రెండు సన్‌రూఫ్‌లు మరియు సరికొత్త సన్‌సెట్ ఆరెంజ్ కలర్‌లో మారుతి డిజైర్..!

మనదేశంలో మారుతి సుజుకి (Maruti Suzuki) కార్లకు డిమాండ్ ఎక్కువ అనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందులోనూ ఈ కంపెనీ విక్రయించే, కాంపాక్ట్ సెడాన్ డిజైర్ (Dzire) మార్కెట్లో హాట్ కేకుల్లా అమ్ముడవుతూ, ఈ విభాగంలో అగ్రగామిగా ఉంటోంది. మారుతి సుజుకి డిజైర్ ఈ విభాగంలో హోండా అమేజ్, ఫోర్డ్ ఆస్పైర్, హ్యుందాయ్ ఔరా, టాటా టిగోర్ వంటి కాంపాక్ట్ సెడాన్లకు పోటీగా ఉంటుంది మరియు ఈ మోడళ్ల కన్నా కూడా అత్యధిక సంఖ్యలో అమ్ముడవుతోంది.

రెండు సన్‌రూఫ్‌లు మరియు సరికొత్త సన్‌సెట్ ఆరెంజ్ కలర్‌లో మారుతి డిజైర్..!

మారుతి సుజుకి డిజైర్ వాస్తవానికి స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ ఆధారంగా చేసుకొని తయారు చేయబడిన కాంపాక్ట్ సెడాన్. స్విఫ్ట్ కూడా మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్. కార్ ప్రియులు స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ తమకు నచ్చినట్లుగా, వివిధ రకాలుగా కస్టమైజ్ చేయడాన్ని మనం ఇప్పటికే చాలా సందర్భాల్లో చూశాం. అయితే, డిజైర్ సెడాన్ ను కస్టమర్లు తమకు నచ్చినట్లుగా కస్టమైజ్ చేసుకుంటున్నారు. అలాంటి ఓ అందమైన, కస్టమైజ్డ్ మారుతి సుజుకి డిజైర్ గురించి ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

రెండు సన్‌రూఫ్‌లు మరియు సరికొత్త సన్‌సెట్ ఆరెంజ్ కలర్‌లో మారుతి డిజైర్..!

ఈ ఫొటోలలో కనిపిస్తున్న మారుతి డిజైర్ ను చూడండి, మిరుమిట్లుగొలిపే స్పోర్టీ ఆరెంజ్ కలర్ లో చాలా అందంగా కనిపిస్తోంది. అంతేకాదు, ఈ కారులో మరొక హైలైట్ ఏంటంటే, ఇందులో రెండు సన్‌రూఫ్ లు కూడా ఉంటాయి. అలాగని, ఇది స్టాక్ వెర్షన్ మారుతి సుజుకి డిజైర్ కాదండోయ్.. ఓ కార్ ప్రియుడి కోసం కిట్అప్ ఆటోమోటివ్ (KitUp Automotive) అనే కార్ కస్టమైజేషన్ కంపెనీ ప్రత్యేకంగా మోడిఫై చేసిన డిజైర్.

రెండు సన్‌రూఫ్‌లు మరియు సరికొత్త సన్‌సెట్ ఆరెంజ్ కలర్‌లో మారుతి డిజైర్..!

కిట్అప్ ఆటోమోటివ్ అనే కస్టమైజేషన్ కంపెనీ తమ కస్టమర్ కోసం పాత తరం డిజైర్ సెడాన్ యొక్క టాప్-ఎండ్ వేరియంట్ ను ఈ విధంగా సన్‌సెట్ బీమ్ పెరల్ కలర్ తో పాటుగా రూఫ్ భాగంలో రెండు సన్‌రూఫ్ లను ఏర్పాటు చేసి కస్టమైజ్ చేసింది. ఈ కస్టమైజేషన్ ప్రక్రియలో భాగంగా, కంపెనీ కొత్త 17 ఇంచ్ మోమో అల్లాయ్ వీల్స్ ను కూడా ఉపయోగించింది. అలాగే, కారు ముందు భాగంలో క్రోమ్ గార్నిష్ తో కూడిన గ్రిల్, ఫాగ్‌ల్యాంప్ హౌసింగ్ కు దిగువన సిల్వర్ గార్నిష్ వంటి మార్పులను కూడా చేసింది.

రెండు సన్‌రూఫ్‌లు మరియు సరికొత్త సన్‌సెట్ ఆరెంజ్ కలర్‌లో మారుతి డిజైర్..!

అంతేకాకుండా, కొత్త ప్రొజెక్టర్ హెడ్‌లైట్స్, ట్రెడిషనల్ ఫాగ్ ల్యాంప్స్ స్థానంలో కొత్త ఎల్ఈడి ఫాగ్ ల్యాంప్స్, నలుపు రంగులో పెయింట్ చేయబడిన బి-పిల్లర్స్ మరియు కారు పైభాగంలో పియానో బ్లాక్ కలర్ పెయింట్, విండో లైన్ క్రింది భాగంలో క్రోమ్ గార్నిష్, బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్ మరియు బాడీ కలర్ సైడ్ మిర్రర్స్ వంటి మార్పులు కూడా ఉన్నాయి. కిట్అప్ ఆటోమోటివ్ ఈ కస్టమైజేషన్ మార్పులను కేవలం ఎక్స్టీరియర్ లో మాత్రమే కాకుండా, ఇంటీరియర్ లో కూడా మార్పులు చేసింది.

రెండు సన్‌రూఫ్‌లు మరియు సరికొత్త సన్‌సెట్ ఆరెంజ్ కలర్‌లో మారుతి డిజైర్..!

ఈ కస్టమైజ్డ్ మారుతి డిజైర్ కారు డోర్లు ఓపెన్ చేయగానే ప్రధానంగా కనిపించే మార్పు ఇందులోని రెండు సన్‌రూఫ్ లు. ఇందులో ఒకటి ఫ్రంట్ ప్యాసింజర్ సీట్ల వద్ద ఉంచగా, రెండవ దానిని రియర్ ప్యాసింజర్ సీట్ల వద్ద అమర్చచారు. ఇది చూడటానికి ఓపెన్ స్కై ఫీల్ ను లేదా ఓపెన్ టాప్ కన్వర్టిబల్ కారు లాంటి అనుభూతిని అందిస్తుంది. అలాగే, ఇంటీరియర్ క్యాబిన్ లేఅవుట్ మొత్తాన్ని బ్లాక్ అండ్ బేజ్ కలర్ డ్యూయెల్ టోన్ కాంబినేషన్ లో తీర్చిదిద్దారు.

రెండు సన్‌రూఫ్‌లు మరియు సరికొత్త సన్‌సెట్ ఆరెంజ్ కలర్‌లో మారుతి డిజైర్..!

డోర్ ట్రిమ్‌లపై విభిన్నమైన స్టిచింగ్ ప్యాటర్న్స్, ప్రీమియం లెథర్ సీట్లు, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వెనుక ప్యాసింజర్ల కోసం రియర్ ఏసి వెంట్స్, బెటర్ ఆడియో ఎక్స్‌పీరియెన్స్ కోసం స్పీకర్లు వంటి పలు మార్పులు చేయబడ్డాయి. అయితే, ఇంజన్ పరంగా మాత్రం ఈ కస్టమైజ్డ్ డిజైర్ లో ఎలాంటి మార్పులు లేవు. మునుపటి తరం బిఎస్6 డిజైర్ సెడాన్‌ను కంపెనీ 2020లో సుమారు రూ. 5.89 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో కంపెనీ విడుదల చేసింది. ఇందులోని టాప్-ఎండ్ వేరియంట్ ఆధారంగా కిట్అప్ ఆటోమోటివ్ ఈ కారును కస్టమైజ్ చేసింది. మీకు కూడా ఇలాంటి కారు కావాలంటే, కొయంబత్తూర్ వెళ్లాల్సిందే.

రెండు సన్‌రూఫ్‌లు మరియు సరికొత్త సన్‌సెట్ ఆరెంజ్ కలర్‌లో మారుతి డిజైర్..!

ప్రస్తుతం, మార్కెట్లో లభిస్తున్న మారుతి సుజుకి డిజైర్‌ విషయానికి వస్తే, కంపెనీ ఇందులో 1.2-లీటర్, 4-సిలిండర్, న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ K12C డ్యూయల్-జెట్ పెట్రోల్ ఇంజన్ ను ఉపయోగించింది. ఈ ఇంజన్ గరిష్టంగా 89 బిహెచ్‌పి పవర్‌ను మరియు 113 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మాన్యువల్ మరియు 5-స్పీడ్ ఏఎమ్‌టి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో జతచేయబడి ఉంటుంది.

రెండు సన్‌రూఫ్‌లు మరియు సరికొత్త సన్‌సెట్ ఆరెంజ్ కలర్‌లో మారుతి డిజైర్..!

మారుతి సుజుకి డిజైర్ దేశంలో కెల్లా అత్యధికంగా అమ్ముడవుతున్న కాంపాక్ట్ సెడాన్ గా ఉంది. గడచిన ఫిబ్రవరి 2022 నెలలో కంపెనీ మొత్తం 17,438 యూనిట్ల డిజైర్ సెడాన్‌ లను విక్రయించింది. ఈ సంఖ్య ఫిబ్రవరి 2021 నెలతో పోలిస్తే దాదాపు 46.53 శాతం ఎక్కువ. ఫిబ్రవరి 2021 నెలలో కంపెనీ కేవలం 11,901 డిజైర్ కార్లను మాత్రమే విక్రయించింది. డిజైర్ అమ్మకాలను మరింత పెంచుకునేందుకు కంపెనీ ఇటీవలే డిజైర్‌లో కొత్త CNG వేరియంట్‌ను కూడా పరిచయం చేసింది. - మరిన్ని వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

Article Published On: Monday, March 21, 2022, 15:20 [IST]
English summary
Kitup automotive customizes maruti suzuki dzire with sunset beam pearl color and dual sunroof
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+