మోకాళ్ల లోతు వరద నీటిలో మహీంద్రా థార్‌ డ్రైవ్‌.. ఆనంద్‌ మహీంద్రా పోస్ట్‌ వైరల్‌

మిచాంగ్‌ తుపాను కారణంగా చెన్నై రోడ్లన్నీ జలమయ్యాయి. ఈ కారణంగా అనేక కార్లు, బైక్‌లతో పాటు ఇతర వాహనాలు వరద నీటిలో మునిగిపోయాయి. అంతే కాకుండా పలు వాహనాలు సైతం దెబ్బతిన్నాయి. ఈ క్రమంలో మహీంద్రా గ్రూప్‌ ఛైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా ఓ ఆసక్తికర వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా ద్వారా షేర్‌ చేశారు.

సైక్లోన్‌ మిచాంగ్‌(Michaung Cyclone) ఏపీ, తమిళనాడు రాష్ట్రాలను అల్లకల్లోలం చేస్తోంది. తీర ప్రాంతాలన్నిటినీ వరద చుట్టుముట్టింది. వరదల కారణంగా జనం ఇళ్ల నుంచి బయటకు రావడం లేదు. ముంపు బాధితులను అధికార యంత్రాంగం, సహాయక సిబ్బంది.. పునరావాస కేంద్రాలకు తరలించడంతో పాటు సహాయక చర్యలు చేపడుతోంది.

Anand-Mahindra-Shares-Thar-Driving-Video

తుఫాన్‌ కారణంగా కార్లన్నీ వరద నీటిలో మునిగిపోతాయి. దీంతో వాటిని బయటకు తీయడం కష్టంగా మారింది. వదద నీటి కారణంగా కారులోని చాలా భాగాలు దెబ్బతింటున్నాయి. అయితే ఈ సమయంలో వాహనాల యజమానులు మరమ్మతుల విషయంలో అప్రమత్తంగా సూచిస్తున్నారు. ఫ్లడ్‌ ఎఫెక్ట్‌కు గురైన వాహనాలకు కొన్ని ప్రముఖ ఆటోమేకర్లు ప్రత్యేక సర్వీసులను అందిస్తున్నాయి.

ఈ క్రమంలో మోకాళ్ల లోతు వరద ప్రవహిస్తున్న రోడ్డుపై మహీంద్రా థార్‌(Mahindra Thar SUV) ఎస్‌యూవీ వెళ్తున్న వీడియోను ఆనంద్‌ మహీంద్రా ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో షేర్‌ చేశారు. భారీ వరద ప్రవహిస్తున్న రోడ్డుపై మహీంద్రా థార్‌ కారు సులభంగా వెళ్తుండటంపై ఆనంద్‌ మహీంద్రా తన పోస్ట్‌లో సంతోషం వ్యక్తం చేశారు.

Anand-Mahindra-Shares-Thar-Driving-Video

చెన్నై వరద రోడ్లపై ప్రయాణిస్తున్న మహీంద్రా థార్‌ ఎస్‌యూవీ(Anand Mahindra Instagram video) వీడియో.. తనకు మరో ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా ద్వారా ఫార్వార్డ్‌ చేశారని ఆనంద్‌ మహీంద్రా పోస్ట్‌లో పేర్కొన్నారు. కాగా ఈ కారు హార్డ్‌ టాప్‌ రూఫ్‌ను కలిగి ఉంది. అంటే ఇది సాఫ్ట్‌ టాప్‌ వెర్షన్‌ కంటే ఎక్కువే అని తెలుస్తోంది. వరద ప్రవహిస్తున్న రహదారిపై థార్ ఎస్‌యూవీని డ్రైవర్‌ సులభంగా డ్రైవ్‌ చేయడాన్ని వీడియోలో చూడవచ్చు.

కాగా మహీంద్రా థార్‌ హెడ్‌ల్యాంప్‌లు, గ్రిల్‌ను వరద నీరు పూర్తిగా ముంచివేసింది. అయితే థార్‌లో స్నార్కెల్‌ను అమర్చారా లేదా అనేది తెలియడం లేదు. ఇంకా థార్‌ ఎస్‌యూవీ 650 మి.మీ వాటర్‌ వ్యాడింగ్‌ కెపాసిటీని కలిగి ఉంది. దీని ద్వారా ఆఫ్‌ రోడింగ్‌కు సులభంగా ఉంటుంది.

Anand-Mahindra-Shares-Thar-Driving-Video

ఇన్‌స్టాలో ఈ వీడియోను ఒక్క రోజులోనే 17 లక్షలకు పైగా వీక్షించారు. 38 వేలకు పైగా లైక్‌లను సంపాదించింది. ఈ వీడియోపై నెటిజన్లు విపరీతంగా స్పందిస్తున్నారు. ఇలాంటి వీడియోల ద్వారా ప్రజలకు పాజిటివ్‌ ఎనర్జీ వస్తుందని ఓ నెటిజన్‌ కామెంట్‌ చేశారు. మరో నెటిజన్‌.. తనకు కారు లేదని.. ఇలాంటి అద్భుతమైన కారును గిఫ్ట్‌గా ఇవ్వాలని ఫన్నీ కామెంట్‌ చేశారు.

భారత మార్కెట్లో మహీంద్రా థార్‌ ఎస్‌యూవీ 3 డోర్‌ బాడీ స్టైల్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. 3 డోర్ థార్‌ RWD, 4WD గా మార్కెట్లో విక్రయిస్తున్నారు. కాగా వచ్చే ఏడాది మహీంద్రా థార్‌ 5 డోర్‌ వెర్షన్‌ను సంస్థ పరిచయం చేయనుంది.

ఏదేమైనా ఇలా వరద ప్రవహిస్తున్న రోడ్లపై డ్రైవింగ్‌ చేయడం అంత శ్రేయస్కరం కాదు. కారులోని ఎలక్ట్రానిక్‌ భాగాలకు నీరు తగిలినట్లయితే షార్ట్‌ సర్క్యూట్‌ అయ్యే అవకాశం ఉంది. అంతే కాకుండా కారు లోపలికి నీరు చేరినట్లయితే హైడ్రోలాక్‌ అయ్యే ప్రమాదం కూడా ఉంది. దీని ద్వారా ఇంజిన్‌కు నష్టం వాటిల్లుతుంది. క్రమంగా ఇంజిన్‌ రిపేర్‌కు ఎక్కువ మొత్తంలో ఖర్చు చేయాల్సి ఉంటుంది. అంతే కాకుండా ECU కూడా దెబ్బతినొచ్చు.

More from DriveSpark

Article Published On: Wednesday, December 6, 2023, 14:32 [IST]
English summary
Mahindra thar suv driving through floods in chennai anand mahindra shares video
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+