థార్ నుంచి ఆడి వరకు.. కాంతార స్టార్ రిషబ్ శెట్టి కలెక్షన్‌లో ఎన్ని కార్లు ఉన్నాయో తెలుసా ?

కాంతార చాప్టర్ 1 సినిమాతో దర్శకుడు, నటుడు రిషబ్ శెట్టి ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారారు. ఇటీవలే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులలో భారీ అంచనాలను పెంచింది. ఈ చిత్రం అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. కాంతార ఫస్ట్ పార్టుతో 100కోట్లు కొల్లగొట్టి ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసుకున్న రిషబ్ శెట్టికి కార్లంటే కూడా చాలా ఇష్టం.

ఆయన కలెక్షన్‌లో కొన్ని విలాసవంతమైన, లగ్జరీ, పవర్ఫుల్ కార్లు ఉన్నాయి. ఆయన దగ్గర మహీంద్రా థార్, జీప్ కంపాస్, ఆడి క్యూ7, టయోటా వెల్‌ఫైర్ వంటి ఖరీదైన కార్లు ఉన్నాయి. ఈ విషయం పలు మీడియా నివేదికల్లో కూడా వెల్లడైంది. ఈ ప్రత్యేకమైన కార్ల గురించి పూర్తి సమాచారం వివరంగా తెలుసుకుందాం.

Rishab Shettys Impressive Car Collection From Mahindra Thar to Toyota Vellfire

మహీంద్రా థార్: సాధారణంగా ఆఫ్‌రోడ్ ఎస్‌యూవీగా పేరుపొందిన మహీంద్రా థార్, రిషబ్ శెట్టి గ్యారేజీలో ఉంది. దీని ధర సుమారు రూ.11.50 లక్షల నుంచి రూ. 17.62 లక్షల వరకు ఉంటుంది. ఈ కారు డిజైన్ చాలా అట్రాక్టివ్‌గా ఉంటుంది. అంతేకాకుండా, ఇది ఎవరెస్ట్ వైట్, రేజ్ రెడ్, గెలాక్సీ గ్రే, డీప్ ఫారెస్ట్, డెసర్ట్ ఫ్యూరీ, నేపుల్స్ బ్లాక్ వంటి రంగుల్లో లభిస్తుంది.

ఈ కారులో పవర్‌ఫుల్ ఇంజిన్లు ఉన్నాయి. ఇందులో 1.5-లీటర్ డీజిల్, 2.2-లీటర్ డీజిల్, 2.0-లీటర్ టర్బోచార్జ్‌డ్ పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇది సుమారు 15 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. లోపల 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు వంటి ఫీచర్లు ఉన్నాయి.

Rishab Shettys Impressive Car Collection From Mahindra Thar to Toyota Vellfire

జీప్ కంపాస్: మార్కెట్లో చాలా పాపులర్ అయిన ఎస్‌యూవీ జీప్ కంపాస్ కూడా రిషబ్ శెట్టి కలెక్షన్‌లో ఉంది. దీని ధర సుమారు రూ. 17.73 లక్షల నుంచి రూ. 32.41 లక్షల వరకు ఉంటుంది. ఇది బ్రైట్ వైట్, సిల్వర్ మూన్, ఎక్సోటికా రెడ్, మాగ్నీషియం గ్రే, టెక్నో మెటాలిక్ గ్రీన్, గెలాక్సీ బ్లూ వంటి ఆకర్షణీయమైన రంగులలో లభిస్తుంది.

కొత్త జీప్ కంపాస్‌లో శక్తివంతమైన 2-లీటర్ డీజిల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 14.9 నుంచి 17.1 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఈ కారులో 10.1-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 6 ఎయిర్‌బ్యాగ్‌లు వంటి అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి.

Rishab Shettys Impressive Car Collection From Mahindra Thar to Toyota Vellfire

ఆడి క్యూ7: విలాసవంతమైన కార్లలో ఒకటిగా పేరుగాంచిన ఆడి క్యూ7 కూడా రిషబ్ శెట్టికి చాలా ఇష్టం. దీని ధర సుమారు రూ. 86.14 లక్షల నుంచి రూ. 99.81 లక్షల వరకు ఉంటుంది. ఇది మైథోస్ బ్లాక్ మెటాలిక్, సమరాయ్ గ్రే మెటాలిక్, వైటోమో బ్లూ మెటాలిక్, సాఖిర్ గోల్డ్ మెటాలిక్, గ్లేసియర్ వైట్ మెటాలిక్ వంటి ప్రత్యేక రంగులలో లభిస్తుంది.

ఈ కారులో 3.0-లీటర్ వీ6 పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది సుమారు 11 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఈ కారులో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 8 ఎయిర్‌బ్యాగ్‌లు వంటి ఫీచర్లు ఉంటాయి.

Rishab Shettys Impressive Car Collection From Mahindra Thar to Toyota Vellfire

టయోటా వెల్‌ఫైర్: రిషబ్ శెట్టికి ఉన్న అన్ని కార్లలో అత్యంత ఖరీదైనది, రోడ్డు మీద వెళ్తుంటే ఏనుగులాగా భారీగా కనిపించేది ఈ టయోటా వెల్‌ఫైర్. ఇది ఒక ఎంపీవీ. దీని ధర సుమారు రూ. 1.20 కోట్ల నుంచి రూ. 1.30 కోట్ల వరకు ఉంటుంది. ఈ కారులో ఆకర్షణీయమైన ఎల్‌ఈడీ హెడ్‌లైట్లు, ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లు, 19-అంగుళాల డ్యూయల్ అల్లాయ్ వీల్స్ ఉంటాయి. ఇది ప్లాటినం వైట్ పెర్ల్, ప్రిషియస్ మెటల్ ,క్ వంటి రంగులలో లభిస్తుంది.

కొత్త వెల్‌ఫైర్‌లో 2.5-లీటర్ హైబ్రిడ్ (పెట్రోల్+ఎలక్ట్రిక్) ఇంజిన్ ఉంటుంది. ఇది సుమారు 19.28 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఈ కారులో 14-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఫుల్లీ డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, 6 ఎయిర్‌బ్యాగ్‌లు ఉంటాయి.

More from DriveSpark

Article Published On: Wednesday, September 24, 2025, 11:30 [IST]
English summary
Rishab shettys impressive car collection from mahindra thar to toyota vellfire
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+