సునీల్ శెట్టి గ్యారేజిలో చేరిన ఖరీదైన అతిధి 'ల్యాండ్ రోవర్ డిఫెండర్': ధర కోటికి పైమాటే..!!
సాధారణ ప్రజలకంటే కూడా సెలబ్రెటీలు ఎప్పటికప్పుడు ఆధునిక లగ్జరీ కార్లను కొనుగోలు చేస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే ఇటీవల KGF విలన్ 'ఆండ్రూస్' ఖరీదైన బిఎండబ్ల్యు కారుని కొనుగోలు చేసాడు, కాగా ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరో 'సునీల్ శెట్టి' ఇప్పుడు 'ల్యాండ్ రోవర్ డిఫెండర్' కొనుగోలు చేసాడు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి.

సునీల్ శెట్టి కొనుగోలు చేసిన 'ల్యాండ్ రోవర్ డిఫెండర్' ధర సుమారు రూ. 1.5 కోట్లు. ఎక్కువ మంది సెలబ్రెటీలు కొనుగోలు చేస్తున్న లగ్జరీ కార్లలో ఒకటి ఈ ల్యాండ్ రోవర్ డిఫెండర్. ఇది అద్భుతమైన డిజైన్ కలిగి అధునాతన ఫీచర్స్ పొందుతుంది. ఈ కారణంగానే ఎక్కువమంది చూపు ఈ కారుపైన పడుతుంది.

ఇప్పటికే ఈ ల్యాండ్ రోవర్ డిఫెండర్ SUV లను మమ్ముట్టి, అర్జున్ కపూర్, సన్నీ డియోల్, ఆయుష్ శర్మ, రవితేజ మరియు పృథ్వీరాజ్ వంటి వారి వద్ద కూడా ఉంది. దీన్ని బట్టి చూస్తే సెలబ్రెటీలకు ఇష్టమైన లగ్జరీ కార్లలో ఇది కూడా పోరాధనమైనదని అర్థమవుతోంది. కేవలం సినీ ప్రముఖులు మాత్రమే కాకుండా రాజీకీయ, పారిశ్రామికువేత్తలు కూడా ఈ లగ్జరీ SUV ని కలిగి ఉన్నారు.

ఇక ల్యాండ్ రోవర్ డిఫెండర్ విషయానికి వస్తే, ఇది భారతదేశంలో డిఫెండర్ 90 మరియు డిఫెండర్ 110 అనే రెండు వేరియంట్స్ లో అందుబాటులో ఉంది. ఇందులో డిఫెండర్ 90 అనేది షార్ట్ వీల్‌బేస్ కలిగిన, 3 డోర్స్ వేరియంట్. అదే సమయంలో డిఫెండర్ 110 అనేది 5 డోర్స్ కలిగిన లాంగ్ వీల్‌బేస్ ఫుల్ సైజ్ SUV. ల్యాండ్ రోవర్ డిఫెండర్ SUV లు ఆఫ్ రోడింగ్ చేయడానికి కూడా అనుకూలంగా ఉంటాయి.

భారతీయ మార్కెట్లో ల్యాండ్ రోవర్ డిఫెండర్ ధర రూ.1.05 నుంచి రూ. 1.5 కోట్ల వరకు ఉన్నాయి. ఇది రెండు పెట్రోల్ మరియు ఒక డీజిల్ ఇంజన్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉన్నాయి. ఇందులోని 2-లీటర్ 4-సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజన్ 300 బిహెచ్‌పి పవర్ మరియు 400 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

అదే సమయంలో ఇందులోని 3 లీటర్ 6 సిలిండర్ పెట్రోల్ ఇంజన్ 400 బిహెచ్‌పి పవర్ మరియు 550 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 3-లీటర్ డీజిల్ ఇంజిన్ 300 బిహెచ్‌పి పవర్ మరియు 650 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇందులోని అన్ని ఇంజిన్లు 8 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌కి జతచేయబడి ఉంటుంది.

ల్యాండ్ రోవర్ డిఫెండర్ డిజైన్ పరంగా చూడచక్కగా ఉంటుంది. ఇక ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో 12.3 ఇంచెస్ ఫుల్లీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 10 ఇంచెస్ టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే వంటివి ఉన్నాయి. ఇది ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే కనెక్టివిటీకి సపోర్ట్ చేస్తుంది.

అంతే కాకుండా ఇందులో 360 డిగ్రీ కెమెరా, రెయిన్ సెన్సింగ్ వైపర్‌లు, ఎలక్ట్రానిక్ ఎయిర్ సస్పెన్షన్, కనెక్టెడ్ కార్ ఫీచర్‌లు, నావిగేషన్, సెంటర్ కన్సోల్, కూల్డ్ గ్లోవ్ బాక్స్, స్మార్ట్ కీలెస్ ఎంట్రీ, పుష్ స్టార్ట్-స్టాప్ బటన్ మరియు మరెన్నో ఉన్నాయి. ఇవన్నీ కూడా వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి.

సునీల్ శెట్టి ఇప్పటికే తన గ్యారేజిలో హమ్మర్ ఎస్‌యూవీతో పాటు మెర్సిడెస్ బెంజ్ జి350డి, మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఎస్350, హమ్మర్ హెచ్2, బిఎండబ్ల్యు ఎక్స్5 మరియు జీప్ రాంగ్లర్ వంటి వాటిని కూడా కలిగి ఉన్నాడు, కాగా ఇప్పుడు ఈ గ్యారేజిలోకి ఖరీదైన ల్యాండ్ రోవర్ డిఫెండర్ చేరింది.

ఇదిలా ఉండగా ఇటీవల కెజిఎఫ్2 యాక్టర్ ఆండ్రూస్ అలియాస్ అవినాష్ కొత్త జర్మన్ లగ్జరీ కారు BMW X5 40i కొనుగోలు చేసాడు. దీని ధర సుమారు కోటి రూపాయల వరకు ఉంటుంది. ఇది 3.0 లీటర్ సిక్స్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌తో పనిచేస్తుంది. ఈ ఇంజిన్ 5,500 ఆర్‌పిఎమ్ వద్ద 335 బిహెచ్‌పి పవర్ మరియు 1,500 ఆర్‌పిఎమ్ వద్ద 450 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 8-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. అవినాష్ కొనుగోలు చేసిన కొత్త కారు గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ఈ లింకుపై క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications








