భారత్‌లో ఎప్పటకీ నెనే ముందు: బుల్లి కారు గొప్ప రికార్డు.
ప్రస్తుతం భారతీయ ఆటోమొబైల్ రంగంలో అత్యంత వేగంగా దూసుకుపోతున్న మోడల్ మారుతి సుజుకి. ఇది కేవలం ఇప్పటి మాటా మాత్రమే కాదు. గత 15 కాలంగా ఇదే దోరణి కొనసాగుతూ వస్తోంది. ప్రతి సంవత్సరంలా ఈ సారి కూడా రికార్డి స్థాయిలో అమ్మడుపోయాయి.
మారుతి సుజుకి ఇప్పుడు ప్రతి ఒక్కరి నాలుక మీద జపిస్తున్న మంత్రం. ఎందుకంటే మనకు కావాల్సిన శ్రేణిని బట్టి అన్ని రకాల మోడల్ కార్లను మారుతి సుజకి అందిస్తోంది. అయితే మారుతి సుజుకి కీర్తి ఇంతగా పెరగటానికి కారణం ఆల్టో అని చెప్పవచ్చు. ఇక ఆల్టో లో ఈ మద్యనే వచ్చిన కె10 మోడల్ కూడా వీటి ఫలితాలకు కారణం అయ్యాయి.
Also Read: మీ నగరంలో మారుతి సుజుకి కార్ల ధర తెలుసుకోడానికి ఇక్కడ క్లిక్ చెేయండి.
దేశ వ్యాప్తంగా అత్యధిక మంది కొనుగోలు చేసిన ఈ ఆల్టో కారు గురించి మరిన్ని విశేషాలు క్రింది కథనాల ద్వారా తెలుసుకుందాం...

28 లక్షలు
మారుతి సుజుకి తన ఆల్టో మోడల్ కార్ల అమ్మకాలను డిసెంబర్ 1983 సంవత్సరం నుండి ప్రారంభించింది. అప్పటి నుండి జనవరి 2014 వరకు 28 లక్షల ఆల్టో కార్లు అమ్మడుపోయాయి.

2015 నాటికి
అయితే అమ్మకాలు ప్రారంభించిన సమయం నుండి అక్టోబర్ 2015 వరకు మొత్తం 29,19,819 యూనిట్ల ఆల్టో కార్ల అమ్మకాలు జరిపి దేశంలో అత్యధికంగా అమ్ముడుపోయిన కార్ల రికార్డుల్లో మొదటి స్థానం సంపాదించుకుంది.

ఆల్టో 800 ఇంజన్
ఇంజన్: 796సీసీ
సిలిండర్ల సంఖ్య: 3-సిలిండర్లు
ఇంధనము: పెట్రోల్
పవర్: 47బిహెచ్‌పి
ట్రాన్స్‌మిషన్: 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్

మైలేజ్
మారుతి సుజుకి ఆల్టో 800 మైలేజ్‌కి మారు పేరు అని చెప్పవచ్చు. ఇది లీటర్ ఫ్యూయల్‌కి 21.88 కిలోమీటర్ల మైలేజ్‌ని అందిస్తుంది.

ఫీచర్లు
ఆల్టో 800 లో అద్వితీయమైన ఫీచర్లు ఉన్నాయి. ఇందులో యు.యస్.బి మరియు ఏ.యు.ఎక్స్ కనెక్టివిటితో గల ఆడియో సిస్టమ్, ఫ్యాబ్రిక్ సీట్లు మరియు పలర్ స్టీరింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

ఆల్టో 800 డిజైన్
ఆల్టో 800 ఇప్పుడు అన్ని వైపులా ఎంతో ఆకర్షణీయంగా డిజైన్ చేయబడినది. కారుకు ఇరువైపులా ఆకాశంలో గల ఒక సుందరమైన అలల వంటి ఆకృతితో డిజైన్ చేశారు. మరియు దీనికి ముందువైపు గల వేవ్ డిజైన్ ఎంతో అందగా ఉంది.



Click it and Unblock the Notifications








