మార్కెట్లోకి రాకముందే సెన్సేషన్ సృష్టిస్తోన్న మహీంద్రా కార్.. ఫస్ట్ బ్లాక్ ఎడిషన్ దక్కించుకోనున్న జాన్ అబ్రహం
దేశీయ ఆటోమొబైల్ కంపెనీ మహీంద్రా గతేడాది థార్ రాక్స్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీని అద్భుతమైన డిజైన్, ఆఫ్ రోడింగ్ కెపాసిటీకి మంచి పేరు వచ్చింది. దీంతో భారతీయ మార్కెట్లో థార్ రాక్స్ కు మంచి డిమాండ్ ఏర్పడింది. దీని కారణంగా ఆ మోడల్ వెయిటింగ్ పిరయడ్ కూడా అమాంతం పెరిగిపోయింది. ప్రస్తుతం మార్కెట్లో 4x2, 4x4 వేరియంట్ల కోసం డిఫరెంట్ వెయిటింగ్ పిరియడ్ లను కలిగి ఉంది.
మహీంద్రా థార్ రాక్స్ గతేడాది భారత మార్కెట్లో సంచలనం సృష్టించింది. 3 డోర్స్ మోడల్ లో ఏర్పడిన లోపాలను సవరించి 5డోర్స్ థార్ రాక్స్ రిలీజ్ అయింది. కాంపాక్ట్ ఫ్యామిలీ SUVగా మారిన ఈ మోడల్‌ను కొనుగోలు చేయడానికి డీలర్‌షిప్‌ల వద్ద ఇప్పటికే భారీ క్యూలు ఉన్నాయి. ఇదిలా ఉండగా మహీంద్రా బ్లాక్ బాడీతో కూడిన థార్ రాక్స్ కొత్త బ్లాక్ ఎడిషన్ మోడల్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది.

ఈ సందర్భంగా బాలీవుడ్ స్టార్ హీరో జాన్ అబ్రహం నటించిన టీజర్ వీడియోను కంపెనీ విడుదల చేసింది. ఆటోమోటివ్ ప్రపంచానికి బ్లాక్ ఎడిషన్ గురించి పరిచయం చేసింది. థార్ రాక్స్ లాంచ్‌లో కూడా జాన్ అబ్రహం కనిపించారు. తనకు ఆ కారును సొంతం చేసుకోవాలని ఉందని తెలిపాడు. తనకు బ్లాక్ కలర్ అంటే చాలా ఇష్టం. అతని గ్యారేజీలోని అన్ని వాహనాలు కూడా బ్లాక్ కలర్లోనే ఉంటాయి.
దీంతో 5-డోర్స్ థార్ కూడా బ్లాక్ కలర్ కావాలని జాన్ కోరాడు. ఇదే విషయాన్ని మహీంద్రా డిజైన్ హెడ్ ప్రతాప్ బోస్ కూడా ధృవీకరించారు. ఆ విధంగా కంపెనీ SUVని పూర్తిగా బ్లాక్ కలర్ లో తయారు చేసేందుకు రెడీగా ఉంది. మహీంద్రా థార్ రాక్స్ బ్లాక్ ఎడిషన్ జాన్ అబ్రహంకు స్పెషల్ గా ఇవ్వనున్నారా.. లేక అది కంపెనీ మొదటి మోడల్ అవుతుందా అన్న విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.

స్పెషల్ పర్సన్ కోసం థార్స్ రాక్స్ తయారుచేస్తే అంచనాలు అపరిమితంగా ఉంటాయి. దీంతో "కౌంట్‌డౌన్ ప్రారంభం కానివ్వండి" అనే క్యాప్షన్‌తో టీజర్ వీడియో విడుదల చేసింది కంపెనీ. ఇటీవల మహీంద్రా మార్కెట్లో స్కార్పియో ఎన్ కార్బన్ ఎడిషన్‌ను విడుదల చేసింది. థార్ రాక్స్ బ్లాక్ ఎడిషన్ కూడా అలాగే ఉంటుంది. ఈ వాహనం స్కార్పియో N SUV మాదిరిగానే రూపొందింది.
థార్ రాక్స్ 5-డోర్స్ వెర్షన్ 3-డోర్స్ మోడల్ కంటే మరింత మెరుగ్గా ఉంటుంది. ఈ SUV పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. మహీంద్రా ఈ SUV కి అనేక ప్రీమియం ఫీచర్లను కూడా యాడ్ చేసింది. వెంటిలేటెడ్ సీట్స్, ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, లెవెల్ 2 ADAS, లెథరెట్ అప్హోల్స్టరీ, పనోరమిక్ సన్ రూఫ్, క్రూయిజ్ కంట్రోల్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, 360-డిగ్రీ కెమెరా ఉన్నాయి.

థార్ రాక్స్ ఎక్సటర్నల్ డిజైన్ చూస్తే.. 6-ప్యాక్ గ్రిల్, న్యూ వీల్స్, LED డేటైమ్ రన్నింగ్ లైట్స్, పిల్లర్-మౌంటెడ్ రియర్ డోర్ హ్యాండిల్స్ ను కలిగి ఉంటుంది. మహీంద్రా థార్ రాక్స్ RWD, 4x4 వెర్షన్లలో లభిస్తుంది. థార్ రాక్స్ 6 ట్రిమ్స్‌లో మొత్తం 18 వేర్వేరు వేరియంట్స్‌లో వస్తుంది. ఫోర్-వీల్ డ్రైవ్ (4WD) MX5, AX5L, AX7L ట్రిమ్స్ లో మాత్రమే అందుబాటులో ఉంటుంది.
4×4 వేరియంట్లు ఐవరీ, మోచా ఇంటీరియర్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉన్నాయి. కస్టమర్లు ఏడు కలర్ ఆఫ్షన్లలో థార్ రాక్స్ ను సెలక్ట్ చేసుకోవచ్చు. అవి స్టెల్త్ బ్లాక్, టాంగో రెడ్, ఎవరెస్ట్ వైట్, డీప్ ఫారెస్ట్, నెబ్యులా బ్లూ, బాటిల్‌షిప్ గ్రే, బర్న్ట్ సియెన్నా. వీటికి మరో కొత్త బ్లాక్ ఎడిషన్ యాడ్ కానుంది. ఈ SUV 2.0-లీటర్ టర్బో పెట్రోల్, 2.2-లీటర్ డీజిల్ ఇంజన్ ఆఫ్షన్లతో లభిస్తుంది.
ఇందులో 6 స్పీడ్ మాన్యువల్ లేదా 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ఉన్నాయి. ఈ థార్ రాక్స్ డీజిల్ మోడల్స్ 172 bhpపవర్ , 370 Nm పీక్ టార్క్ ప్రొడ్యూస్ చేయగలవు. పెట్రోల్ వెర్షన్ విషయానికి వస్తే, SUV.. M-స్టాలియన్ ఇంజన్ 174 bhp పవర్, 380 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. థార్ రాక్స్ ధర రూ.12.99 లక్షల నుండి రూ. 23.09 లక్షలు ఉంటుంది.


Click it and Unblock the Notifications








