దుబాయ్‌లో అమ్ముడైన 'ఎలిమెంట్ పలాజో' మోటార్ హోమ్

By Ravi

ప్రపంచంలో కెల్లా అత్యంత ఖరీదైన మొబైల్ హోమ్ 'ఎలిమెంట్ పలాజో' (eleMMent Palazzo) గురించి గతంలో తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఓ కథనంలో ప్రచురించిన సంగతి తెలిసినదే. కాగా ఇప్పుడు ఈ ఎలిమెంట్ పలాజో దుబాయ్‌లో అమ్మడుపోయింది. ఎంతకో తెలుసా అక్షరాలా 17 కోట్లకు పైగా (2 మిలియన్ యూరోలు). పలాజో అంటే ఇటలీలో ప్యాలెస్ అని అర్థం. ఇది నిజంగా కదిలే చక్రాలపై నిర్మించిన ప్యాలెస్ మాదిరిగా ఉంటుంది.

ఇటలీకు చెందిన మార్చీ మొబైల్స్ అనే కంపెనీ ఈ విలాసవంతమైన మోటార్ హోమ్‌ను తయారు చేసింది. కళ్లు చెదిరే అందంతో, అత్యంత విలాసవంతమైన మరియు సౌకర్యవంతమైన ఇంటీరియర్లతో ఈ మోటార్ హోమ్‌ను తీర్చిదిద్దారు. 20 టన్నుల బరువు, 40 అడుగుల పొడవు ఉండే ఈ మోటార్ హోమ్‌లో 40-ఇంచ్ ఫ్లాట్ స్క్రీన్ టెలివిజన్, పాప్-అప్ కాక్‌టెయిల్ లాంజ్, వెచ్చగా చలికాచుకునేందుకు ఫైర్‌ప్లేస్, మాస్టర్ బెడ్‌రూమ్, చలికాలంలో లోపలివైపు వేడిగా ఉండేలా ఏర్పాటు చేసిన అండర్ ఫ్లోర్ హీటింగ్ సిస్టమ్ వంటి అనేక ప్రత్యేకతలు ఈ ఎలిమెంట్ పలాజో సొంతం.

ఇందులో మరొక విశిష్టత ఏంటంటే, ఈ వాహనం తనంతట తానే శుభ్రం చేసుకుంటుంది. ఆయిల్ రిచ్ దేశంగా పేరొంది దుబాయ్‌లో ఉండే షేక్‌లు బంగారం అన్నా బంగారు వర్ణం అన్నా చాలా ఇష్టం అందుకే, ఇందులో గోల్డ్ కలర్‌లో పెయింట్ చేసిన ఓ ఎలిమెంట్ పలాజోను దుబాయ్‌లో విక్రయించారు (ఎవరికి విక్రయించిందనే విషయం మాత్రం వెల్లడించలేదు). మరి కదిలే ప్యాలెస్ వివరాలు, విలాసాలేంటో ఈ ఫొటోఫీచర్‌లో పరిశీలిద్దాం రండి..!

దుబాయ్‌లో విక్రయం

దుబాయ్‌లో విక్రయం

ప్రపంచంలో కెల్లా అత్యంత ఖరీదైన మొబైల్ హోమ్ 'ఎలిమెంట్ పలాజో' ఇప్పుడు దుబాయ్ రోడ్లపై పరుగులు తీస్తుంది. ఆయిల్ రిచ్ దేశంగా పేరొంది దుబాయ్‌లో ఉండే షేక్‌లు బంగారం అన్నా బంగారు వర్ణం అన్నా చాలా ఇష్టం అందుకే, ఇందులో గోల్డ్ కలర్‌లో పెయింట్ చేసిన ఓ ఎలిమెంట్ పలాజోను దుబాయ్‌లో విక్రయించారు.

మార్చి మొబైల్

మార్చి మొబైల్

ఇటలీకు చెందిన మార్చీ మొబైల్స్ ఎలిమెంట్ పలాజో మోటార్ హోమ్‌ను తయారు చేసింది. ఈ వాహనం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మోటార్ హోమ్.

డ్రైవర్ క్యాబిన్

డ్రైవర్ క్యాబిన్

ఎలిమెంట్ పలాజో మోటార్ హోమ్ ఫ్రంట్ డిజైన్ చాలా విచిత్రంగా ఉంటుంది. దీని ఏరోడైనమిక్స్ కారణంగా 20 శాతం ఇంధనం ఆదా అవుతుంది. ఇది 530 హెచ్‌పి టర్బోఛార్జ్‌డ్ డీజిల్ ఇంజన్‌తో నడుస్తుంది.

విశాలమైన సోఫా

విశాలమైన సోఫా

మినీ బార్, మాస్టర్ బెడ్ విత్ అటాచ్డ్ బాత్‌రూమ్, ఆటోమేటిక్ సన్‌రూఫ్, సొగసైన ఇంటీరియర్ డిజైన్, కంటికి ఇంపైన ఇంటీరియర్ లైటింగ్, ఇంటర్నెట్ బ్రౌజ్ చేసేందుకు వైఫై, అతిథులకు ఆతిథ్యమిచ్చేందుకు విలాసవంతమైన సోఫా వంటి అనేక లగ్జరీ ఫీచర్లు ఈ కోచ్‌లో గమనించవచ్చు.

మాస్టర్ బెడ్ రూమ్

మాస్టర్ బెడ్ రూమ్

మినీ బార్

మినీ బార్

టెర్రాస్ లాంజ్

టెర్రాస్ లాంజ్

వాష్ రూమ్

వాష్ రూమ్

మూడు సెట్టింగ్స్

మూడు సెట్టింగ్స్

ఇందులో మూడు సెట్టింగ్స్ ఉంటాయి. అందులో ఒకటి వ్యక్తి ఉపయోగార్థం (ఎలిమెంట్ పలాజో), మరొకటి విఐపిల కోసం (ఎలిమెంట్ వైవా - విఐపి షటిల్), ఇంకొకటి ప్రచారం కోసం (ఎలిమెంట్ విజన్ - ప్రమోషన్ వెహికల్).

ఎలిమెంట్ వైవా - విఐపి షటిల్

ఎలిమెంట్ వైవా - విఐపి షటిల్

ఈ సెట్టింగ్ ప్రముఖులు, విఐపిలు మరియు వ్యాపార వేత్తల కోసం. ఇందులో ఆరుగు సౌకర్యంగా కూర్చొని వ్యాపార సంభాషణలు సాగించుకోవచ్చు.

ఎలిమెంట్ విజన్ - ప్రమోషన్ వెహికల్

ఎలిమెంట్ విజన్ - ప్రమోషన్ వెహికల్

ఈ సెట్టింగ్‌ డిస్‌ప్లే, ప్రమోషన్ ఏరియా కోసం ఉపయోగించుకోవచ్చు. ఇందులో 200 చ.అ. విస్తీర్ణంలో స్థలం ఉంటుంది.

దిమ్మతిరిగే ధర

దిమ్మతిరిగే ధర

ఈ మోటార్ వాహనం ధర 3.1 లక్షల డాలర్లు. అంటే మనదేశ కరెన్సీలో సుమారు రూ.17 కోట్లు.

ఆటోమేటిక్ క్లీనింగ్

ఆటోమేటిక్ క్లీనింగ్

ఈ వాహనం దానంతట అదే క్లీన్ చేసుకుంటుంది.

మార్చి మొబైల్ ఎలిమెంట్ పలాజో

More from DriveSpark

Article Published On: Thursday, June 13, 2013, 8:33 [IST]
English summary
The world's most expensive mobile home has gone on sale in Dubai for £2 million, or $3.1 million at today's conversion rates, The Daily Mail reports. Marchi Mobile has hit the peak of motor homes by launching the most expensive and luxurious recreational vehicle in the world. Named as eleMMent Palazzo, it is literally a palace on wheels.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+