సామాన్యులు కొనగలిగే ధరలో కొత్తగా చిన్న కార్లు వస్తున్నాయ్.. డబ్బులు సిద్ధం చేసుకోండి!

భారతదేశంలో చిన్న SUVలు, ముఖ్యంగా సబ్-4 మీటర్ కాంపాక్ట్ SUVల విభాగం ప్రస్తుతం అత్యంత వేగంగా పెరుగుతున్న మార్కెట్లలో ఒకటి. కుటుంబ ప్రయాణాలకు సరిపోయే స్థలం, ఆకర్షణీయమైన డిజైన్, అలాగే తక్కువ ధరలో లభించడం వంటి కారణాల వల్ల ఈ కార్లకు భారీగా డిమాండ్ పెరుగుతోంది. చిన్న పరిమాణంలో ఉన్నప్పటికీ, ఈ SUVలు ఐదుగురు ప్రయాణికులు సౌకర్యవంతంగా కూర్చునేలా మంచి క్యాబిన్ స్పేస్‌ను అందిస్తాయి. అందుకే చిన్న కుటుంబాల కోసం ఇవి ఉత్తమ ఎంపికగా మారాయి. నగర రహదారులపై సులభంగా నడపడం, పార్కింగ్ చేయడం కూడా వీటి మరో ప్రధాన ప్రయోజనం. ఇదిలా ఉంటే పూర్తిగా కొత్త డిజైన్‌తో కూడిన సబ్-4 మీటర్ కాంపాక్ట్ SUVలను పలు కంపెనీలు సామాన్యులు కొనగలిగే ధరలో విడుదల చేయడానికి సిద్ధమవుతున్నాయి. వాటి గురించి ఈ కథణంలో.

VinFast VF3: వియత్నాంకు చెందిన ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ విన్‌ఫాస్ట్ కొత్తగా వీఎఫ్3ని తీసుకురావడానికి సిద్ధమైంది. ఈ ఎలక్ట్రిక్ కారు 43.5 hp శక్తిని ఉత్పత్తి చేసే ఎలక్ట్రిక్ మోటార్‌తో పనిచేస్తుంది. దీనికి 18.6 kWh సామర్థ్యం గల బ్యాటరీ ప్యాక్ అమర్చబడుతుంది. ధర విషయానికి వస్తే, ఈ చిన్న ఎలక్ట్రిక్ SUVను భారత మార్కెట్లో రూ. 8 లక్షల నుండి రూ. 10 లక్షల మధ్య ఉండవచ్చు.

Upcoming Small Suv Cars Under 4 Meter In India Launch Details

Maruti Suzuki Brezza Facelift: దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మారుతి తన ప్రముఖ సబ్-4 మీటర్ కాంపాక్ట్ SUV అయిన బ్రెజ్జాకు ఫేస్‌లిఫ్ట్ రూపంలో కొత్త అప్‌డేట్‌ను తీసుకురావడానికి సిద్ధమవుతోంది. ఈసారి బ్రెజ్జాలో టర్బో ఇంజిన్ ఎంపికను అందించే అవకాశం ఉందని ఆటో వర్గాలు చెబుతున్నాయి. 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో ఈ మోడల్ రానుందని, దీనికి 6-స్పీడ్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఎంపికలు అందుబాటులో ఉండే అవకాశం ఉంది.

Hyundai Exter: దక్షిణ కొరియా ఆటోమొబైల్ కంపెనీ హ్యూందాయ్ తన ప్రసిద్ధ సబ్-4 మీటర్ కాంపాక్ట్ SUV అయినకు ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను త్వరలో భారత మార్కెట్లో విడుదల చేసే అవకాశం ఉంది. తాజా సమాచారం ప్రకారం, ఈ కొత్త మోడల్ ఈ ఏడాది మార్చి లేదా ఏప్రిల్ నెలల్లో లాంచ్ అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌లో ముఖ్యంగా ఇంటీరియర్, ఫీచర్లలో కొన్ని నవీకరణలు ఉండనున్నాయి.

Upcoming Small Suv Cars Under 4 Meter In India Launch Details

ఇందులో పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో పాటు డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను కూడా అప్‌డేట్ చేసే అవకాశం ఉంది. అలాగే ప్రయాణికుల సౌకర్యాన్ని పెంచేందుకు వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, వెనుక సన్‌షేడ్‌లు వంటి కొత్త కంఫర్ట్ ఫీచర్లు కూడా చేరే అవకాశం ఉందని సమాచారం. అయితే ఇంజిన్ విభాగంలో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న ఇంజిన్ ఎంపికలతోనే ఈ కొత్త ఫేస్‌లిఫ్ట్ మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది.

Mahindra Vision X: మహీంద్రా విసన్ ఎక్స్ ఇప్పటికే మార్కెట్లో ఉన్న XEV 9e మోడల్‌కు దగ్గరగా ఉండే డిజైన్‌ను కలిగి ఉండనుందని సమాచారం. మహీంద్రా రూపొందించిన కొత్త NU_IQ ప్లాట్‌ఫామ్‌పై ఈ సబ్-4 మీటర్ SUV నిర్మించబడనుంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం, ఈ కొత్త SUV 2027లో లేదా ఈ సంవత్సరం చివర్లో లాంచ్ అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు.

Upcoming Small Suv Cars Under 4 Meter In India Launch Details

Honda WR-V: ఇక జపాన్‌కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ హోండా కూడా భారత మార్కెట్ కోసం కొత్త SUVను సిద్ధం చేస్తోంది. కంపెనీ డబ్ల్యూ వీఆర్ ఎస్ వెర్షన్‌ను సబ్-4 మీటర్ SUVగా తీసుకురావాలని యోచిస్తోంది. హోండా విస్తరణ వ్యూహంలో భాగంగా ఈ కొత్త మోడల్ త్వరలో మార్కెట్లోకి రావచ్చని సమాచారం. ఈ SUVకు అమేజ్ మూడవ తరం మోడల్‌లో ఉపయోగించే 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌ను ఇవ్వవచ్చని అంచనా.

More from DriveSpark

Article Published On: Friday, March 6, 2026, 10:55 [IST]
English summary
Upcoming small suv cars under 4 meter in india launch details
Read more on: #auto news #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+