బాలీవుడ్ యాక్టర్ 'కార్తీక్ ఆర్యన్' కొనుగోలు చేసిన కొత్త బైక్.. చూసారా..!!

సాధారణంగా చాలామంది సినీ నటులు, పారిశ్రామిక వేత్తలు మరియు క్రికెటర్లు మొదలైన సెలబ్రెటీలు అప్పుడప్పుడు లగ్జరీ కార్లు మరియు బైకులను కొనుగోలు చేస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే ప్రముఖ బాలీవుడ్ నటుడు 'కార్తీక్ ఆర్యన్' ఇటీవల కొత్త 'రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350' బైక్‌ కొనుగోలు చేశారు. నవంబర్ 22 న తన పుట్టినరోజు సందర్భంగా ఈ బైక్‌ను కొనుగోలు చేసినట్లు తెలిసింది.

బాలీవుడ్ యాక్టర్ 'కార్తీక్ ఆర్యన్' కొనుగోలు చేసిన కొత్త బైక్.. చూసారా..!!

కార్తీక్ ఆర్యన్ తన 31 వ పుట్టినరోజును తన కుటుంభ సభ్యులను మరియు స్నేహితులతో జరుపుకున్నాడు. తన పుట్టినరోజున, అతను ఈ బైక్‌ను నడుపుతూ కనిపించాడు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇటీవల ఎలుగులోకి వచ్చాయి. కార్తీక్ ఆర్యన్ యొక్క కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 రెడ్ మరియు బ్లాక్ డ్యూయల్ టోన్ పెయింట్‌లో అందుబాటులో ఉంది.

బాలీవుడ్ యాక్టర్ 'కార్తీక్ ఆర్యన్' కొనుగోలు చేసిన కొత్త బైక్.. చూసారా..!!

కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 బైక్ ఈ ఏడాది ఆగస్టులో విడుదలచేయబడింది. దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త Royal Enfield Classic 350 ధర రూ. 1.84 లక్షలు. ఈ బైక్ క్రోమ్ రెడ్, డార్క్ స్టీల్త్ బ్లాక్, సిగ్నెల్స్ మార్స్ గ్రే, హాల్సియన్ గ్రీన్ మరియు రెడ్డిచ్ గ్రీన్ మొదలైన కలర్స్ లో అందుబాటులో ఉంటుంది.

బాలీవుడ్ యాక్టర్ 'కార్తీక్ ఆర్యన్' కొనుగోలు చేసిన కొత్త బైక్.. చూసారా..!!

2021 Royal Enfield Classic 350 బైక్ ఎగ్జాస్ట్ క్రోమ్, గుండ్రని రియర్ వ్యూ మిర్రర్స్, ఫ్యూయల్ ట్యాంక్‌ వంటివి మునుపటి మోడల్ లో మాదిరిగానే ఉంటుంది. ఫ్రంట్ మడ్‌గార్డ్ మధ్యలో రెడ్ లైన్‌తో క్రోమ్ ఫినిషింగ్ పొందుతుంది. ఇంధన ట్యాంక్‌లో కూడా దీనిని గమనించవచ్చు. ఈ బైక్ యొక్క సీట్లు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది.

బాలీవుడ్ యాక్టర్ 'కార్తీక్ ఆర్యన్' కొనుగోలు చేసిన కొత్త బైక్.. చూసారా..!!

కొత్త Classic 350 బైక్‌ 13-లీటర్ల సామర్థ్యం కలిగిన ఇంధన ట్యాంక్ కలిఙ్గి ఉంటుంది. ఈ బైక్ ఒక లీటరుకు 36 కిలోమీటర్ల మైలేజ్ అందిస్తుంది. కావున ఒక ఫుల్ ట్యాంక్ తో ఈ బైక్ 450 కిలోమీటర్ల కంటే ఎక్కువ పరిధిని అందిస్తుంది. ఈ బైక్ ఇప్పుడు మునుపటి కంటే చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది.

బాలీవుడ్ యాక్టర్ 'కార్తీక్ ఆర్యన్' కొనుగోలు చేసిన కొత్త బైక్.. చూసారా..!!

ఇందులోని బ్రేకింగ్ విషయానికి వస్తే, ఇది అద్భుతమైన బ్రేకింగ్ సిస్టం కలిగి ఉంటుంది, ఈ బైక్ ముందు భాగంలో ముందు భాగంలో 300 మిమీ డిస్క్ బ్రేక్ మరియు వెనుకవైపు 270 మిమీ డిస్క్ బ్రేక్ ఉన్నాయి. ఈ బైక్‌లో ఏబీఎస్ కూడా స్టాండర్డ్‌గా అందించబడింది. వేరియంట్‌ను బట్టి సింగిల్ ఛానల్ లేదా డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ ఎంచుకునే అవకాశం కస్టమర్లకు లభిస్తుంది.

బాలీవుడ్ యాక్టర్ 'కార్తీక్ ఆర్యన్' కొనుగోలు చేసిన కొత్త బైక్.. చూసారా..!!

కొత్త 2021 Royal Enfield Classic 350 బైక్ 349 సిసి సింగిల్ సిలిండర్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఇది 6,100 ఆర్‌పిఎమ్ వద్ద 20.3 బిహెచ్‌పి పవర్ మరియు 4,000 ఆర్‌పిఎమ్ వద్ద 27 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 5-స్పీడ్ గేర్‌బాక్స్ కి జతచేయబడి ఉంటుంది.

బాలీవుడ్ యాక్టర్ 'కార్తీక్ ఆర్యన్' కొనుగోలు చేసిన కొత్త బైక్.. చూసారా..!!

ఈ కొత్త బైక్ లో ట్విన్-డౌన్‌ట్యూబ్ స్పైన్ చాసిస్ దాని పాత సింగిల్ డౌన్‌ట్యూబ్ చాసిస్ స్థానంలో ఉపయోగించబడింది. కావున దీని బరువు 195 కిలోల వరకు ఉంటుంది. ఈ బైక్ లో సస్పెన్షన్ సెటప్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ బైక్ ఇప్పుడు ఎక్కువ వైబ్రేషన్ అనిపించదు, తద్వారా మంచి రైడింగ్ అనుభవాన్ని అందిస్తుంది.

బాలీవుడ్ యాక్టర్ 'కార్తీక్ ఆర్యన్' కొనుగోలు చేసిన కొత్త బైక్.. చూసారా..!!

కార్తీక్ ఆర్యన్‌కి బైక్‌లు మరియు కార్లంటే చాలా ఇష్టం. ఈ ఏడాది ఏప్రిల్‌లో రూ. 4.5 కోట్ల ఖరీదు చేసే లాంబోర్గినీ ఉరుస్ ఎస్‌యూవీని కొనుగోలు చేశాడు. అతను తరచుగా ముంబై వీధుల్లో ఈ కారులో డ్రైవింగ్ చేస్తూ కనిపిస్తాడు. ఇటీవల, లంబోర్ఘిని ఉరస్‌తో ఉన్న అతని ఫోటో సోషల్ మీడియాలో చాలా వైరల్‌గా మారింది. ఈ ఫొటోలో అతడు ఈ SUV యొక్క బోనెట్‌పై ఫాస్ట్ ఫుడ్ తినడం చూడవచ్చు. దీనికి సంబంధించిన మరింత సమాచారం తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

బాలీవుడ్ యాక్టర్ 'కార్తీక్ ఆర్యన్' కొనుగోలు చేసిన కొత్త బైక్.. చూసారా..!!

కార్తీక్ ఆర్యన్ గత సంవత్సరం తన తల్లి మాలా తివారీ పుట్టినరోజు సందర్భంగా ఆమెకు మినీ కూపర్ స్పోర్ట్స్ కారును బహుమతిగా అందించాడు. అంతే కాకుండా, అతను తన తల్లితో కలిసి ఈ కారులో డ్రైవ్‌కు కూడా వెళ్లాడు. ఈ కారు ధర రూ. 45 లక్షలు.

Most Read Articles

English summary
Kartik aryan gifts himself royal enfield classic 350 on his 31st birthday details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X