భారతదేశపు మొట్టమొదటి Lamborghini Urus Graphite కొన్న Jr NTR; దీని ధర తెలిస్తే షాక్ అవుతారు

సాధారణంగా సినీ రంగంలో ఉన్న వారికి ఖరీదైన అత్యంత విలాసవంతమైన కార్లంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలామంది హీరోలు ఎప్పటికప్పుడు ట్రెండ్ కి సరిపోయే విధంగా వారి వాహనాలను మారుస్తూ ఉంటారు. తెలుగు సినీ ఇండస్ట్రీలో Jr NTR ఇందులో ముందుంటాడు.

భారతదేశపు మొట్టమొదటి లంబోర్ఘిని ఉరస్ గ్రాఫైట్ కొన్న Jr NTR

సినీ ప్రేమికులకు Jr NTR అంటే తెలియని వారు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే తాతకు తగ్గ మనవడిగా తెలుగు చిత్ర సీమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. సినీ పరిశ్రమలో ఎక్కువమంది అభిమానులను కలిగి ఉన్న హీరోలలో NTR ఒకరు. NTR కి సినిమాలపై ఎంత ఆసక్తి ఉందో, కార్లు మరియు బైకులపై కూడా అంతే ఇష్టం ఉంది. ఈ కారణంగానే NTR ఇప్పటికే అనేక అన్యదేశపు లగ్జరీ కార్లు, బైకులని కలిగి ఉన్నారు.

భారతదేశపు మొట్టమొదటి లంబోర్ఘిని ఉరస్ గ్రాఫైట్ కొన్న Jr NTR

ఇదిలా ఉండగా ఇటీవల NTR మరో కొత్త సూపర్ కారు కొనుగోలు చేసినట్లు తెలిసింది. ఎన్టీఆర్ కొనుగోలు చేసిన కొత్త సూపర్ కార్ Lamborghini బ్రాండ్ యొక్క కొత్త Urus Graphite Capsule Edition. ఈ కొత్త ఎడిషన్ హైదరాబాద్‌లోని అతని ఇంటికి డెలివరీ చేయబడింది.

భారతదేశపు మొట్టమొదటి లంబోర్ఘిని ఉరస్ గ్రాఫైట్ కొన్న Jr NTR

NTR కొనుగోలు చేసిన కారు నిజంగా చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంది. ఇది నీరో నోక్టిస్ మ్యాట్‌తో అరాన్సియో అర్గోస్‌తో కాంట్రాస్ట్ కలర్‌తో ఉంది. ఈ సూపర్ కార్ డెలివరీకి ముందు బెంగుళూరులో పార్క్ చేసిన ఫోటోను కూడా ఇన్స్టాగ్రామ్ షేర్ చేశారు.

భారతదేశపు మొట్టమొదటి లంబోర్ఘిని ఉరస్ గ్రాఫైట్ కొన్న Jr NTR

Lamborghini Urus Graphite Capsule Edition (లంబోర్ఘిని ఉరుస్ గ్రాఫైట్ క్యాప్సూల్ ఎడిషన్) కొన్ని రోజుల క్రితం భారతదేశంలో ప్రవేశపెట్టబడింది. ఈ కొత్త ఎడిషన్ విభిన్న కలర్ షేడ్స్ కలిగి ఉంటుంది. దేశీయ మార్కెట్లో Lamborghini Urus Graphite Capsule Edition (లంబోర్ఘిని ఉరుస్ గ్రాఫైట్ క్యాప్సూల్ ఎడిషన్) ధర రూ. 3.15 కోట్లు (ఎక్స్-షోరూమ్).

భారతదేశపు మొట్టమొదటి లంబోర్ఘిని ఉరస్ గ్రాఫైట్ కొన్న Jr NTR

Lamborghini Urus Graphite Capsule Edition (లంబోర్ఘిని ఉరుస్ గ్రాఫైట్ క్యాప్సూల్ ఎడిషన్) లేటెస్ట్ ఫీచర్స్ మరియు పరికరాలతో చాలా హుందాగా ఉంటుంది. ఇది మునుపటికంటే మోడల్స్ కంటే కూడా చాలా కొత్తగా వాహనదారునికి మరింత అనుకూలంగా కూడా ఉంటుంది. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా మీరు ఇక్కడ గమనించవచ్చు.

భారతదేశపు మొట్టమొదటి లంబోర్ఘిని ఉరస్ గ్రాఫైట్ కొన్న Jr NTR

Lamborghini Urus Graphite Capsule Edition (లంబోర్ఘిని ఉరుస్ గ్రాఫైట్ పెర్ల్ క్యాప్సూల్ ఎడిషన్) విషయానికొస్తే, అత్యాధునిక డిజైన్ కలిగిన వేగవంతమైన ఎస్‌యూవీలలో ఇది ఒకటి. ఇది డ్యూయెల్-టోన్ కలర్ స్కీమ్‌లో అందుబాటులో ఉంటుంది. గ్రాఫైట్ ఎడిషన్ క్యాబిన్ లోపల డార్క్ యానోడైజ్డ్ అల్యూమినియం మరియు మ్యాట్ ఫినిష్ కార్బన్ ఫైబర్‌తో ట్రిమ్ ఇన్సర్ట్‌లు ఉన్నాయి. సీట్లు ఆల్కాంటారాలో పూర్తయిన హెక్సాగోనల్ స్టిచ్చింగ్ మరియు లెదర్ ఇన్సర్ట్‌లతో పూర్తయ్యాయి.

భారతదేశపు మొట్టమొదటి లంబోర్ఘిని ఉరస్ గ్రాఫైట్ కొన్న Jr NTR

Capsule Edition యొక్క ఇంజిన్ విషయానికి వస్తే, ఇందులో హుడ్ కింద అదే 4.0 లీటర్-టర్బోచార్జ్డ్ వి8 యూనిట్ ఉంది. ఇది 641 బిహెచ్‌పి మరియు 850 ఎన్ఎమ్ టార్క్‌ అందిస్తుంది. ఇది ఎనిమిది-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడుతుంది. ఈ కొత్త సూపర్ ఎస్‌యూవీ బరువు 2.2 టన్నుల వరకు ఉంటుంది. అయినప్పటికీ ఈ సూపర్ కారు యొక్క గరిష్ట వేగం 305 కిలోమీటర్ల వరకు ఉంటుంది. అంతే కాకుండా ఈ ఎస్‌యూవీ కేవలం 3.6 సెకన్లలో 0 నుంచి 100 కిలోమీటర్ల వరకు వేగవంతమవుతుంది.

భారతదేశపు మొట్టమొదటి లంబోర్ఘిని ఉరస్ గ్రాఫైట్ కొన్న Jr NTR

భారతదేశంలో ఇంత ఖరీదైన కారు కొన్న మొదటి వ్యక్తి NTR అని చెబుతున్నారు. అయితే ఇంతకు ముందు కూడా మొట్టమొదటి Harley Davidson Bike (హార్లీ డేవిడ్సన్‌ బైక్‌) కొన్న ఫస్ట్ హీరోగా NTR నిలిచారని తెలుస్తుంది. ఇప్పుడు కారు విషయంలోనూ ఆయనే ఫస్ట్ అంటూ తారక్‌ ఫ్యాన్స్ సంబపరడుతున్నారు.

భారతదేశపు మొట్టమొదటి లంబోర్ఘిని ఉరస్ గ్రాఫైట్ కొన్న Jr NTR

Jr NTR ఇప్పటికే Porsche (పోర్స్చే) వంటి ఖరీదైన కార్లను కూడా కలిగి ఉన్నాడు. రెండు సీట్ల Porsche నడిపిన ఏకైక నటుడు Jr NTR. ఈ కారు ధర ఒక కోటి రూపాయలు. ఈ కారులో 3,436 సిసి ఇంజన్ ఉంది, ఇది 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో పనిచేస్తుంది.

భారతదేశపు మొట్టమొదటి లంబోర్ఘిని ఉరస్ గ్రాఫైట్ కొన్న Jr NTR

ఇప్పుడు NTR రాజమౌళి దర్శకత్వంలో రానున్న ఆర్ఆర్‌ఆర్‌ షూటింగ్‌ని పూర్తి చేసుకున్నారు. మరోవైపు త్వరలోనే ఆయన కొరటాల శివ దర్శకత్వంలో రూపొందబోతున్న చిత్రం ప్రారంభించనున్నారు. దీంతోపాటు ఆయన టీవీ హోస్ట్ గా చేస్తున్న మీలో ఎవరు కోటీశ్వరులు ప్రోగ్రామ్‌ ఈ నెల 22న జెమినీ టీవీలో ప్రసారం కాబోతుంది.

Lamborghini Urus Graphite Capsule Edition (లంబోర్ఘిని ఉరుస్ గ్రాఫైట్ క్యాప్సూల్ ఎడిషన్) గురించి మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Most Read Articles

English summary
Jr ntr buys lamborghini urus graphite capsule edition
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X