విజయోత్సాహం అంటే ఇదేనేమో.. సర్దార్ డైరెక్టర్‌కి ఖరీదైన కారు గిఫ్ట్‌గా ఇచ్చిన ప్రొడ్యూసర్

భారతీయ సినీరంగంలో ప్రస్తుతం ఖరీదైన గిఫ్ట్స్ ఇచ్చి పుచ్చుకోవడం సర్వసాధారణమైపోయింది. ఇందులో డైరెక్టర్లు హీరోలకు లేదా ప్రొడ్యూసర్లు డైరెక్టర్లకు ఖరీదైన కార్లను గిఫ్ట్స్ గా ఇచ్చిన సందర్భాలు చాలానే వెలుగులోకి వచ్చాయి. ఇదే నేపథ్యంలో మరో ఇలాంటి సంఘటనే ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

విజయోత్సాహం అంటే ఇదేనేమో.. సర్దార్ డైరెక్టర్‌కి ఖరీదైన కారు గిఫ్ట్‌గా ఇచ్చిన ప్రొడ్యూసర్

హీరో కార్తీ ఇటీవల 'సర్దార్' సినిమాతో బ్లాక్ బ్లాస్టర్ విజయాన్ని సాధించాడు. ప్రిన్స్ పిక్చర్స్ నిర్మాత లక్ష్మణ్ కుమార్ ఆధ్వర్యంలో పి.ఎస్.మిత్రన్ డైరెక్షన్ లో విడుదలైన ఈ సినిమా మంచి వసూళ్లను చేయడంలో విజయం సాధించింది. ఇప్పటికే ఈ సినిమా ద్వారా రూ. 80 కోట్లు వచ్చాయని, ఈ సినిమా తప్పకుండా రూ. 100 కోట్లు వసూలు చేస్తుందని వర్గాలు చెబుతున్నాయి.

విజయోత్సాహం అంటే ఇదేనేమో.. సర్దార్ డైరెక్టర్‌కి ఖరీదైన కారు గిఫ్ట్‌గా ఇచ్చిన ప్రొడ్యూసర్

సర్దార్ చిత్ర సాధించిన ఈ గొప్ప విజయానికి సహకరించిన డైరెక్టర్ 'పి.ఎస్.మిత్రన్' కు ప్రొడ్యూసర్ 'టయోటా ఫార్చ్యూనర్' కారుని గిఫ్ట్ గా అందించాడు. దీనికి సంబంధించిన చిత్రాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో 'మిత్రన్' కి కారుని గిఫ్ట్ గా ఇవ్వడం చూడవచ్చు.

విజయోత్సాహం అంటే ఇదేనేమో.. సర్దార్ డైరెక్టర్‌కి ఖరీదైన కారు గిఫ్ట్‌గా ఇచ్చిన ప్రొడ్యూసర్

దీపావళికి ముందే సర్దార్ చిత్రం తెలుగు మరియు తమిళంలో విడుదలైంది. అయితే ఈ సినిమా తమిళనాడులో భారీ విజయాన్ని సాధించింది. 'సర్దార్' సక్సెస్ మీట్ లో అధికారికంగా కన్ఫర్మ్ అయిన ఈ సినిమా రెండో భాగం కోసం కార్తీ, పీఎస్ మిత్రన్ మళ్లీ జతకట్టనున్నట్లు తెలుస్తోంది.

సర్దార్ చిత్రం ప్రస్తుతం 3.5 స్టార్ రేటింగ్ సాధించింది. ఇందులో రాశీ ఖన్నా, రజిషా విజయ, చుంకీ పాండే, లైలా మరియు యుగి సేతు వంటి వారు నటించారు.

విజయోత్సాహం అంటే ఇదేనేమో.. సర్దార్ డైరెక్టర్‌కి ఖరీదైన కారు గిఫ్ట్‌గా ఇచ్చిన ప్రొడ్యూసర్

కార్తీ (కార్తీక్ శివకుమార్) మొదట్లో మణిరత్నం దగ్గర అసిస్టంట్ దర్శకుడిగా పనిచేసి ఆ తరువాత 2007 లో పరుత్తివీరన్ సినిమా ద్వారా పరిచయమయ్యాడు. కాగా ఆ తరువాత తెలుగులో యుగానికి ఒక్కడు సినిమాలో నటించి ఉత్తమ నటుడుగా 'దక్షిణ భారత ఫిలింఫేర్ అవార్డ్' కూడా అందుకున్నాడు.

విజయోత్సాహం అంటే ఇదేనేమో.. సర్దార్ డైరెక్టర్‌కి ఖరీదైన కారు గిఫ్ట్‌గా ఇచ్చిన ప్రొడ్యూసర్

ఇక 'టొయోట ఫార్చ్యూనర్' విషయానికి వస్తే, ఇది బ్రాండ్ యొక్క స్టాండర్డ్ మోడల్ అని తెలుస్తోంది. దీని ప్రారంభ ధర ధర సుమారు రూ. 32 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. కాగా ఇది మంచి డిజైన్ కలిగి ఆధునిక ఫీచర్స్ కూడా పొందుతుంది.

విజయోత్సాహం అంటే ఇదేనేమో.. సర్దార్ డైరెక్టర్‌కి ఖరీదైన కారు గిఫ్ట్‌గా ఇచ్చిన ప్రొడ్యూసర్

భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన ఈ టొయోట ఫార్చ్యూనర్ 2021 ప్రారంభంలో విడుదలైంది. ఇందులో పేద గ్రిల్ మధ్యలో కంపెనీ లోగో వంటివాటితో పాటు ఇరువైపులా ఎల్ఈడీ హెడ్లైట్స్, ఎల్ఈడీ డిఆర్ఎల్, చిన్న ఫాగ్ లాంప్స్ మరియు సిల్వర్ స్కిడ్ ప్లేట్స్ వంటివి ఉన్నాయి.

విజయోత్సాహం అంటే ఇదేనేమో.. సర్దార్ డైరెక్టర్‌కి ఖరీదైన కారు గిఫ్ట్‌గా ఇచ్చిన ప్రొడ్యూసర్

ఇక ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో 8 టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్స్ ఉంటుంది. ఇది ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ప్లే వంటివాటికి సపోర్ట్ చేస్తుంది. అంతే కాకుండా ఇందులో ఇంస్ట్రుమెంట్ క్లస్టర్, మల్టి పంక్షనల్ స్టీరింగ్ వీల్ మరియు వైర్‌లెస్ మొబైల్ ఛార్జర్ వంటివి ఉన్నాయి.

విజయోత్సాహం అంటే ఇదేనేమో.. సర్దార్ డైరెక్టర్‌కి ఖరీదైన కారు గిఫ్ట్‌గా ఇచ్చిన ప్రొడ్యూసర్

ఇంజిన్ విషయానికి వస్తే, ఇది పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్ ఆప్సన్స్ పొందుతుంది. ఇందులో 2.7 పెట్రోల్ ఇంజిన్ 166 బిహెచ్‌పి పవర్‌ను మరియు 245 ఎన్ఎమ్ టార్క్‌ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇక 2.8-లీటర్ డీజిల్ ఇంజిన్ విషయానికి వస్తే, ఇది 204 బిహెచ్‌పి పవర్‌ మరియు 500 ఎన్ఎమ్ టార్క్‌ ప్రొడ్యూస్ చేస్తుంది. ఫార్చ్యూనర్ పెట్రోల్ వెర్షన్ 5-స్పీడ్ మాన్యువల్ మరియు 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో అందుబాటులో ఉంది. ఇకపోతే, డీజిల్ వెర్షన్ 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్‌తో మాత్రమే లభిస్తుంది,

విజయోత్సాహం అంటే ఇదేనేమో.. సర్దార్ డైరెక్టర్‌కి ఖరీదైన కారు గిఫ్ట్‌గా ఇచ్చిన ప్రొడ్యూసర్

సేఫ్టీ ఫీచర్ల విషయానికి వస్తే, ఇందులో 7 ఎయిర్‌బ్యాగులు, ఏబిఎస్ విత్ ఈబిడి, హిల్ స్టార్ట్ అసిస్ట్, ఫ్రంట్ అండ్ రియర్ పార్కింగ్ సెన్సార్స్, 360 డిగ్రీ కెమెరా, లేన్ కీప్ అసిస్ట్, అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, ఎలక్ట్రానిక్ డిఫరెన్షియల్ లాక్, రాడార్ గైడెడ్ డైనమిక్ క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

విజయోత్సాహం అంటే ఇదేనేమో.. సర్దార్ డైరెక్టర్‌కి ఖరీదైన కారు గిఫ్ట్‌గా ఇచ్చిన ప్రొడ్యూసర్

ఇదిలా ఉండగా ఇటీవల పాన్ ఇండియా స్టార్ అయిన ప్రభాస్ నటించిన కొత్త చిత్రం 'ఆదిపురుష్' సినిమా డైరెక్టర్ ఆయిన ఓం రౌత్‌కి, నిర్మాత భూషణ్ కుమార్ ఒక ఖరీదైన ఫెరారీ కారుని గిఫ్ట్ గా అందించాడు. ఈ కారులో ఓం రౌత్ చ‌క్క‌ర్లు కొడుతున్న వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ఈ లింకుపై క్లిక్ చేయండి.

More from DriveSpark

Article Published On: Friday, November 4, 2022, 11:58 [IST]
English summary
Sardar director gets toyota fortuner car gift details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+