సుమారుగా 168 కార్లను కలిగి ఉన్న ముఖేష్ అంబానీ: విమానాలు,లగ్జరీ నౌకలు కూడా

By Anil

రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మెన్ ముఖేష్ అంబానీ ప్రపంచ ధనవతుల జాబితాలో ముందంజలో ఉన్నాడు. భారత దేశం మొత్తం గర్వించదగ్గ వ్యక్తి. ఎందుకంటే అతిని వ్యాపార దోరణిలో అతనికి ఎవరూ సాటిరారు.

అంతే కాదు మా దగ్గర ఉన్న సమాచారం ప్రకారం ముంబైలో ముఖేష్ అంబానీ నివాసం గురించి ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అందులో అతని ప్రయాణానికి ఉపయోగించే అత్యంత ఖరీదైన కార్లు, వివిద రకాల వాహనాలు మరియు విమానాలు, జెట్‌ ప్లేన్‌లు.. అంతేనా మీరు చూడాలే కాని ఇది ఇల్లా? లేక లగ్జరీ కార్ల షోరూమా...? అని ఆశ్చర్యపోతారు......

 విలాసవంతమైన ఇల్లు

విలాసవంతమైన ఇల్లు

గత ఏడాది ఫోర్బ్స్ వారు నిర్వహించిన అత్యంత ధనవంతుల జాబితాలో గల వ్యక్తులకు చెందిన అత్యంత ఖరీదైన వినాసాలను గల వారిలో ముఖేష్ అంబాని మొదటి స్థానంలో నిలిచాడు. దానికి కారణం కూడా ఈ నివాసమే. మరి ఇతని కార్లన్ని కూడా ఇక్కడే ఉంటాయి.

ఈ ఇంటి ప్రత్యేక్యత

ఈ ఇంటి ప్రత్యేక్యత

ముఖేష్ అంబానికు చెందిన ఈ విలాసవంతమైన నివాసం ఎత్తు 173.13 మీటర్లు ఉంది. ఇందులో మొత్తం 27 నివాసాలు కలవు, ప్రతి నివాసం యొక్క ఎత్తు మన మాముల నివాసాల ఎత్తుకు మూడు రెట్లు ఎత్తులో ఉంటాయి. మరియు ఈ మొత్తం నివాసాసం దాదాపుగా 4 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది. దీని మార్కెట్‌ విలువతో లెక్కగడితే దీని ధర ఎంతో తెలుసా ? అక్షరాల ఆరువేల నాలుగు వందల కోట్ల రుపాయలు(6,400 కోట్లు).

కార్ల ప్రియుడు

కార్ల ప్రియుడు

ముఖేష్ అంబాని కార్లను విపరీతంగా ప్రేమిస్తాడు. ఇతను వందల కొద్ది లగ్జరీ కార్లను దిగుమతి చేసుకున్నాడు. ప్రస్తుతం ఇతని దగ్గర ఉన్న కార్లన్ని ఇంటిలో నిండిపోయి. ఒక లగ్జరీ కార్ల షోరూమ్ తలపిస్తోంది.

కారు గ్యారేజి

కారు గ్యారేజి

ముఖేష్ అంబాని ఎప్పుడు ఏ కారులో వెళ్లాలో ముందుగా తెలుపడు అందుకే అతని నివాసంలో అన్ని కార్లను పార్క్ చేసి ఉంటారు.న అందుకోసం దాదాపుగా ఆరు టర్మినల్స్‌‌లో కార్లను నిలిపి ఉంటారు. అందులో దాదాపుగా 168 కార్లు ఉన్నట్లు సమాచారం. ఇది చూడటానికివ సర్వీసింగ్ కోసం వచ్చిన కార్ల గ్యారేజిను తలపిస్తుంది.

కారు కేర్ సెంటర్

కారు కేర్ సెంటర్

ముఖేష్ అంబాని నివాసంలో ఆరవ అంతస్తు వరకు కార్లను పార్క్ చేసి ఉంటారు. ఆ తరువాత ఏడవ అంతస్తుని కార్ల మరమత్తు కోసం ఏర్పాటు చేశారు. ఇక్కడ అంబాని కార్లకు చెందిన వివిద మరమ్మత్తులు జరుగుతూ ఉంటాయి. దీని కోసం ప్రత్యేకంగా షిప్ట్‌ల వారిగా మెకానిక్‌లు 24 గంటలు పనిచేస్తుంటారు.

అధికారిక కారు

అధికారిక కారు

ప్రస్తుతం ముఖేష్ అంబాని మేబ్యాక్ 62 కెర్టాన్ కారును అధికారికంగా వినియోగిస్తున్నాడు. దీని ధర దాదాపుగా 5 కోట్లుగా ఉంది. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం మఖేష్ అంబాని త్వరలో బియమ్‌‌డబ్ల్యూ కు చెందిన 7 సిరీస్ బుల్లెట్ ఫ్రూఫ్ ఫీచర్లు గల కారును ఉపయోగించనున్నాడు.

తరచుగా ఉపయోగించే మోడల్స్

తరచుగా ఉపయోగించే మోడల్స్

ముఖేష్ అంబాని మేబ్యాక్ 62 మోడల్ కారుతో పాటుగా మెర్సిడెస్ బెంజ్ యస్-క్లాస్, రోల్స్ రాయిస్ బెంట్లీ ప్లైయింగ్ హెచ్ ఫాంటమ్ స్పర్ మరియు మరికొన్ని కార్లను ఇతను సాధారణంగా ఉపయోగింస్తుంటాడు.

హెలీప్యాడ్స్

హెలీప్యాడ్స్

హెలీకాప్టర్లు దిగడానికి ఈ హెలీప్యాడ్స్‌ను ఉపయోగిస్తారు. ఇతని ఇంటి మీద ఇటువంటి హెలీప్యాడ్లు మూడు ఉన్నాయి. మరియు హెలీకాప్టర్లకు చెందిన కంట్రోలింగ్ మరియు ఫంక్షనింగ్ కోసం ప్రత్యేకమైన సొంత టెక్నాలజీ ఏర్పాటు చేసుకున్నాడు.

Image Source: Bornrich

విమానాలు

విమానాలు

ముఖేష్ అంబాని ఖాతాలో ఎయిర్ ‌బస్‌కు చెందిన ఎ319 విమానం మరియు బోయింగ్ బిజినెస్ జెట్ అయిన ఫాల్కన్ 900 ఇఎక్స్ మరియు రెండు ఇతర రాకాల విమానాలు కలవు. అయితే వీటన్నింటిలో గల అన్ని ఇంటీరియర్ డిజైన్‌లు అంబాని గారి సూచనల మేరకు తయారుచేయబడ్డాయి.

ఫాల్కన్ 900 ఇఎక్స్

ఫాల్కన్ 900 ఇఎక్స్

ఇది ఫ్రాన్స్ ఏవియేషన్ కు చెందిన విమానం ప్రసిద్ద విమానం. వ్యక్తిగత వినియోగాలకు దీనిని ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ సంస్థ వివిద రకాల మోడల్స్‌లో వీటిని అందిస్తోంది. అందులో ముఖేష్ అంబాని ఈ ఫాల్కన్ 900 ఇఎక్స్ మోడల్ ప్లైట్‌ను కొనుగోలు చేసాడు. ఇది నిరంతరంగా 8,340 కిలో మీటర్లు దూరం ప్రయాణం చేస్తుంది.

ప్రత్యేకమైన ఇంటీరియర్ డిజైన్

ప్రత్యేకమైన ఇంటీరియర్ డిజైన్

ఇందులో చిన్నచిన్న మీటింగ్‌లను నిర్వహించుకోవచ్చు మరియు తాత్కాలిక ఆఫీస్‌లను ఏర్పాటు చేసుకోవచ్చు. దీని కోసం దీనిని ప్రత్యేకంగా డిజైన్ చేయించాడు. అంతే కాకుండా ఇందులో శాటిలైట్ టివి, వైర్‌లెస్ కమ్యునికేషన్ మరియు ఎంటర్‌టైన్‌మంట్ ఫీచర్లు ఉన్నాయి.

 బోయింగ్ బిజినెస్ జెట్-2

బోయింగ్ బిజినెస్ జెట్-2

ఈ విమానంలో హోటల్ ఉన్న విధంగా ఫీచర్లు ఉన్నాయి. మరియు ముఖేష్ అంబాని అవసరాలను బట్టి దీనిని 78 రకాల మోడ్‌లలో ఉపయోగించుకోవచ్చు.

ధర

ధర

ఈ విమానం ధర కేవలం 70మిలియన్ డాలర్లు మాత్రమే అయితే ఇందులో గల ఇంటీరియర్‌ను తనకు నచ్చిన విధంగా తీర్చిదిద్దడానికి అదనంగా 30 మిలియన్ అమెరికన్ డాలర్లను ఖర్చు పెట్టారు. ఇందులో సంప్రదింపుల కోసం, సమావేశాల కోసం, అధికారిక అవసరాల కోసం ప్రత్యేకంగా ఇంటీరియర్‌ను డిజైన్ చేయించాడు. అంతే కాకుండా ఇందులో పడక గదిని కూడా ఏర్పాటు చేయించుకున్నాడు. అయితే ఈ విమానం ఒక గంట పాటు ప్రయాణించిందంటే దాదాపుగా 13,00 డాలర్లు ఖర్చు అవుతాయి తెలుసా ?

 ఎయిర్‌బస్ 319 కార్పోరేట్ జెట్

ఎయిర్‌బస్ 319 కార్పోరేట్ జెట్

ముఖేష్ అంబాని ఈ ఎయిర్‌బస్ 319 కార్పోరేట్ జెట్ ఫ్లైట్‌ను తన భార్య నీతా అంబానికి బహుకరించాడు. దీని ధర 242 కోట్ల రుపాయలు. ఇంది ఎంతో విశాలమైనది మరియు విలాసవంతమైనది. దీనిని పూర్తిగా వ్యక్తిగత అవసరాలకు ఉపయోగపడే విధంగా స్పెషల్‌‌గా రూపొందించారు.

 ప్రత్యేకతలు

ప్రత్యేకతలు

నీతా అంబాని బహుమతిగా పొందిన ఈ ఎయిర్‌బస్ 319 విమానం నిర్విరామంగా 11,100 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. మరియు ఇది గరిష్టంగా ఇది గంటకు 1,012 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోగలదు. ప్రపంచ వ్యాప్తంగా గల అతి ఉత్తమమైన వ్యక్తిగత విమానాలలో ఇది చోటు సంపాదించింది.

 లగ్జరీ యాచ్

లగ్జరీ యాచ్

ముఖేష్ అంబాని ఈ లగ్జరీ యాచ్ కోసం దాదాపుగా 20 మిలియన్ అమెరికన్ డాలర్లు‌ను ఖర్చు పెట్టాడు.

 విలాసాల నిలయం

విలాసాల నిలయం

ముఖేష్ అంబానికి చెందిన ఈ అత్యంత ఖరీదైన యాచ్‌లో ఎన్నో విలాసవంతమైన ఫీచర్లు ఉన్నాయి. అందులో స్విమ్మింగ్ ఫూల్, హెలిప్యాడ్, మసాజ్ రూమ్, ఎంటర్‌టైన్‌మెంట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ లగ్జరీ బోటులో దాదాపుగా 12 మంది అథిదులకు మర్యాదలు చేయవచ్చు, ఇందులో 20 మంది పని వారు ఉంటారు, ఈ లగ్జరీ యాచ్ 80 శాతం వరకు కరెంట్‌తో పని చేస్తుంది. అందుకోసం సోలార్ పవర్‌ను ఉపయోగించుకుంటుంది.

మరిన్ని ఇంట్రెస్టింగ్ విశయాల మీ కోసం
  • కారు కొనమని సలహా ఇస్తే... కార్ల కంపెనీనే కొనేశాడు...!!
  • బీరు, బారు, కారు.. ఇది మాల్యా తీరు..!
మారుతి సుజుకి

మారుతి సుజుకి అతి త్వరలో ఇండియన్ మార్కెట్లోకి సరికొత్త 2017 స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్‌ను విడుదల చేయనుంది. ఈ స్విఫ్ట్ ఎక్ట్సీరియర్ మరియు ఇంటీరియర్ ఫోటోల కోసం....

 

Most Read Articles

English summary
Indias Richest Man Mukesh Ambani Home Car Garage
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Drivespark sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Drivespark website. However, you can change your cookie settings at any time. Learn more