Just In
- 10 hrs ago
కారులో ఉన్న పాడిల్ షిఫ్ట్ ఫీచర్ యొక్క ప్రయోజనాలు
- 21 hrs ago
భారత్‌లో ఫేమ్ స్కీమ్స్ కింద స్థాపించబడిన EV ఛార్జింగ్ స్టేషన్లు
- 22 hrs ago
టాటా టిగోర్ ఈవి ఫేస్‌లిఫ్ట్ వివరాలు వెల్లడి; ఎక్స్ ప్రెస్-టి పేరుతో త్వరలోనే లాంచ్!
- 24 hrs ago
హైదరాబాద్‌లో విడుదల కానున్న బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ - డీటేల్స్
Don't Miss
- Movies
Rang De Total Collections: నితిన్‌కు రెండో షాక్.. 24.50 కోట్ల టార్గెట్.. చివరకు వచ్చింది ఎంతంటే!
- Sports
మంచి గిఫ్ట్‌తో బెన్‌స్టోక్స్‌కు రాజస్థాన్ రాయల్స్ వీడ్కోలు..!
- News
కరోనా టీకానే వివేక్‌ను బలి తీసుకుంది.. నటుడు మన్సూర్ అలీ ఖాన్ ఆరోపణలు
- Finance
జీరో బ్యాలెన్స్ ఖాతాల్లో ట్రాన్సాక్షన్స్ ఛార్జీలపై ఎస్బీఐ వడ్డీ రేటు, ఫ్రీ ట్రాన్సాక్షన్స్
- Lifestyle
ఈ వారం 18వ తేదీ నుండి ఏప్రిల్ 24వ తేదీ వరకు మీ రాశిఫలాలు...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఇకపై ఈ రైళ్లకు డ్రైవర్ అవసరం లేదు.. ఇదెక్కడో కాదు మనదేశంలోనే..
భారత రైల్వేస్‌లో ఈరోజు మరో గుర్తుంచుకోదగిన అరుదైన సంఘటన జరిగింది. నేడు (సోమవారం) భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దేశపు మొట్టమొదటి డ్రైవర్‌రహిత రైలును (డ్రైవర్‌లెస్ ట్రైన్ లేదా అటానస్ ట్రైన్)ను దేశ రాజధాని న్యూఢిల్లీలో ప్రారంభించారు.

ఈ సందర్భంగా నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్ (ఎన్‌సిఎంసి) సేవలను కూడా ఆయన ప్రారంభించారు. మెజెంటా లైన్‌గా పిలిచే విమానాశ్రయం ఎక్స్‌ప్రెస్ లైన్‌లో న్యూఢిల్లీలోని జనక్‌పురి వెస్ట్, బొటానికల్ గార్డెన్‌ను కలుపుతూ డ్రైవర్‌లెస్ రైలు కార్యకలాపాలు కొనసాగుతాయి.

ఈ రైలు సేవలను పూర్తిగా యాంత్రికంగా నిర్వహిస్తారు, ఇందులో డ్రైవర్ అవసరం ఉండదు. ప్రస్తుతానికి ఈ సేవలు కేవలం మెజంటా లైన్‌కు మాత్రమే వర్తిస్తాయి. అయితే, ఈ ఏడాది మధ్య భాగం నాటికి డ్రైవర్ రహిత రైలు సేవలను పింక్ లైన్‌కు కూడా వర్తింప జేయాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది.
MOST READ:రెండు గంటల్లోనే రూ.29.5 లక్షల జరిమానాలు, పోలీసుల రికార్డ్

ఈ కొత్త సాంకేతిక పరిజ్ఞానం ప్రయాణ సౌకర్యాన్ని మరింత మెరుగుపరుస్తుందని ప్రధాని కార్యాలయం పేర్కొంది. మెజెంటా లైన్ ఢిల్లీలోని జనక్‌పురి వెస్ట్‌ను మరియు నోయిడాలోని బొటానికల్ గార్డెన్ లైన్‌తో కలుపుతుంది. ఈ అటానమస్ ట్రైన్ యొక్క ట్రయల్ రన్‌ను డిసెంబర్ 2017లో పింక్ లైన్‌లోని 20 కిలోమీటర్ల విస్తీర్ణంలో నిర్వహించారు.

వచ్చే 2022 నాటికి ఢిల్లీ మెట్రో నెట్‌వర్క్ మొత్తాన్ని డ్రైవర్ రహిత మెట్రోగా మార్చేందుకు భారత రైల్వేస్ మరియు ప్రభుత్వ సంస్థలు కలిసి పనిచేస్తున్నాయి. ఈ డ్రైవర్ రహిత మెట్రో రైలుని ఢిల్లీ మెట్రోలోని మూడు కమాండ్ సెంటర్ల ద్వారా ఆపరేట్ చేస్తారు, ఈ కమాండ్ సెంటర్లలో సిబ్బంది మినహా రైలులో ఎలాంటి డ్రైవర్ ఉండరు.
MOST READ:మోడీ ప్రారంభించిన అటల్ టన్నెల్‌లో 7 మంది అరెస్ట్.. ఎందుకో తెలుసా ?

ఈ రైలులో కమ్యూనికేషన్ ఆధారిత రైలు నియంత్రణ సిగ్నలింగ్ టెక్నాలజీ ఉంటుంది. ఇది రైలు ఆపరేషన్ సమయంలో ఎదురయ్యే ఏ సమస్యను అయినా పరిష్కరించగలదు. ఇందులో హార్డ్వేర్ పునఃస్థాపన సమయంలో మాత్రమే మానవ సాయం అవసరం అవుతుంది, మిగిలిన సందర్భాల్లో దీనిని నడిపేందురు డ్రైవర్ అవసరం ఉండదు.

కమాండ్ సెంటర్ నుండే ప్రయాణీకుల సమాచార వ్యవస్థను ఇన్ఫర్మేషన్ కంట్రోలర్ ద్వారా నియంత్రించడం జరుగుతుంది. అంటే, ప్రయాణీకులకు కావల్సిన సహాయం కూడా ఈ కమాండ్ సెంటర్ నుండే అందించబడుతుంది. సిసిటివిల సాయంతో క్రౌడ్‌ను పర్యవేక్షించడం మరియు రియల్ టైమ్ రైలు పరికరాలను పర్యవేక్షించడం జరుగుతుంది.
MOST READ:నిర్మానుష్య రోడ్డుపై వెళ్తున్నారా.. అయితే టేక్ కేర్.. ఎందుకో వీడియో చూడండి

ఈ ఆటోమేటిక్ రైలును ప్రస్తుతం లైన్ 7 మరియు లైన్ 8 లకు మాత్రమే పరిమితం చేశారు. రానున్న రోజుల్లో ఈ సేవలను మొత్తం ఢిల్లీ మెట్రో నెట్‌వర్క్‌కు అందుబాటులోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు.
ఇక నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్ విషయానికి వస్తే, ఈ కార్డు సాయంతో నగరంలోని వివిధ రకాల రవాణా సాధానాలను యాక్సెస్ చేసుకోవచ్చు. గతేడాది మార్చ్ నెలలో ఈ కార్డు రూపకల్పను శ్రీకారం చుట్టారు. ప్రజలు ఈ కార్డుతో మెట్రో, టోల్ టాక్స్, రైలు టికెట్, పార్కింగ్ ఛార్జ్ మరియు బస్సు ఛార్జీలను చెల్లించవచ్చు.

రూపే పథకం కింద నేషనల్ కామన్ మొబిలిటీ కార్డు జారీ చేయబడింది. రూపే అనేది నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రారంభించిన జాతీయ కార్డు పథకం. ఇది వీసా లేదా మాస్టర్ కార్డ్ వంటి విదేశీ కార్డుల మాదిరిగానే పనిచేస్తుంది. అయితే, రూపే కార్డును ప్రత్యేకించి భారతదేశం కోసం తయారు చేయబడినది మరియు లావాదేవీల ఖర్చులను తగ్గించాలనే లక్ష్యంతో ప్రవేశపెట్టబడినది.
MOST READ:అద్భుతంగా ఉన్న మలయాళీ స్టార్ మమ్ముట్టి లగ్జరీ కారవాన్.. చూసారా !

రూపే కార్డులు డెబిట్ లేదా క్రెడిట్ కార్డుల రూపంలో లభిస్తాయి. వీసా మరియు మాస్టర్ కంపెనీలతో పోల్చుకుంటే దీని లావాదేవీ ఖర్చులు తక్కువగా ఉంటాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్ సహా 25 బ్యాంకులు ఈ రూపే కార్డులను జారీ చేస్తాయి. ఏటిఎమ్ నుండి నగదు విత్‌డ్రా చేయటానికి, షాపింగ్ చేయడానికి ఈ నేషనల్ కామన్ మొబిలిటీ కార్డును కూడా ఉపయోగించవచ్చు.