లంబోర్ఘిని ఉరుస్ గ్రాఫైట్ క్యాప్సూల్ ఎడిషన్; ఇప్పుడు మరింత సూపర్ లుక్ & సూపర్ ఫీచర్స్

లంబోర్ఘిని ఉరస్ గ్రాఫైట్ క్యాప్సూల్ ఎడిషన్ భారతదేశంలో విడుదలైన విషయం తెలిసిందే. ఇటీవల ముంబైలోని లంబోర్ఘిని డీలర్‌షిప్‌లో ఈ సూపర్ SUV యొక్క స్పెషల్ ఎడిషన్‌ను తనిఖీ చేసే అవకాశం మాకు లభించింది. లంబోర్ఘిని ఉరస్ గ్రాఫైట్ క్యాప్సూల్ గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

భారత్‌లో అమ్మకానికి సిద్దమైన లంబోర్ఘిని ఉరుస్ గ్రాఫైట్ క్యాప్సూల్ ఎడిషన్ ; వివరాలు

లంబోర్ఘిని ఉరస్ గ్రాఫైట్ క్యాప్సూల్ ఎడిషన్ యొక్క ముందు భాగంలో డిఆర్ఎల్ తో ఈ సొగసైన హెడ్‌ల్యాంప్‌ చూడవచ్చు. లంబోర్ఘిని ఎల్ఈడీ మ్యాట్రిక్స్ హెడ్‌ల్యాంప్‌లను ఉపయోగించింది. దిగువన వెంట్స్ కూడా గమనించవచ్చు. ఈ ఎస్‌యూవీ యొక్క కలర్ చాలా అద్భుతంగా ఉంది. లంబోర్ఘిని లోగో మాట్టే బ్లాక్ కలర్‌లో ఉంటుంది. దీనికి దిగువన ఆరెంజ్ కలర్ లిప్ ఉంది, ఇది గ్రాఫైట్ క్యాప్సూల్ ఎడిషన్‌లోని ముఖ్యమైన ఎలిమెంట్లలో ఒకటి.

భారత్‌లో అమ్మకానికి సిద్దమైన లంబోర్ఘిని ఉరుస్ గ్రాఫైట్ క్యాప్సూల్ ఎడిషన్ ; వివరాలు

గ్రాఫైట్ క్యాప్సూల్ 23 ఇంచెస్ మల్టీస్పోక్ అల్లాయ్ వీల్స్‌పై నడుస్తుంది. డోర్స్ పై దిగువన ఒక ఆరంజ్ కలర్ స్ట్రిప్ ఉంది. ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంది. లంబోర్ఘిని ఉరుస్ వెనుక వైపు ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్ యూనిట్లను పొందుతుంది. మధ్యలో లంబోర్ఘిని లోగో ఉంది. అదేవిధంగా దీని పైన కుడివైపున ఉన్న స్పాయిలర్ ఆరెంజ్ కలర్ షేడ్‌లో పూర్తై ఉంది. ఇది వెనుక భాగంలో క్వాడ్ ఎగ్జాస్ట్ అవుట్‌లెట్‌లను కూడా పొందుతుంది.

భారత్‌లో అమ్మకానికి సిద్దమైన లంబోర్ఘిని ఉరుస్ గ్రాఫైట్ క్యాప్సూల్ ఎడిషన్ ; వివరాలు

లంబోర్ఘిని ఉరుస్‌లో ఎలక్ట్రానిక్ టెయిల్‌గేట్ కూడా ఉంది. ఈ ఎలక్ట్రానిక్ టెయిల్‌గేట్ ఓపెన్ చేయగానే మీకు 616 లీటర్ల సామర్థ్యంతో ఉన్న పెద్ద బూట్‌ స్పేస్ లభిస్తుంది. ఇది ఎక్కువ లగేజ్ ఉంచుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. వెనుక వైపు సన్‌షేడ్ కూడా ఉంది.

భారత్‌లో అమ్మకానికి సిద్దమైన లంబోర్ఘిని ఉరుస్ గ్రాఫైట్ క్యాప్సూల్ ఎడిషన్ ; వివరాలు

లంబోర్ఘిని ఉరుస్ ఇంటీరియర్ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్న ఈ స్పెషల్ కారు కొనుగోలుదారుల కోసం కేటాయించింది కావున, మేము కారు లోపల కూర్చోలేకపోయాము. కానీ లోపలి భాగాలను చూడగలిగామి, లంబోర్ఘిని ఉరుస్ వెలుపల కనిపించే అదే ఆరెంజ్ కలర్ ఎలిమెంట్స్ ఈ సూపర్ ఎస్‌యువి లోపల కూడా కనిపిస్తాయి.

భారత్‌లో అమ్మకానికి సిద్దమైన లంబోర్ఘిని ఉరుస్ గ్రాఫైట్ క్యాప్సూల్ ఎడిషన్ ; వివరాలు

సీట్లపై అదే ఆరంజ్ కలర్ లో ఉరుస్ అనే పేరును చూడవచ్చు. సీట్ల వెనుక భాగంలో స్టిచ్చింగ్ మరియు డిజైన్ కూడా అదే ఆరెంజ్ షేడ్‌లో పూర్తయింది. దీనిని మీరు ఇక్కడ గమనించవచ్చు ఇవి వాహనదారునికి చాలా సౌకర్యవంతంగా ఉంటాయి.

భారత్‌లో అమ్మకానికి సిద్దమైన లంబోర్ఘిని ఉరుస్ గ్రాఫైట్ క్యాప్సూల్ ఎడిషన్ ; వివరాలు

ఇన్స్ట్రుమెంటేషన్, ఫుల్ కలర్ TFT స్క్రీన్ ద్వారా నిర్వహించబడుతుంది. లంబోర్ఘిని ఉరస్ గ్రాఫైట్ క్యాప్సూల్ ఎడిషన్‌లో మరో రెండు స్క్రీన్‌లు ఉన్నాయి. ఇందులో ఒకటి మీడియా మరియు ఎంటర్టైన్మెంట్ కోసం ఉపయోగపడుతుంది. మరొకటి దిగువన ఉంటుంది. ఇది వాహనం గురించి మొత్తం సమాచారం మరియు గణాంకాలను ప్రదర్శిస్తుంది.

భారత్‌లో అమ్మకానికి సిద్దమైన లంబోర్ఘిని ఉరుస్ గ్రాఫైట్ క్యాప్సూల్ ఎడిషన్ ; వివరాలు

రెండవ స్క్రీన్ క్రింద స్టార్ట్ మరియు స్టాప్ బటన్ ఉంది. వీటితోపాటు ఇది డ్రైవింగ్ మోడ్‌లు, టెర్రైన్ మోడ్‌లు మరియు డిఫరెన్షియల్ లాక్‌ కంట్రోల్స్ వంటి వాటిని కలిగి ఉంటుంది. వీటి ద్వారా వాహనాన్ని కంట్రోల్ చేయవచ్చు, అంతే కాకుండా వివిధ రకాలుగా నిర్వహించవచ్చు.

భారత్‌లో అమ్మకానికి సిద్దమైన లంబోర్ఘిని ఉరుస్ గ్రాఫైట్ క్యాప్సూల్ ఎడిషన్ ; వివరాలు

సీట్లు డ్రైవర్ మరియు ప్రయాణీకుల కోసం ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ చేయబడతాయి. వెనుక సీట్లు కూడా ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ చేయగలవు. ఈ ఎస్‌యూవీ ఫోర్ జోన్ క్లైమేట్ కంట్రోల్ సిస్టం కలిగి ఉంది. ఇది ఇంటీరియర్ అంతటా ఆరెంజ్ యాక్సెంట్స్ కలిగి ఉంటుంది.

భారత్‌లో అమ్మకానికి సిద్దమైన లంబోర్ఘిని ఉరుస్ గ్రాఫైట్ క్యాప్సూల్ ఎడిషన్ ; వివరాలు

లంబోర్ఘిని ఉరుస్ గ్రాఫైట్ క్యాప్సూల్ ఎడిషన్ ఒక పనోరమిక్ సన్‌రూఫ్‌ను కలిగి ఉంది. ఈ ఎస్‌యూవీ ఆరెంజ్ మరియు మాట్ బ్లాక్ కలర్ స్కీమ్‌లో అద్భుతంగా కనిపిస్తుంది. ఉరుస్ గ్రాఫైట్ క్యాప్సూల్ ఎడిషన్ లోని పనోరమిక్ సన్‌రూఫ్‌ వాహనాన్ని మరింత అద్భుతంగా చూపిస్తుంది.

భారత్‌లో అమ్మకానికి సిద్దమైన లంబోర్ఘిని ఉరుస్ గ్రాఫైట్ క్యాప్సూల్ ఎడిషన్ ; వివరాలు

ఉరుస్ గ్రాఫైట్ క్యాప్సూల్ 4.0-లీటర్ ట్విన్-టర్బో వి 8 ఇంజిన్ కలిగి ఉంటుంది. ఇది గరిష్టంగా 641 బిహెచ్‌పి పవర్ మరియు 850 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 8-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. ఇది కేవలం 3.6 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఈ ఎస్‌యువి యొక్క గరిష్ట వేగం గంటకు 305 కిమీ.

Most Read Articles

English summary
Lamborghini urus graphite capsule edition walkaround video revealing details and design elements
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X