Just In
- 12 hrs ago
మతిపోగొడుతున్న హ్యుందాయ్ మార్చ్ నెల డిస్కౌంట్స్.. దేనిపై ఎంతో చూసారా..!
- 15 hrs ago
భారత్‌లో విడుదలైన 3 కొత్త NIJ ఎలక్ట్రిక్ స్కూటర్స్.. చీప్ కాస్ట్ & మోర్ ఫీచర్స్
- 16 hrs ago
గుడ్ న్యూస్! ఇకపై ఈ సేవల కోసం ఆర్టీఓ చుట్టూ తిరగక్కర్లేదు, అన్నీ ఆన్లైన్లోనే..
- 17 hrs ago
కేవలం 65,920 రూపాయలకే కొత్త బజాజ్ ప్లాటినా 110 ఎబిఎస్ బైక్ ; వివరాలు
Don't Miss
- News
రఘురామ మళ్లీ కౌంటర్.. సీఎం జగన్ కూడా భాగస్వాములే.. హాట్ కామెంట్స్..
- Movies
చరిత్ర సృష్టించిన సుడిగాలి సుధీర్: వాళ్లందరిపై ఆధిపత్యం చూపిస్తూ.. ఊహించని రికార్డు సొంతం
- Lifestyle
శనివారం దినఫలాలు : ఓ రాశి ఉద్యోగులకు ఉన్నతాధికారులతో మంచి సమన్వయం ఉంటుంది...!
- Finance
ధరలు ఎలా ఉన్నాయంటే? 44వేలకు దిగొచ్చిన బంగారం, వెండి రూ.66 వేల దిగువన
- Sports
ఆ విషయంలో రోహిత్ శర్మను చూసి విరాట్ కోహ్లీ నేర్చుకోవాలి: మనోజ్ తివారీ
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఆటో డ్రైవర్ కొడుకు ఇప్పుడు 'బీమర్' ఓనర్ అయ్యాడు; సిరాజ్ కొత్త కార్ చూడండి
ఆస్ట్రేలియా టూర్‌లో అద్భుతమైన పనితీరుని చూపిన, భారత క్రికెటర్ మొహమ్మద్ సిరాజ్ ఇప్పుడు 'బీమర్' ఓనర్ అయ్యాడు. ఆటో డ్రైవర్ కొడుకుగా భారత క్రికెట్ జట్టులోకి ప్రవేశించి, తన ప్రతిభతో అందరినీ ఆకట్టుకున్నాడు. ఇప్పుడు యావత్ దేశం సిరాజ్ నామస్మరన చేస్తోంది.

ఆసీస్ టూర్ విజయాన్ని జరుపుకునేందుకు సిరాజ్ ఓ కొత్త బిఎమ్‌డబ్లూ కారుని కొనుగోలు చేసి దేశంలోని బీమర్ క్లబ్‌లో చేరిపోయారు (బిఎమ్‌డబ్ల్యూ తయారు చేసే కార్లు లేదా మోటార్‌సైకిళ్లను ముద్దుగా బీమర్ అని పిలుస్తారు).

సిరాజ్‌కి కూడా కార్లంటే చాలా ఆసక్తి. సిరాజ్ తన కొత్త బిఎమ్‌డబ్ల్యూ కారుకి సంబంధించిన ఫొటోలను, వీడియోలను సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకున్నారు. అభిమానులు, ప్రముఖులు అతనికి సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలియజేశారు.
MOST READ:రిపబ్లిక్ డే పరేడ్‌లో ప్రదర్శించనున్న యుద్ధ విమానాలు ఇవే, చూసారా..!

ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో జరిగిన రెండో టెస్టు ద్వారా ఎంట్రీ ఇచ్చిన మొహమ్మద్ సిరాజ్, నాలుగో టెస్టుకు చేరుకునే సరికి బౌలింగ్ విభాగానికి నాయకత్వం వహించాడు. ఆసిస్ టూర్‌లో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్‌గా సిరాజ్ మంచి పేరు తెచ్చుకున్నాడు.

బాధాకరమైన విషయం ఏంటంటే, ఈ టెస్ట్ ఆరంభానికి ముందే సిరాజ్ తన తండ్రిని కోల్పోయాడు. తండ్రి మరణవార్త తెలిసినా, అంతిమ యాత్రలకు కూడా రాకుండా జట్టుతో ఉండి, భారత క్రికెట్ జట్టు పట్ల తన విశ్వాసాన్ని నిరూపించుకున్నాడు. ఇటీవలే ఇండియాకి చేరుకున్న సిరాజ్ నేరుగా తన తండ్రి సమాధి వద్దకు వెళ్లి నివాళులు అర్పించారు.
MOST READ:ఇద్దరు కానిస్టేబుళ్లను పొట్టన పెట్టుకున్న బిఎండబ్ల్యు.. ఎలాగో మీరే చూడండి

కాగా, మొహమ్మద్ సిరాజ్ కొనుగోలు చేసిన బిఎమ్‌డబ్ల్యూ కారు ఏ మోడల్ అనే విషయాన్ని ఆయన వెల్లడించనప్పటికీ, అది 5 సిరీస్ మోడల్ కావచ్చునని తెలుస్తోంది. ఈ కారుకి ముందు సిరాజ్ జీప్ కంపాస్ ఎస్‌యూవీని కొనుగోలు చేశాడు. అతను ఈ ఎస్‌యూవీని 2018లో కొన్నాడు.

మొహమ్మద్ సిరాజ్ వయస్సు ఇప్పుడు 26 సంవత్సరాలు. ఆటో డ్రైవర్ కొడుకుగా తన ప్రస్థానం ప్రారంభించిన సిరాజ్, ఇప్పుడు అంచలంచెలుగా ఎదుగుతూ వస్తున్నాడు. ఇప్పుడు దేశమంతా సిరాజ్‌ను ప్రసంశలతో ముంచెత్తుతోంది.
MOST READ:మీకు తెలుసా.. జో బైడెన్ ప్రయాణించే విమానం, విమానం మాత్రమే కాదు.. రక్షణ కవచం

ఇక సిరాజ్ మొదటి కారైన జీప్ కంపాస్ విషయానికి వస్తే, సిరాజ్ ఈ కారును రెడ్ కలర్‌లో కొనుగోలు చేశాడు. అయితే, అది ఏ వేరియంట్ అనే వివరాలు మాత్రం తెలియరాలేదు. చాలా సందర్భాల్లో సిరాజ్ తన జీప్ కారుతో తీసుకున్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

భారత్‌లో జీప్ కంపాస్ ఎస్‌యూవీ ధరలు రూ.16.51 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభం అవుతాయి. కాగా, అమెరికాకు చెందిన ఈ ఐకానిక్ కార్ బ్రాండ్ జీప్, తమ సరికొత్త 2021 జీప్ కంపాస్ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను జనవరి 27వ తేదీన మార్కెట్లో విడుదల చేయనుంది.
MOST READ:కొత్త 2021 రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ మోటార్‌సైకిల్ వస్తోందోచ్..

జీప్ కంపాస్ ఫేస్‌లిఫ్ట్ మోడల్ కోసం ఇప్పటికే బుకింగ్‌లు కూడా ప్రారంభమయ్యాయి. మునుపటి మోడల్‌తో పోలిస్తే ఈ కొత్త 2021 కంపాస్ సరికొత్త డిజైన్ మరియు ఫీచర్లను కలిగి ఉంటుంది. ఈ కారుకి సంబంధించిన పూర్తి సమాచారం కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.