దేశీయ మార్కెట్లో Dzire CNG లాంచ్ చేసిన Maruti Suzuki: ధర రూ. 8.14 లక్షలు
భారతీయ మార్కెట్లో మారుతి సుజుకి తన కొత్త 'సుజుకి డిజైర్ సిఎన్‌జి' (Suzuki Dzire CNG) విడుదల చేసింది. ఈ కొత్త డిజైర్ సిఎన్‌జి ధర రూ. 8.14 లక్షలు. కంపెనీ ఈ 'మారుతి సుజుకి డిజైర్ సిఎన్‌జి' యొక్క బుకింగ్స్ ప్రారంభించింది. కావున కొనుగోలుదారులు రూ. 11,000 అడ్వాన్స్ చెల్లించి బుక్ చేసుకోవచ్చు. ఈ కొత్త సిఎన్‌జి మోడల్ గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

సుజుకి డిజైర్ సిఎన్‌జి' (Suzuki Dzire CNG) మొత్తం రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. అవి విఎక్స్ఐ మరియు జెడ్ఎక్స్ఐ వేరియంట్స్. వీటి ధరలు వరసగా రూ. 8.14 లక్షలు మరియు రూ. 8.82 లక్షలు. భారతీయ మార్కెట్లో ప్రస్తుతం సిఎన్‌జి వాహనాలకు పెరుగుతున్న డిమాండ్ కారణంగా మారుతి సుజుకి తన కొత్త సిఎన్‌జి మోడల్స్ విడుదల చేసింది.

కంపెనీ ఇప్పటికే మారుతి ఆల్టో, మారుతి ఎస్-ప్రెస్సో, మారుతి వ్యాగన్ఆర్, మారుతి ఎకో, మారుతి సెలెరియో మరియు మారుతి ఎర్టిగా వంటి వాటిని సిఎన్‌జి ఎంపికలలో అందిస్తోంది. ఈ విభాగంలో కంపెనీ ఇప్పుడు డిజైన్ ని కూడా చేర్చింది. ఈ డిజైన్ అనేది మార్కెట్లో మంచి అమ్మకాలను పొందుతున్న కంపెనీ యొక్క ప్రముఖ మోడల్.

కొత్త మారుతి సుజుకి డిజైర్ సిఎన్‌జి 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో జత చేయబడింది. ఈ ఇంజిన్ 89 బిహెచ్‌పి పవర్ మరియు 113 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 31.12 కిమీ మైలేజ్ అందిస్తుంది. అయితే ఇప్పుడు కంపెనీ యొక్క సిఎన్‌జి ఆప్సన్ 77 బిహెచ్‌పి పవర్ మరియు 98.5 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఈ ఇంజన్‌కు 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ మరియు ఆటోమాటిక్ గేర్‌బాక్స్ ఆప్సన్స్ ఇవ్వబడుతుంది.

మారుతి సుజుకి డిజైర్ సిఎన్‌జి డ్యూయల్ ఇంటర్-డిపెండెంట్ ఈసియు యూనిట్‌ను పొందుతుంది. ఇందులోని అన్ని ఫిట్టింగులు స్టెయిన్‌లెస్ స్టీల్‌లో ఉంచబడుతుంది. కొత్త డిజైన్ అద్భుతమైన డిజైన్ కలిగి చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. డిజైర్ సిఎన్‌జి 7-ఇంచెస్ స్మార్ట్‌ప్లే టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను కలిగి ఉంది. ఇది ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే మరియు మిర్రర్‌లింక్ వంటి వాటికి మద్దతు ఇస్తుంది.

డిజైర్ సిఎన్‌జి లెదర్ స్టీరింగ్ వీల్, రియర్ ఏసీ వెంట్స్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ORVMలు మరియు 10-స్పోక్ 15-ఇంచెస్ అల్లాయ్ వీల్స్ వంటి వాటిని పొందుతుంది. ఇవన్నీ కూడా వాహన వినియోగదారునికి చాలా అనుకూలంగా ఉంటుంది.
మారుతి డిజైర్ సిఎన్‌జిలో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్ విత్ ఈబిడి, బ్రేక్ అసిస్ట్ మరియు ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్ ఉన్నాయి. ఇవన్నీ కూడా వాహన వినియోగదారునియొక్క భద్రతను నిర్దారిస్తుంది. ఈ ఫీచర్లన్నీ మారుతి డిజైర్ లో స్టాండర్డ్‌గా ఇన్‌స్టాల్ చేయబడ్డాయి.

భారతీయ మార్కెట్లో రోజురోజుకి పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగిపోతున్నాయి. పెరుగుతున్న ఇంధన ధరలు వాహన అమ్మకాలపైన కూడా ఎక్కువ ప్రభావం చూపుతున్నాయి. ఎందుకంటే డీజిల్ మరియు పెట్రోల్ వాహనాల వినియోగానికి ఎక్కువ ఖర్చు చేయవలసిన అవసరం ఉంది. కావున ఎక్కువమంది ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాలను లేదా సిఎన్‌జి వాహనాలను వినియోగించడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ కారణంగానే చాలా కంపెనీలు తమ వాహనాలను సిఎన్‌జి వెర్షన్లుగా విడుదల చేస్తున్నాయి. ఇందులో భాగంగానే మారుతి సుజుకి తన కొత్త డిజైర్ సిఎన్‌జి విడుదల చేసింది.

ఇదిలా ఉండగా మారుతి సుజుకి కంపెనీ దేశవ్యాప్తంగా 100 కంటే ఎక్కువ నగరాల్లో తన జెన్యూన్ యాక్ససరీస్ ఆన్‌లైన్ రిటైలింగ్‌ను విస్తరించనున్నట్లు ప్రకటించింది. మారుతి సుజుకి జెన్యూన్ యాక్సెసరీస్ (MSGA) వెబ్‌సైట్ గత సంవత్సరం ప్రారంభించబడింది. ఆ సమయంలో ఇవన్నీ టెస్టింగ్ దశలో ఉన్నాయి. అప్పుడు దేశ రాజధాని ఢిల్లీ మరియు NCR లోని కస్టమర్‌లు మాత్రమే ఆన్‌లైన్‌లో ఈ యాక్సెసరీలను కొనుగోలు చేయగలరు. కానీ ప్రస్తుతం కంపెనీ ఈ సర్వీస్ దేశంలో దాదాపు 100 కంటే ఎక్కువ నగరాల్లో విస్తరించింది.

ప్రస్తుతం భారతీయ ఆటో మొబైల్ మార్కెట్లో CNG కార్ల విభాగంలో మారుతీ సుజుకి అతిపెద్ద వాటాను కలిగి ఉంది. ఈ కంపెనీ తన సిఎన్‌జి విభాగాన్ని రోజురోజుకి విస్తరిస్తూనే ఉంది. దీనికి ప్రధాన కారణం పెరుగుతున్న డిమాండ్. ప్రస్తుతం కంపెనీ తన డిజైన్ సిఎన్‌జి ఎంపికతో విడుదల చేసింది, అయితే ఇది ఎలాంటి అమ్మకాలను పొందుతుంది అనే విషయాలు త్వరలో తెలుస్తాయి.


Click it and Unblock the Notifications








