుల్లెట్ రైళ్లు పరుగులు పెట్టనున్నాయి.

By Anil

భారతీయ రేల్వేలోకి త్వరలో బుల్లెట్ రైళ్లు రానున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాల్లోని రైలు పట్టాల మీద హై స్పీడ్ బుల్లెట్ రైళ్లు పరుగులు పెడుతున్నాయి. కాని మన దేశానికి అంత భాగ్యం ఎక్కడిది చెప్పండి. ఉన్న వాటికే దిక్కులేదు ఇక బుల్లెట్ రైళ్లా అని విస్కుంటున్నారా? మేము చెప్పేది అక్షరాల నిజం ఎందుకంటే మన దేశ ప్రధాని జపాన్ దేశంతో దీనికి సంభందించిన ఒప్పందం కుదుర్చుకున్నాడు.
Also Read: టైటానిక్ షిప్, టైటానిక్ సినిమా...! మీరు తెలుసుకోవాల్సిన ఆశక్తికరమైన విషయాలు....!!

అంటే త్వరలో మన దేశంలో కూడా బుల్లెట్ రైళ్లు పరుగులు పెట్టనున్నాయి. అయితే ఈ ఒప్పందానికి చెందిన వివరాలు, ఇవి ఏ నగరాలలో తిరగనునన్నాయి వంటి వివరాలను తెలుసుకుందామా? అయితే క్రింది కథనాల మీద ఓ లుక్కేసుకోండి.

 భారత దేశంలో త్వరలో బుల్లెట్ రైళ్లు పరుగులు పెట్టనున్నాయి.

భారత దేశపు మొదటి బుల్లెట్ ట్రెయిన్ కోసం జపాన్ దేశంతో ఒప్పదం కుదుర్చుకుంది. ఈ డీల్ విలువ 8 బిలియన్ డాలర్లు అని జపాన్ బిజినెస్ డైలీ తన కథనంలో పేర్కొంది.

 భారత దేశంలో త్వరలో బుల్లెట్ రైళ్లు పరుగులు పెట్టనున్నాయి.

ప్రధాని నరేంద్ర మోడి జపాన్ పర్యటనలో భాగంగా జపాన్ ప్రధాన మంత్రి అయిన షింజో అబె తో జరిగిన భేటిలో ఈ ఒప్పదం కుదుర్చుకున్నట్లు తెలిసింది.

 భారత దేశంలో త్వరలో బుల్లెట్ రైళ్లు పరుగులు పెట్టనున్నాయి.

ఈ బుల్లెట్ రైలును మొదట ముంబాయ్ మరియు అహ్మదాబాద్‌ల మధ్య ప్రారంబించనున్నట్లు ఈ సంధర్భంగా తెలిపారు.

 భారత దేశంలో త్వరలో బుల్లెట్ రైళ్లు పరుగులు పెట్టనున్నాయి.

ఇది రెండవ ఒప్పందం ఇలాంటిదే సరిగ్గా 2007 లో తైవాన్ తో ఒక డీల్ కుదిరింది.

 భారత దేశంలో త్వరలో బుల్లెట్ రైళ్లు పరుగులు పెట్టనున్నాయి.

హై స్పీడ్ రైళ్లను అందించే దేశాలలో జపాన్ మొదటి స్థానంలో ఉంది. కాని 2013 లో ఇండోనేషియాతో కుదుర్చుకున్న ఇలాంటి ఒప్పందం లో జపాన్ చేతులెత్తేసింది.

 భారత దేశంలో త్వరలో బుల్లెట్ రైళ్లు పరుగులు పెట్టనున్నాయి.

ఈ హై స్పీడ్ రైలుకు చెందిన టెండర్లును ప్రకటిస్తే ప్రస్తుతం కవసాకి హెవి ఇండస్ట్రీస్, హిటాచి మరియు జె ఆర్ ఈస్ట్ వంటి సంస్థలు ఈ టెండర్ల ప్రక్రియలో పాల్గొననున్నాయి.

 భారత దేశంలో త్వరలో బుల్లెట్ రైళ్లు పరుగులు పెట్టనున్నాయి.

ముంబాయ్, అహ్మదాబాద్ నగరాల మధ్య ఈ హై స్పీడ్ బుల్లెట్ రైలు దాదాపుగా గంటకు 320 కిలో మీటర్ల వేగంతో పరుగులు పెట్టనుంది.

 భారత దేశంలో త్వరలో బుల్లెట్ రైళ్లు పరుగులు పెట్టనున్నాయి.

దీని నిర్మాణం 2017 సంవత్సరంలో ప్రారంభం కానుంది, మరియు అంచనా ప్రకారం దీనిని 2023 నాటికి పూర్తి చేయవచ్చు.

మరింత చదవండి

More from DriveSpark

Article Published On: Wednesday, December 9, 2015, 19:34 [IST]
English summary
India To Get Bullet Trains Soon; Could Sign Deal With Japan
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+