2017 సంవత్సరం కోసం ఉద్దేశించబడిన కొత్త బోయింగ్ 737 మ్యాక్స్ విమానం.
అమెరికా ఆధారిత విమానాల తయారీ సంస్థ బోయింగ్ యొక్క విజయం మంత్రం బోయింగ్ 737 అని చెప్పవచ్చు. బోయింగ్ సంస్థ ఈ 737 సిరీస్ విమానాల తయారీని 1967 లో ప్రారంభించింది. అప్పటి నుండి బోయింగ్ విమానాల విజయ పరంపర కొనసాగుతూ వచ్చింది.
Also Read: ప్రపంచంలో కెల్లా అత్యంత చవకైన ఎయిర్‌లైన్స్
ప్రపంచ వ్యాప్తంగా గల వివిధ ప్యాసింజర్ ఎయిర్‌వేస్ సంస్థలు తమ వ్యాపార వాణిజ్య అవసరాలకు ఈ బోయింగ్ 737 కుటుంబానికి చెందిన విమనాలను విరివిగా ఉపయోగించడం ప్రారంభించాయి. అందుకోసం బోయింగ్ ఈ సిరీస్ విమానాలలో మరిన్ని నూతన ఫీచర్లను అందించి ప్రపంచ మార్కెట్ అవసరాలకు అందివ్వడం మొదలు పెట్టింది. ఇప్పుడు బోయింగ్ ప్రవేశపెట్టిన 737 మ్యాక్స్ విమానం అదనపు సమాచారం గురించి క్రింద గల స్లైడర్ ద్వారా తెలుసుకుందాం రండి.

ఇప్పుడు ప్రపంచానికి పరిచయం అయిన ఈ బోయింగ్ 737 మ్యాక్స్ విమానం, బోయింగ్ 737 కుటుంబంలో నాలుగవ తరానికి చెందినది.

ఎక్కువ ఫ్యూయల్ ఎఫీషియన్సీ మరియు అతి తక్కువ నిర్వహణ ఖర్చులతో ఉపయోగించే విధంగా బోయింగ్ ఈ 737 మ్యాక్స్ ఎయిర్ క్రాఫ్ట్ ను సృష్టించింది.

ఈ బోయింగ్ 737 ఎయిర్ క్రాఫ్ట్‌ను ఇతర వాటితో పోల్చగా దాదాపుగా 20 శాతం వరకు ఉత్తమ మైలేజ్ ని ఇవ్వగలదని తెలిపారు.

ఇది అతి చౌక విమానయాన సంస్థలకు బాగా సరిపోతుందని తెలిపారు. అంతే కాకుండా దీని మొత్తం నిర్వహణ ఖర్చును ప్రతి సీటుతో లెక్కగట్టగా, సీటు కు ఎనిమిది శాతం మాత్రమే నిర్వహణ ఖర్చు అవుతుందని తెలిపారు.

ఈ కొత్త బోయింగ్ 737 మ్యాక్స్ విమానంలో గల కొత్త టెక్నాలజీ రెక్కలు దాదాపుగా 1.8 శాతం మైలేజ్‌ని పెంచడానికి సహాయపడతాయి.

ఈ సరికొత్త 737 మ్యాక్స్ బోయింగ్ ఎయిర్ క్రాఫ్ట్‌లో సియఫ్‌ఎమ్ లీప్-1బి వంటి కొత్త ఇంజన్‌లు అమర్చబడ్డాయి. ఇవి ఎక్కువ ఫెర్ఫామెన్స్, ఉత్తమమైన మైలేజ్ ఇస్తాయి అంతే కాకుండా ఇవి ఎంతో సేఫ్ కూడా.

ఈ బోయింగ్ కొత్త ఎయిర్ క్రాఫ్ట్‌లోని ఇంటీరియర్‌లో ఎన్నో నూతన మార్పులు చోటు చేసుకున్నాయి. సౌకర్యవంతమైన సీట్లు, విలాసవంతమైన ఎంటర్‌టైన్‌మెంట్ ఫీచర్లు మరియు ఆహ్లాదకరమైన వాతారవణాన్ని కల్పించార.

ఈ బోయింగ్ 737 మ్యాక్స్ విమానం నాలుగు మోడల్స్‌లో లభింస్తోంది. 149 ప్రయాణికుల పరిమితి గల బోయింగ్ 737 మ్యాక్స్-7, 189 ప్రయాణికుల పరిమితి గల మ్యాక్స్ -8, 200 మంది ప్రయాణికుల పరమితి గల మ్యాక్స్-200 మరియు మ్యాక్స్-9 మోడల్‌లో 220 మంది ప్రయాణించవచ్చు.

బోయింగ్ 737 మ్యాక్స్-7 మోడల్ విమానం 7 మీటర్లు పొడవు కలదు. మ్యాక్స్-8 మరియు 200 మోడల్స్ రెక్కల పొడవు 39.9 మీటర్లు మరియు మ్యాక్స్-9 విమానం రెక్కల పొడవు దాదాపుగా 42.2 మీటర్లు కలదు.

బోయింగ్ 737 మ్యాక్స్ ధరలు
బోయింగ్ 737 మ్యాక్స్-7 ధర 90.2 మిలియన్ అమెరికన్ డాలర్లు, బోయింగ్ 737 మ్యాక్స్-8 మరియు మ్యాక్స్-200 విమానాల ధరలు దాదాపుగా 110 మిలియన్ డాలర్లుగా ఉంది ఇక బోయింగ్ 737 మ్యాక్స్-9 మోడల్ ధర 116 మిలియన్ అమెరికన్ డాలర్లుగా ఉంది.

బోయింగ్ ఈ మొదటి 737 మ్యాక్స్ విమానాన్ని నైఋతి విమానయాన సంస్థకు డెలివరి ఇవ్వనుంది. ఇక మన దేశంలో గల చౌక విమానయాన సంస్థ కూడా దీనిని బుక్ చేసుకుంది. అయితే ఈ బోయింగ్ 737 మ్యాక్స్ విమానాన్ని 2017 కల్లా డెలివరీ ఇవ్వనున్నారు.

- ఇవే అత్యుత్తమ ఎయిర్‌లైన్స్
- పక్షి ఢీ కొంటే పతనమవుతున్న విమానాలు: అస్సలు మర్మం ఎమిటి?
- ISIS తీవ్రవాదుల సమూల నాశనానికి ఫ్రాన్స్ పథకం


Click it and Unblock the Notifications








