Viral Video రోడ్డుపై మహీంద్రా థార్‌ను నడిపిన బుడ్డోడు.. మండిపడుతున్న నెటిజన్లు, కారణమిదే.!!
ఆ చిన్నారికి నిండా పదేళ్లు కూడా లేవేమో.. అయినా కానీ మహీంద్రా థార్‌ను నడుపుతున్నారు ఈ బుడ్డోడు. బెంగళూరు లాంటి బిజీ నగరంలో బిజీ రోడ్లపై ఈ సంఘటన చోటుచేసుకుంది. చిన్న పిల్లాడు మహీంద్రా థార్‌ను డ్రైవ్ చేస్తూ కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో వైరల్ అవుతోంది. పూర్తి సమాచారం ఈ కథనంలో..
భారత్‌లో డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడపడం చట్టవిరుద్ధం. అంతే కాకుండా వాహనదారులు, డ్రైవర్లు ట్రాఫిక్ రూల్స్‌ను కూడా పాటించాలి. లేదంటే జరిమానా తప్పదు. కానీ చాలా మంది వీటిని విస్మరిస్తుంటారు. మైనారిటీ తీరకుండా కొందరు టూ వీలర్లపై బయటకు వస్తుంటారు. ఇది చాలా ప్రమాదకరం. కానీ ఇక్కడ నిండా పదేళ్లు కూడా చిన్న పిల్లాడు మహీంద్రా థార్‌ను నడుపుతున్నాడు.

దేశంలో బాధాకరమైన విషయమేమంటే.. చిన్న పిల్లలు(Kid Driving Mahindra Thar)వాహనాలు నడుపుతుంటే పెద్ద వాళ్లు ప్రోత్సహించడం. వారు వద్దని వారించాల్సింది పోయి.. తల్లిదండ్రులే దగ్గరుండి చిన్న వయసులోనే వారికి బైక్, కార్లను నడపడం నేర్పిస్తున్నారు. దీని వల్ల జరిగే పరిణామాలు, ప్రమాదాలను వారు గుర్తించకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.
గతంలో ఇలాంటి వీడియోలు కూడా చాలా బయటకు వచ్చాయి. సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. నాలుగేళ్ల బుడ్డోడు రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ బైక్ నడపడం గత కొన్ని నెలల క్రితం నెట్టింట్లో తెగ హల్‌చల్ చేసింది. కాళ్లు కూడా అందని ఆ చిన్నారి.. చాలా బరువైన బుల్లెట్ బైక్‌ను నడిపాడు. అయితే పబ్లిక్ రోడ్లపై కాకుండా ఓ గ్రౌండ్‌లో బుడ్డోడు తన తండ్రి సారథ్యంలో బుల్లెట్ తోలాడు.

ఆ తర్వాత ఇప్పుడు ఓ చిన్న పిల్లాడు మహీంద్రా థార్(Mahindra Thar SUV)ను నడపడం వైరల్ అవుతోంది. అది కూడా రద్దీగా ఉన్న రోడ్డుపై జరగడం ఆందోళన కలిగిస్తోంది. బెంగళూరులోని మెట్రో స్టేషన్ దగ్గర ఈ సంఘటన జరిగినట్లుగా వీడియో(Kid Driving Thar Viral Video) ద్వారా తెలుస్తోంది. అయితే వీడియోను చూసినట్లయితే ఇక్కడ కొన్ని అర్థమవుతున్నాయి.
బాలుడు పూర్తిగా కారును స్వయంగా నడపడం లేదని వీడియో ద్వారా తెలుస్తోంది. ఓ వ్యక్తి తన ఒడిలో బుడ్డోడిని కూర్చోబెట్టుకుని స్టీరింగ్ వీల్ సహాయంతో కారు నడిపేలా తనకు నేర్పిస్తారు. బహుశా ఆ వ్యక్తి ఆ చిన్నారి తండ్రి కావచ్చు. ఈ వీడియోలో రోడ్డు ట్రాఫిక్‌తో రద్దీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆ అబ్బాయి స్టీరింగ్ వీల్‌ను కంట్రోల్ చేస్తుండటాన్ని చూడవచ్చు.

కాగా మహీంద్రా థార్ బ్రేక్ మరియు యాక్సిలరేటర్ వంటి పెడల్స్‌ను వ్యక్తి హ్యాండిల్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఏదేమైనా పబ్లిక్ రోడ్డుపై ఇలా చిన్న పిల్లాడు కారు నడిపేలా ప్రోత్సహించడం తప్పు. ఇదే అనుకుంటే.. రద్దీ రోడ్డుపై ఇలాంటి చర్యలకు పాల్పడటం ఆ వ్యక్తి చేసిన అతి పెద్ద తప్పు. స్టీరింగ్ వీల్‌పై పొరపాటుగా నియంత్రణ కోల్పోతే ప్రమాదం జరిగే అవకాశం ఉంది.
ఈ వీడియోపై నెటిజన్లు విపరీతంగా స్పందిస్తున్నారు. సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చిన్న పిల్లాడితో కారు నడిపిస్తున్న వ్యక్తిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అయితే సదరు వ్యక్తిపై పోలీసులు జరిమానా విధించినట్లుగా సమాచారం. పెద్దలు ఇలాంటి చర్యలకు పాల్పడితే పోలీసులు జరిమానాతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ కూడా రద్దు చేసే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








