Just In
- 13 min ago
గుడ్ న్యూస్.. బిఎమ్‌డబ్ల్యూ 2 సిరీస్ గ్రాన్ కూపే M స్పోర్ట్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. వచ్చేసిందోచ్
- 41 min ago
డీలర్‌షిప్‌లో ప్రత్యక్షమైన టాటా సఫారీ; ఇంటీరియర్ ఫొటోలు లీక్
- 2 hrs ago
ఇదుగిదిగో.. కొత్త 2021 ఫోర్స్ గుర్ఖా; త్వరలో విడుదల, కొత్త వివరాలు వెల్లడి
- 3 hrs ago
కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ ఎప్పుడు? ఇందులో కొత్తగా ఏయే ఫీచర్లు ఉండొచ్చు?
Don't Miss
- Sports
పుజారా.. బ్యాటింగ్ చేస్తుంటే నీకు బోర్ కొట్టదా?! వెలుగులోకి మరో ఆసీస్ ప్లేయర్ స్లెడ్జింగ్!
- Movies
టాలీవుడ్లో మరో భారీ మల్టీస్టారర్: బన్నీ, విజయ్ కాంబోలో మూవీ.. చిన్న డైరెక్టర్.. పెద్ద నిర్మాత ప్లాన్!
- News
అప్పుడెందుకు వాయిదా వేశారు ? జగన్ కు మద్దతుగా పంచాయితీ పోరుపై నటుడు సుమన్ కీలక వ్యాఖ్యలు
- Finance
సెన్సెక్స్ దిద్దుబాటు! నిర్మల ప్రకటన అంచనాలు అందుకోకుంటే.. మార్కెట్ పతనం?
- Lifestyle
Zodiac signs: మీ రాశిని బట్టి మీకు ఎలాంటి మిత్రులు ఉంటారో తెలుసా...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
గంటకు 180 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీసే 'విస్టాడోమ్' కోచ్ ట్రయల్ రన్ సక్సెస్
ఇటీవలి కాలంలో భారతీయ రైల్వేస్ సాంకేతికంగా చాలా అభివృద్ధి చెందింది. న్యూఢిల్లీలో ఇప్పటికే డ్రైవర్‌లెస్ మెట్రో రైళ్లు అందుబాటులోకి రాగా, తాజాగా గంటకు 180 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీసే విస్టాడోమ్ టూరిస్ట్ కోచ్‌లను ప్రయాణీకుల కోసం అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఇండియన్ రైల్వేస్ సన్నాహాలు చేస్తోంది.

ఈమేరకు విస్టాడోమ్ టూరిస్ట్ కోచ్‌ల ట్రయల్ రన్‌ను భారతీయ రైల్వేస్ విజయవంతంగా పూర్తి చేసిందని రైల్వే మంత్రి పియూష్ గోయల్ తెలిపారు. ఈ కోచ్‌లు ప్రయాణికుల రైలు ప్రయాణాన్ని చిరస్మరణీయంగా మార్చబోతున్నాయని మరియు పర్యాటక రంగాన్ని కూడా ప్రోత్సహిస్తాయని ఆయన చెప్పారు.

ఈ విస్టాడోమ్ టూరిస్ట్ కోచ్‌లను చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ తయారుచేస్తోంది. ఈ విలాసవంతమైన కోచ్‌లకు సంబంధించిన పలు చిత్రాలను పియూష్ గోయల్ తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రజలతో పంచుకున్నారు
MOST READ:వెహికల్ ఛార్జింగ్ కోసం మొబైల్ ఛార్జింగ్ రోబోట్స్ ; పూర్తి వివరాలు

పియూష్ గోయల్ తన ట్విట్టర్ ఖాతాలో.. "ఈ సంవత్సరాన్ని చాలా గొప్పగా ముగిస్తున్నందు సంతోషంగా ఉంది. ఇండియన్ రైల్వేస్ కొత్తగా డిజైన్ చేసిన విస్టాడోమ్ టూరిస్ట్ కోచ్ యొక్క 180 కిలోమీటర్ల వేగ పరీక్షను విజయవంతంగా పూర్తి చేసింది. ఈ కోచ్‌లు ప్రయాణికుల రైలు ప్రయాణాలను చిరస్మరణీయంగా మారుస్తాయి మరియు పర్యాటక రంగానికి మరింత ప్రోత్సాహాన్నిస్తాయి " అని ట్వీట్ చేశారు.

ఇండియన్ రైల్వేస్ ఈ విస్టాడోమ్ కోచ్‌లను ప్రత్యేకించి టూరిజం ప్రయోజనాల కోసం డిజైన్ చేసింది. ఇందులో విలాసవంతమైన ఇంటీరియర్స్ మరియు సౌకర్యవంతమైన సీట్స్ ఉంటాయి. ఇవి విశాలమైన పారదర్శక కిటికీలు మరియు గ్లాస్ రూఫ్‌లను కలిగి ఉండి, ట్రైన్ లోపలి నుండి ప్రకృతి అందాలను పూర్తిగా వీక్షించేలా ఉంటాయి.
MOST READ:జనవరి 2021లోనైనా కొత్త ఫోర్స్ గుర్ఖా వచ్చేనా? థార్‌కి పోటీ ఇచ్చేనా?

భారత రైల్వేలో 13 విస్టాడోమ్ కోచ్‌లు ఉన్నాయి, అవి ప్రస్తుతం భారతదేశంలో ఎంపిక చేసిన మార్గాల్లో నడుస్తున్నాయి. దాదర్ మరియు మద్గావ్, అరకు వ్యాలీ, కాశ్మీర్ వ్యాలీ, డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే, కల్కా సిమ్లా రైల్వే, కాంగ్రా వ్యాలీ రైల్వే, మాథరన్ హిల్ రైల్వే మరియు నీలగిరి మౌంటైన్ రైల్వే మార్గాల్లో విస్టాడోమ్ కోచ్‌లు ఉన్నాయి.

అబ్జర్వేషన్ విండోస్, గ్లాస్ రూఫ్ లుకౌట్, రొటేటబుల్ సీట్లు, ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, ఆటోమేటిక్ స్లైడింగ్ డోర్స్, మినీ ప్యాంట్రీ, వికలాంగుల కోసం విశాలమైన తలుపులు వంటి ఫీచర్లు ఈ కోచ్‌లోల ఉంటాయి. ఒక విస్టాడోమ్ కోచ్ తయారీకి సుమారు 4 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది.
MOST READ:ఈ రోడ్డుపై ప్రయాణించడానికి ధైర్యం కావాలి.. ఈ వీడియో చూడటానికి గుండె ధైర్యం కావాలి

ఈ విస్టాడోమ్ కోచ్‌లలో ప్రయాణీకుల భద్రతకు భరోసా ఇచ్చేందుకు గాను ఇందులో అన్ని ప్రామాణిక భద్రతా ఫీచర్లు ఉంటాయి. అంతేకాకుండా, ఈ విస్టాడోమ్ కోచ్‌ల తయారీలో షాటర్స్-రెసిస్టెంట్ గాజులు మరియు ప్రయాణీకుల భద్రత కోసం ఫిల్మ్ కోటింగ్‌ను కూడా ఉపయోగించారు.

పశ్చిమ బెంగాల్‌లోని బంగవాన్ మరియు పెట్రాపోల్ మధ్య కొత్తగా విద్యుదీకరించిన రైలు మార్గంలో తమిళనాడులో నీలగిరి మౌంటైన్ రైల్వే సేవలను తిరిగి ప్రారంభించామని మరియు ఈ మార్గంలోని ఎలక్ట్రిక్ లోకోమోటివ్ విజయవంతంగా ట్రయల్ రన్‌ను పూర్తి చేసుకుందని గోయల్ ప్రకటించారు.
MOST READ:అటల్ టన్నెల్‌లో కొత్త రికార్డ్ ; ఏంటో అది అనుకుంటున్నారా.. ఇది చూడండి

న్యూఢిల్లీలో డ్రైవర్‌లెస్ మెట్రో రైళ్లు
గత సోమవారం నాడు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దేశపు మొట్టమొదటి డ్రైవర్‌రహిత మెట్రో రైలును దేశ రాజధాని న్యూఢిల్లీలో ప్రారంభించారు. ఈ సందర్భంగా నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్ (ఎన్‌సిఎంసి) సేవలను కూడా ఆయన ప్రారంభించారు. - మరింత సమాచారం కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.