కేంద్ర మంత్రులు, వారి కార్లు - పార్ట్ 2

ఈ మంత్రి చెప్పుకోదగిన వ్యక్తే... మన కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం వద్ద ఉండే కార్లు ఏంటంటే.. ఒక ఫోర్డ్ ఫియస్టా, ఒక స్కొడా మరొక ఫోక్స్‌వ్యాగన్ కార్లు ఉన్నాయి. కార్లపై ఈయన రూ.46 లక్షలకు పైగా ఖర్చు చేశారట. అందులో అత్యంత ఖరీదైనది స్కొడా కారు దీని విలువ సుమారు రూ.22 లక్షలు. అంతేకాదండోయ్ ఈయన దగ్గర ఓ సైకిల్ కూడా ఉంది, రూ.1,239 చెల్లించి చిదంబరం ఈ సైకిల్‌ను కొనుగోలు చేశారట.
టెలికాం మంత్రి కపిల్ సిబాల్ మంచి కార్ ప్రియుడు. ఈయన వద్ద ఓ టొయోటా కరోలా, హ్యుందాయ్ సొనాటా మరియు ఓ సుజుకి జీప్ ఉంది. అంతేకాకుండా సిబాల్ వద్ద ఓ రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిల్ కూడా ఉంది. ప్రస్తుతం దీని విలువ రూ.7,97,000.
విదేశాంగ మంత్రి ఎస్.ఎమ్ క్రిష్ణ వద్ద రెండు కార్లు మాత్రమే ఉన్నాయట. అందులో ఒకటి మిత్సుబిషి లాన్సర్ మరొకటి హ్యుందాయ్ సొనాట. లాన్సర్ కారు కోసం రూ.8,30,000 లను, సొనాటా కోసం రూ.13,08,000 లను చెల్లించినట్లు ఆయన తన ఆస్తుల వివరాల్లో పేర్కొన్నారు.
న్యాయ శాఖా మంత్రి సల్మాన్ ఖుర్షీద్ వద్ద 1999 సంవత్సరానికి చెందిన మహీంద్రా జీప్, 2005 సంవత్సరానికి చెందిన టొయోటా ఇన్నోవా వాహనాలున్నాయి. ఈ రెండింటి విలువ సుమారు 10 లక్షల రూపాయలు. ఇవి కాకుండా ఈయన వద్ద ఓ పాత ఇంపోర్టెడ్ కారు కూడా ఉందని, దాని విలువ సుమారు రూ.1,13,093 అని ఖుర్షీద్ తెలిపారు.


Click it and Unblock the Notifications








