విడుదలకు ముందే జీప్ కంపాస్ ఫేస్‌లిఫ్ట్ వేరియంట్ల వివరాలు లీక్

అమెరికాకు చెందిన ఐకానిక్ కార్ బ్రాండ్ జీప్, ఈనెల 7వ తేదీన భారత మార్కెట్లో ఆవిష్కరించిన సరికొత్త 2021 జీప్ కంపాస్ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను జనవరి 27వ తేదీ నుండి అధికారికంగా విక్రయించనున్నారు. ఈ నేపథ్యంలో, విడుదలకు ముందే కొత్త కంపాస్ వేరియంట్ల వివరాలు లీక్ అయ్యాయి.

విడుదలకు ముందే జీప్ కంపాస్ ఫేస్‌లిఫ్ట్ వేరియంట్ల వివరాలు లీక్

జీప్ కంపాస్ ఫేస్‌లిఫ్ట్ మోడల్ కోసం ఇప్పటికే బుకింగ్‌లు కూడా ప్రారంభమయ్యాయి. మునుపటి మోడల్‌తో పోలిస్తే ఈ కొత్త 2021 కంపాస్ సరికొత్త డిజైన్ మరియు ఫీచర్లను కలిగి ఉంటుంది. తాజాగా లీకైన సమాచారం ప్రకారం, కొత్త జీప్ కంపాస్ ఎస్‌యూవీ మొత్తం 5 వేరియంట్లలో విడుదల చేయనున్నారు.

విడుదలకు ముందే జీప్ కంపాస్ ఫేస్‌లిఫ్ట్ వేరియంట్ల వివరాలు లీక్

టీమ్‌బిహెచ్‌పి నివేదిక ప్రకారం, కొత్త 2021 జీప్ కంపాస్‌ను స్పోర్ట్స్, లాంగిట్యూడ్, లిమిటెడ్, లిమిటెడ్ (ఆప్షనల్), ఎస్ అనే ఐదు వేరియంట్లలో విడుదల చేయనున్నారు. ఈ ఐదు వేరియంట్లలో విభిన్నమైన ఫీచర్లు మరియు పరికరాలు లభిస్తాయి.

MOST READ:మళ్ళీ లాంగ్ డ్రైవ్‌లో కనిపించిన అజిత్.. ఈ సారి ఎక్కడికెళ్లాడో తెలుసా

విడుదలకు ముందే జీప్ కంపాస్ ఫేస్‌లిఫ్ట్ వేరియంట్ల వివరాలు లీక్

తాజా సమాచారం ప్రకారం, జీప్ కంపాస్ ఫేస్‌లిఫ్ట్ స్పోర్ట్స్ వేరియంట్‌లో డ్యూయెల్ ఎయిర్‌బ్యాగులు, ఎల్‌ఈడి హెడ్‌ల్యాంప్‌లు, 8.4 ఇంచ్ యు కనెక్ట్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో / ఆపిల్ కార్ ప్లే సపోర్ట్, 17 ఇంచ్ అల్లాయ్ వీల్స్, బ్లాక్ ఫాబ్రిక్ సీట్లు, 3.5 ఇంచ్ ఎమ్ఐడి, రియర్ వైపర్స్ మరియు హిల్ అసిస్ట్ సిస్టమ్ వంటి ఫీచర్లు లభ్యం కానున్నాయి.

విడుదలకు ముందే జీప్ కంపాస్ ఫేస్‌లిఫ్ట్ వేరియంట్ల వివరాలు లీక్

అలాగే, కంపాస్ లాంగిట్యూడ్ వేరియంట్లో పుష్ స్టార్ట్ /స్టాప్ బటన్, రూఫ్ రెయిల్స్, స్కై గ్రే ఇంటీరియర్స్, 7.0 ఇంచ్ టిఎఫ్‌టి ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 6-స్పీకర్లు, ఎలక్ట్రికల్ ఫోల్డబుల్ సైడ్ మిర్రర్స్ మరియు ఎల్‌ఈడి ఫాగ్ లాంప్స్‌తో పాటుగా స్పోర్ట్స్ వేరియంట్‌లో లభించే ఇతర ఫీచర్లు కూడా ఇందులో లభ్యం కానున్నాయి.

MOST READ:కొత్త హోండా వెజెల్ ఎస్‌యూవీ టీజర్ విడుదల

విడుదలకు ముందే జీప్ కంపాస్ ఫేస్‌లిఫ్ట్ వేరియంట్ల వివరాలు లీక్

ఇందులోని లిమిటెడ్ వేరియంట్‌లో ఆటో హోల్డ్ (ఏటి మాత్రమే), 4X4లో హిల్ డీసెంట్, డ్యూయెల్ కలర్, మెమరీ ఫంక్షన్‌తో కూడిన ఎలక్ట్రికల్లీ అడ్జస్టబల్ డ్రైవర్ సీట్, ఆటో డిమ్మింగ్ డే / నైట్ ఇన్‌సైడ్ రియర్ వ్యూ మిర్రర్, రెయిన్ సెన్సింగ్ వైపర్స్, 6 ఎయిర్ బ్యాగులు, 18 ఇంచ్ అల్లాయ్ వీల్స్, మరియు ఫ్రంట్ స్కిడ్ ప్లేట్ వంటి ఫీచర్లు లభ్యం కానున్నాయి.

విడుదలకు ముందే జీప్ కంపాస్ ఫేస్‌లిఫ్ట్ వేరియంట్ల వివరాలు లీక్

కాగా, కంపాస్ లిమిటెడ్ (ఆప్షనల్) వేరియంట్‌లోని లిమిటెడ్ వేరియంట్లో లభించే ఫీచర్లకు అదనంగా డ్యూయెల్ పనోరమిక్ సన్‌రూఫ్, 10.1-ఇంచ్ కనెక్ట్ ఇన్ఫోటైన్‌మెంట్ మరియు పవర్డ్ టెయిల్‌గేట్ వంటి ఫీచర్లు లభ్యం కానున్నాయి.

MOST READ:3 కి.మీ ట్రక్కుని రివర్స్ గేర్‌లో నడిపిన డ్రైవర్.. ఎందుకనుకుంటున్నారా, అయితే ఇది చూడండి

విడుదలకు ముందే జీప్ కంపాస్ ఫేస్‌లిఫ్ట్ వేరియంట్ల వివరాలు లీక్

ఇకపోతే, టాప్-ఎండ్ అయిన ఎస్ వేరియంట్‌లో టిపిఎమ్ఎస్, 9-స్పీకర్ ఆల్పైన్ ఆడియో సిస్టమ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, బ్లాక్ లెదర్ ఇంటీరియర్, వైర్‌లెస్ ఛార్జింగ్, 10.25-ఇంచ్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఫ్రంట్ ప్యాసింజర్ కోసం ఎలక్ట్రిక్ సీట్ మరియు యాంబియంట్ ఫుట్ లైట్స్ మొదలైన ఫీచర్లు ఉండనున్నాయి.

విడుదలకు ముందే జీప్ కంపాస్ ఫేస్‌లిఫ్ట్ వేరియంట్ల వివరాలు లీక్

ఎగ్జోటిక్ రెడ్, మెగ్నీసియో గ్రే, మినిమల్ గ్రే, బ్రైట్ వైట్, బ్రిలియంట్ బ్లాక్, గెలాక్సీ బ్లూ మరియు టెక్నో గ్రీన్ అనే ఏడు కలర్ ఆప్షన్లలో కొత్త 2021 జీప్ కంపాస్ అందుబాటులోకి రానుంది. మార్కెట్ అంచనా ప్రకారం, కొత్త జీప్ కంపాస్ ధర రూ.17 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభం కావచ్చని అంచనా. మరిన్ని వివరాలు జనవరి 27, 2021న తెలియనున్నాయి.

MOST READ:సైనికుల కోసం బుల్లెట్ బైక్‌లనే మొబైల్ అంబులెన్స్‌లుగా మార్చేశారు..

విడుదలకు ముందే జీప్ కంపాస్ ఫేస్‌లిఫ్ట్ వేరియంట్ల వివరాలు లీక్

జీప్ కంపాస్ ఫేస్‌లిఫ్ట్ ఇంజన్ ఆప్షన్స్ విషయానికి వస్తే, ఇది రెండు ఇంజన్ ఆప్షన్లలో లభ్యం కానుంది. ఇందులో మొదటిది 1.4-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్, ఇది 161 బిహెచ్‌పి శక్తిని మరియు 250 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇకపోతే రెండవది 2.0-లీటర్ బిఎస్6 డీజిల్ ఇంజన్. ఇది 170 బిహెచ్‌పి శక్తిని మరియు 350 ఎన్ఎమ్ టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఇది ఈ విభాగంలో టాటా సఫారీ, ఎమ్‌జీ హెక్టర్ వంటి మోడళ్లకు పోటీగా ఉంటుంది.

Source:Team BHP

Most Read Articles

Read more on: #జీప్ #jeep
English summary
Jeep Compass Facelift Variants Details Leaked Ahead Of Official Launch. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X