లక్‌ అంటే రాహుల్‌దే.. బిర్యానీ తిని రూ. 7 లక్షల ఖరీదైన కారు గెలిచాడు.!!

బిర్యానీ తిని ఖరీదైన కారును సొంతం చేసుకున్నాడు ఓ వ్యక్తి. బిర్యానీ తింటే కారుకు ఓనర్‌ అవడం ఏంటని అనుకుంటున్నారా.. అవునండీ.. కొత్త సంవత్సరంలో ఈ వ్యక్తి రూ. లక్షల ఖరీదు చేసే కారుకు యజమానిగా మారాడు. దీంతో అతని ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు.. ఆ కారేంటి.. పూర్తి సమాచారం ఈ కథనంలో..

అదృష్టం అంటే అతనిదే అని చెప్పుకుంటున్నారు ఇప్పడు అంతా.. ఆ హోటల్‌లో బిర్యానీ(Biryani 7 lakhs Car win) తిన్న ఆ వ్యక్తి ఇప్పుడు కొత్త సంవత్సరంలో కొత్త నిస్సాన్‌ మాగ్నైట్‌ కారుకు(Nissan Magnite) యజమాని అయ్యాడు. రూ. 7 లక్షల విలువైన ఈ కారును జాంజాం అంటూ సంతోషంగా ఇంటికి తీసుకెళ్లాడు. ఇది ఎక్కడ జరిగిందంటే..

Man-Wins-Nissan-Magnite-Rs-7-Lakh-Car

ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి నగరంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. తిరుపతిలోని రోబో హోటల్‌ నిర్వాహకులు 2023 సెప్టెంబర్ నెలలో వినూత్న కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. వారి హోటల్‌లో బిర్యాని తిన్న ప్రతి ఒక్కరికి లక్కీ డ్రా కూపన్ అందజేశారు. దీంతో రోబో హోటల్‌కి వచ్చిన కస్టమర్లకు కూపన్ల పంపిణీ ద్వారా సుమారు 23 వేలకు పైగా కూపన్లు వచ్చాయి.

జనవరి 1 కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకొని డిసెంబర్‌ 31 ఆదివారం రాత్రి రోబో(Robo Hotel) హోటల్ అధినేత భరత్ కుమార్ రెడ్డి, ఆయన భార్య నీలిమ దంపతులు.. హోటల్ ఆవరణలో ఏర్పాటుచేసిన ఓ కార్యక్రమంలో లక్కీ డ్రా(Lucky Draw) నిర్వహించారు. అందులో నుంచి ఓ కూపన్‌ వెలికి తీయగా.. తిరుపతికి చెందిన రాహుల్ విజేతగా నిలిచినట్లు వారు ప్రకటించారు.

Man-Wins-Nissan-Magnite-Rs-7-Lakh-Car

లక్కీ డ్రాలో విజేతగా నిలిచిన రాహుల్‌కు దాదాపు రూ. 7 లక్షల విలువైన నిస్సాన్ మ్యాగ్నైట్(Lucky Draw Nissan Magnite Car) కారును హోటల్‌ నిర్వాహకులు ఉచితంగా అందజేశారు. కారు గెలుచుకున్న విషయాన్ని హోటల్ అధినేతలు స్వయంగా రాహుల్‌కు ఫోన్ చేసి చెబుతూ శుభాకాంక్షలు తెలుపడంతో అతని ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

అనంతరం రాహుల్‌ను పిలిపించి అతనికి హోటల్‌ అధినేత కొత్త నిస్సాన్‌ మాగ్నైట్‌ కారును బహుమతిగా అందజేశారు. నిస్సాన్​ మాగ్నైట్ ఎస్‌యూవీ విషయానికొస్తే ఇందులో​ విశాలమైన 5 సీటర్​ కేబిన్​లో కీలెస్​ ఎంట్రీ, స్టార్ట్​ ఫంక్షన్​, ఆటోమెటిక్​ క్లైమేట్​ కంట్రోల్​, ప్రీమియం అప్​హోలిస్ట్రీ, 8.0 అంగుళాల ఇన్ఫోటైన్​మెంట్​ సిస్టెమ్​, జీబేఎల్​ ఆధారిత సౌండ్​ సిస్టమ్​ వంటి ఆకర్షయణీయమైన ఫీచర్లు ఉన్నాయి.

కొత్త నిస్సాన్​ మాగ్నైట్​(Nissan Magnite SUV)లో క్రోమ్​ సరౌండర్స్​తో కూడిన హెక్సాగొనల్​ గ్రిల్​, సిల్వర్​ స్కిడ్​ ప్లేట్​, బ్లాక్​డ్​ ఔట్​ పిల్లర్స్​, ఇండికేటర్​ మౌంటెడ్​ ఓఆర్​వీఎంలు, స్వెప్ట్​ బ్యాక్​ ఎల్​ఈడీ హెడ్​లైట్స్​, బంపర్​ మౌంటెడ్​ ఎల్​ షేప్​ డీఆర్​ఎల్స్​, 16 అంగుళాల డిజైనర్​ అలాయ్​ వీల్స్‌తో ఆకట్టుకునే డిజైన్‌తో రూపొందించారు.

నిస్సాన్​ మాగ్నైట్​ 1.0 లీటర్​ నేచురల్లీ ఆస్పిరేటెడ్​ పెట్రోల్​ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది 71 హెచ్​పీ పవర్​ను, 96 ఎన్​ఎం టార్క్​ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 5 స్పీడ్​ ఆటోమేటిక్​ గేర్​బాక్స్‌ ఆప్షన్‌ కూడా అందుబాటులో ఉంది. ఈ కారును మాన్యువల్‌, ఆటోమేటిక్‌ AMT, ఆటోమేటిక్‌ CVT ఆప్షన్లలో కొనుగోలు చేయవచ్చు.

More from DriveSpark

Article Published On: Tuesday, January 2, 2024, 15:48 [IST]
English summary
Man wins rs 7 lakh worth nissan magnite suv after eating biryani in tirupati robo hotel
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+