గుండె మారుతి ఆల్టోది...! శరీరం ల్యాంబోర్గినిది...!!
కార్ల కంపెనీలు అందించే అన్ని రకాల డిజైన్‌లు, షేపులు అందరికి నచ్చవు. మరికొందరికి ఏ ల్యాంబోర్గిని, బెంజ్ , రోల్స్ రాయిస్ వంటి కార్లు కావాలనుకుంటారు. కాని బడ్జెతో సమస్య. అందు కోసం కొంత మంది కార్ల ప్రియులు తాము కొన్న కారును వారికి ఇష్టమొచ్చినట్లు తిరిగి డిజైన్ చేసుకుంటారు.
ఇక్కడున్న కారు మీరు అనుకుంటున్నట్లు ఏ స్పోర్ట్స్ కారు కాదు. ఇది ఒక సాధారణ కారు మాత్రమే. సాదారణ ప్రజల ల్యాంబోర్గిని కారుగా అందరి చేత ఇది ప్రశంసలు అందుకుంటోంది. అసలు దీని ప్రత్యేకత టో ఒక సారి చూద్దామా?

ఇది ఒక సాధారణ కారు మాత్రమే దీని అసలైన డోర్లను లాగేసి పక్షి రెక్కలు లాగా దీనికి డిజైన్ చేశారు. అంటే సాధారణ ప్రజల ల్యాంబోర్గిని అన్నట్లుగా దీనిని తయారు చేశారు.

దీని టాపును ఒక సారి గమనించండి. కారు మొత్తం ఎరుపు రంగులో మరియు కారు టాపును తెల్లగా మార్చేశారు. చూడటానికి ఎంతో అందంగా తీర్చిదిద్దారు.

ఇకపోతే దీని ముందు హెడ్ లైట్లు, పెద్దగా ఉన్న గ్రిల్ మరియు బంపర్ హ్యూందాయ్ ఆక్సంట్ నుండి తెచ్చి అమర్చారు.

దీని కోసం ఆల్టో 800 తన సైడ్ అద్దాలు త్యాగం చేసింది. దీనికి గల రిమ్ మరియు టైర్లను నలుపు రంగులో గల రిమ్ మరియు కొంచెం పెద్ద సైజు టైర్లతో మార్చేశారు.

ఇక దీనికున్న టెయిల్ ల్యాంప్స్ గమనించినట్లయితే వోక్స్‌వ్యాగన్ పోలో కారు నుండి సేకరించారు. వెనుకవైపు ఉన్న స్పాయిలర్ కూడా ఒక రకంగా చూడటానికి బాగుంది కదూ ?ఇందులో కొన్ని అనవసరమైనవి కూడా కల్పించారు. కారు వెనుకవైపున్న రెండు పొగ గొట్టాలలో ఒకటి అనవసరం కాని కొంచెం లుక్ కోసం వీటిని అందించారు.



Click it and Unblock the Notifications








