పార్లమెంటు సాక్షిగా స్వచ్ఛమైన ఉద్గారహిత బస్సును ఆవిష్కరించి మోడి.
కాలుష్యం అనగానే ముందుగా గుర్తుకు వచ్చే నగరం ఢిల్లీ. గత నెల రోజుల నుండి వాహన కాలుష్యాన్ని నియంత్రించడానికి, ఒక వైపు ఢిల్లీ ప్రభుత్వం మరోవైపు సుప్రీం కోర్టు రెండు కలసి అత్యంత కఠినమైన రూల్స్‌కు తెరదించాయి.
అయితే 21 డిసెంబర్ 2015 న ప్రధాన మంత్రి నరేంద్ర మోడి, వారి కేంద్ర మంత్రుల బృందం ఆధ్వర్యంలో పార్లమెంటు సమక్షంలో ఒక ఎలక్ట్రిక్ బస్సును అవిష్కరించారు. మరి వీరి ఉద్దేశం మరియు ఈ ఎలక్ట్రిక్ బస్సు గురించి తెలుకుందాం రండి.

డీజల్ ఇంజన్‌లు విడుదల చేసే ఉద్గారాల వలన కాలుష్యం అధికమవుతున్న నేపథ్యంలో ఈ ఎలక్ట్రిక్ బస్సులను విడుదల చేసినట్లు తెలిసింది.

మామూలుగా ఇది డీజల్ బస్సు, కాని దీనిని ఎలక్ట్రిక్ బస్సుగా మార్చినట్లు తెలిసింది.

ఈ ఎలక్ట్రిక్ బస్సును ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) వారు రూపొందించారు.

దీనిని పార్లమెంటు యమ్‌పి ల రవాణా కోసం రూపొందించినట్లు, కేంద్ర రోడ్డు రవాణా మరియు జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ వారు చొరవ తీసుకున్నట్లు తెలిసింది.

కార్యక్రమం అనంతరం నరేంద్ర మోడి గారు బస్సును పాక్షికంగా సందర్శించారు. తరువాత ఈ బస్సును లోక్ సభ స్పీకర్ శ్రీమతి సుమిత్రా మహాజాన్ గారు తాళం చెవితో స్టార్ట్ చేశారు.

ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడి, లోక్ సభ స్పీకర్ శ్రీమతి సుమిత్రా మహాజాన్ గారు మరియు కేంద్ర మంత్రులు అయిన నితిన్ గడ్కరీ, వెంకయ్య నాయుడు, ప్రకాశ్ జవదేకర్ మరియు అధిక సంఖ్యలో యమ్‌పి లు పాల్గొన్నారు.

ఈ బస్సులు నడవడానికి ముఖ్యంగా లిథియం అయాన్ బ్యాటరీలు అవసరం అవుతాయి. అయితే ఈ బ్యాటరీలను ఇస్రో వారు ఈ ఎలక్ట్రిక్ బస్సులలో అందించారు.

ఈ కార్యక్రమానికి చెందిన వీడియో ఈ కథనం క్రింది భాగాన కలదు చూడగలరు.



Click it and Unblock the Notifications








