కేంద్ర మంత్రులు, వారి కార్లు - పార్ట్ 1

ఇటీవల ప్రధానమంత్రితో సహా ఇతర మంత్రులు తమ తమ ఆస్తుల వివరాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మన దేశంలోని వివిధ మంత్రులు ప్రకటించిన ఆస్తుల వివరాల ప్రకారం, వారి వద్ద ఉన్న కార్ల వివరాలు ఇలా ఉన్నాయి.

కేంద్ర ఆర్థికమంత్రి ప్రణబ్ ముఖర్జీ వద్ద 2000 సంవత్సరం మోడల్ ఫోర్డ్ ఐకాన్ కారు మాత్రమే ఉందట. ఫర్వాలేదు ఇది మన ప్రధానమంత్రి (మారుతి 800) కారు కన్నా కొంచెం పెద్దది మరియు విలువైనదే. ప్రస్తుతం ఈ కారు విలువ సుమారు రూ.1,06,250 వరకూ పలకవచ్చు.

కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి జైరామ్ రమేష వద్ద ఉన్న కారు మారుతి జెన్. అంటే ప్రణబ్ ముఖర్జీ కారు కన్న చిన్నది, మన్మోహన్ సింగ్ కారు కన్నా పెద్దది. దీన్ని 2004లో ఆయన కొనుగోలు చేశారు. ప్రస్తుత మార్కెట్ వ్యాల్యూ ప్రకారం ఈ కారు విలువ సుమారు రూ.3,50,000 గా ఉండొచ్చు.

అరే.. మన కేంద్ర వ్యవసాయ శాఖా మంత్రి శరద్ పవార్ వద్ద అస్సలు ఒక్క కారు కూడా లేదట. అదేంటబ్బా భారతదేశపు అత్యంత ధనవంతులైన మంత్రుల్లో ఒకరైన పవార్ వద్ద కారు లేకపోవడం ఏంటి. ఆశ్చర్యంగా ఉంది కదూ. ఈయన మొత్తం సంపద విలువ సుమారు రూ.12.5 కోట్లు. పాపం పేరుకే వ్యవసాయా శాఖా మంత్రి కనీసం ఆయన వద్ద ఓ ట్రాక్టర్ కూడా లేదు.

కేంద్ర కేంద్ర పట్టణాభివృద్ధి శాఖా మంత్రి కమల్ నాథ్ వద్ద ఉన్న కారు ఏంటో తెల్సా.. ఒకప్పటి స్టేటస్ సింబల్ కారు అంబాసిడర్ మరియు ఇప్పటి ప్రజల కారు అయిన టాటా నానో (అది కూడా టాప్ ఎండ్ వేరియంట్ అండోయ్). ప్రస్తుత మార్కెట్ వ్యాల్యూ ప్రకారం ఈయన రెండు కార్లను వెల కడితే టాటా నానో కారు వెల రూ.1,96,332 మరియు అంబాసిడర్ కారు వెల రూ.4,84,822 గా ఉండొచ్చు.

More from DriveSpark

Article Published On: Saturday, September 17, 2011, 8:56 [IST]
English summary
Finance Minister Pranabh Mukherjee is a proud owner of a 2000 Ford Ikon which is touch more expensive and spacious than our prime minister's Maruti 800. The old icon is priced at Rs.1,06,250.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+