ఇలాంటి విచిత్రమైన వాహనాన్ని ఎప్పుడైనా చూశారా?

ఈ ఫొటోల్లో, వీడియోలో (చివరి స్లైడ్‌లో) మీరు చూస్తున్న క్వాడ్ (నాలుగు చక్రాలు కలిగిన) వాహనం ఆషామాషీ వాహనం కాదు. అలాగని ఈ వాహనాన్ని ఏ హాలీవుడ్ సినిమా కోసం తయారు చేసినది కూడా కాదు. దీన్ని కొనే శక్తి మీ దగ్గర ఉంటే, మీరు కూడా దీన్ని నడపొచ్చు. ఈ నాలుగు చక్రాల వాహనం పేరు 'లాజరెత్ వాజుమా వి8ఎఫ్ క్వాడ్' (Lazareth Wazuma V8F Quad).

రెండేళ్ల క్రితం ఇలాంటి ఓ క్వాడ్ బైక్ గురించి మేము ఓ కథనంలో ప్రచురించాం గుర్తుందా..? ఆ బైక్‌ను తయారు చేసిన ఫ్రెంచ్ కంపెనీ లాజరెత్ తాజాగా ఈ వాజుమా వి8ఎఫ్ వాహనాన్ని తయారు చేసింది. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది లాజరెత్ వాజుమా వి8ఎఫ్ మ్యాట్ ఎడిషన్. ఇది కాన్సెప్ట్ దశ నుంచి ప్రొడక్షన్ దశకు చేరుకుంది. ప్రజల ఆర్డర్ మేరకు వీటిని ఉత్పత్తి చేయనున్నారు.

మరి ఈ క్రేజీ క్వాడ్ బైక్‌కు సంబంధించిన మరింత సమాచారాన్ని తెలుసుకుందాం రండి..

లాజరెత్ వాజుమా వి8ఎఫ్ క్వాడ్

ముందుగా వాజుమా వి8ఎఫ్ తయారీదారు గురించి తెలుసుకుందాం. ప్రముఖ ఫ్రెంట్ కస్టమ్ కార్ అండ్ మోటార్‌సైకిల్ మ్యానుఫాక్చరర్ లాజరెత్ ఈ వాహాన్ని తయారు చేసింది. గతంలో లాజరెత్ ఇలాంటి ఎన్నో అద్భుతమైన వాహనాలను సృష్టించింది.

లాజరెత్ వాజుమా వి8ఎఫ్ క్వాడ్

ఈ వాజుమా వి8ఎఫ్ క్వాడ్ బైక్‌లో నాలుగు పెద్ద టైర్లు, ఫెరారీ నుంచి గ్రహించిన వి8 ఇంజన్ (సీట్ క్రింది భాగంలో అమర్చబడి ఉంటుంది)లు ఉంటాయి.

లాజరెత్ వాజుమా వి8ఎఫ్ క్వాడ్

ఇందులో 1970కి చెందిన ఫెరారీ 308 కార్లలో ఉపయోగించే 3.0 లీటర్ వి8 ఇంజన్‌ను అమర్చారు. ఈ ఇంజన్ గరిష్టంగా 250 హార్స్ పవర్‌ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది.

లాజరెత్ వాజుమా వి8ఎఫ్ క్వాడ్

ఈ ఇంజన్ నుంచి ఉత్పత్తయ్యే శక్తి నేరుగా వెనుక చక్రాలకు బదిలీ అవుతుంది. ఇందుకోసం బిఎమ్‌డబ్ల్యూ ఎమ్3 నుంచి గ్రహించిన సిక్స్ స్పీడ్ సీక్వెన్షనల్ ట్రాన్సిమిషన్‌ను ఉపయోగించారు.

లాజరెత్ వాజుమా వి8ఎఫ్ క్వాడ్

వాజుమా వి8ఎఫ్ మొత్తం బరువు 650 కేజీలు మాత్రమే కావటంతో దీని పవర్-టూ-వెయిట్ (పిటిడబ్ల్యూ) రేషియో ప్రతి టన్నుకు 384 బిహెచ్‌పిలుగా ఉంటుంది. ఇది ఫెరారీ 458 ఇటాలియా సూపర్‌కారుతో సరిసమానం.

లాజరెత్ వాజుమా వి8ఎఫ్ క్వాడ్

లాజరెత్ వాజుమా వి8ఎఫ్‌ను డ్రాగ్‌స్ట్రిప్ లేదా రన్‌వే పైకి తీసుకువెళ్లినట్లయితే, దీనిపై గరిష్టంగా గంటకు 322 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించవచ్చు.

లాజరెత్ వాజుమా వి8ఎఫ్ క్వాడ్

నేలపై నుంచి కేవలం కొన్ని ఇంచ్‌ల ఎత్తులో, చెవులు చిల్లులుపడే మోత మ్రోగించే ఇంజన్‌పై కూర్చుని అంత వేగంతో వెళ్తుంటే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. మరో విషయం ఏంటంటే, ఇంజన్ పెర్ఫామెన్స్‌ను మరింత పెంచుకునేందుకు ఎలక్ట్రానిక్స్‌ను కూడా రీప్రోగ్రామ్ చేసుకునే వెసలుబాటు ఉంటుంది.

లాజరెత్ వాజుమా వి8ఎఫ్ క్వాడ్

వాజుమా వి8ఎఫ్ ఎలక్ట్రానిక్ పవర్ స్టీరింగ్, మోడిఫైడ్ 18 ఇంచ్ మోమో రిమ్స్, స్లిక్ టైర్స్‌తో లభిస్తుంది.

లాజరెత్ వాజుమా వి8ఎఫ్ క్వాడ్

ఈ టైరు సైజులు ముందు వైపు 285-30జెడ్ఆర్18, వెనుక వైపు 315-30జెడ్ఆర్18గా ఉంటాయి.

లాజరెత్ వాజుమా వి8ఎఫ్ క్వాడ్

వాజుమా వి8ఎఫ్ ఈ బ్రీడ్‌లో మొదటిదేం కాదు. ఇదివరకే వాజుమా ఆర్1 (ఫెరారీ వి8 ఇంజన్‌కు బదులుగా యమహా ఆర్1 ఇంజన్‌ను ఉపయోగించారు)ను లాజరెత్ కంపెనీ తయారు చేసింది.

లాజరెత్ వాజుమా వి8ఎఫ్ క్వాడ్

ఈ లాజరెత్ వాజుమా వి8ఎఫ్ ధర వింటే, గుండె గుబేల్ మనటం ఖాయం. దీని ధర 2.60 లక్షల డాలర్లు. మనదేశ కరెన్సీలో సుమారు రూ.1.6 కోట్లకు పైమాటే.

లాజరెత్ వాజుమా వి8ఎఫ్ క్వాడ్

అయితే, ఈ వాహనాన్ని సాధారణ రోడ్లపై తిప్పటానికి అనుమతి లేదు. ఫ్రాన్స్‌లో ఇది రోడ్ లీగల్ వాహనం కాదు. కేవలం రేస్ ట్రాక్‌లపైనే దీన్ని తిప్పుకోవాలి. అంటే, దీన్ని కొన్న తర్వాత దీనిని నడపటం కోసం కొత్తగా రేస్ ట్రాక్‌ను కూడా తయారు చేసుకోవాలన్నమాట.

లాజరెత్ వాజుమా వి8ఎఫ్ పనితీరును ఈ వీడియోలో వీక్షిద్దాం రండి.

More from DriveSpark

Article Published On: Tuesday, November 5, 2013, 12:05 [IST]
English summary
What you'll see in the image gallery and in the video below is not a movie prop. The quad is an actual working machine that you can ride if you have the money to pay. Some of might be familiar with the Lazareth Wazuma V8F quad since a red one off model was seen a couple of years back. What you are seeing is the Wazuma V8F Matt Edition and it has now entered production. 
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+