KGF విలన్ ఆండ్రూస్ కొనుగోలు చేసిన జర్మన్ లగ్జరీ కారు.. ఇక్కడ చూడండి
ఇటీవల కాలంలో లగ్జరీ కార్లను కొనుగోలు చేసే సెలబ్రెటీల సంఖ్య బాగా పెరుగుతోంది. మొన్న కీర్తి సురేష్, ఈ రోజు కెజిఎఫ్2 యాక్టర్ ఆండ్రూస్ అలియాస్ అవినాష్ కొత్త జర్మన్ లగ్జరీ కారుని కొనుగోలు చేసాడు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి.

కన్నడ స్టార్ 'యష్' నటించిన KGF మరియు KGF2 సినిమాలు ఒక్క కన్నడలో మాత్రమే కాకుండా తెలుగు ఇతరత్రా భాషల్లో కూడా మంచి ఆదరణ పొందాయి. ఈ సినిమా విడుదలతో ఒక్క యష్ మాత్రమే కాకుండా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ మరియు కెమెరామెన్ భువన్ గౌడ వంటి వారు కూడా మంచి క్రేజ్ పొందారు.

KGF సినిమాలో హీరో పాత్ర ఎంత ఉందొ విలన్ల పాత్ర కూడా అంతే ఉంది. ఈ కారణంగా KGF సినిమాల్లో నటించిన విలన్లు కూడా బాగా ఫెమస్ అయ్యారు. ఇందులో ఒకరు ఆడ్రూస్ పాత్ర పోషించిన 'బి.ఎస్.అవినాష్'. ఇతడు ఇటీవల జర్మన్ లగ్జరీ కారు అయిన BMW కారుని కొనుగోలు చేసాడు. ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంది.

బి.ఎస్.అవినాష్ కొనుగోలు చేసిన ఈ లగ్జరీ కారు BMW X5 40i అని తెలుస్తోంది. ఇది బ్లాక్ కలర్ లో చాలా అట్రాక్టివ్ గా ఉంది. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో అవినాష్ కారుని డెలివరీ తీసుకోవడం కూడా చూడవచ్చు.

ఇక అవినాష్ కొనుగోలు చేసిన BMW X5 విషయానికి వస్తే, ఇది xDrive40i M-Sport అని తెలుస్తోంది. దీని ధర సుమారు కోటి రూపాయల వరకు ఉంటుంది. ఇది 3.0 లీటర్ సిక్స్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌తో పనిచేస్తుంది. ఈ ఇంజిన్ 5,500 ఆర్‌పిఎమ్ వద్ద 335 బిహెచ్‌పి పవర్ మరియు 1,500 ఆర్‌పిఎమ్ వద్ద 450 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 8-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది.

బిఎండబ్ల్యు ఎక్స్5 xDrive40i M-Sport కేవలం 5.5 సెకన్లలో 0 నుంచి 100 కిలోమీటర్ల వరకు వేగవంతం అవుతుంది. దీని గరిష్ట వేగం గంటకు 243 కిమీ వరకు ఉంటుంది. మొత్తం మీద ఇది మంచి పనితీరుని అందిస్తుంది. కావున ఎక్కువమంది సెలబ్రెటీలు ఈ లగ్జరీ కారుని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు.

బిఎండబ్ల్యు ఎక్స్5 వాహన వినియోగదారులకు చాలా కంఫర్ట్ గా ఉంటుంది. కావున దీని కొలతల విషయానికి వస్తే పొడవు 4,922 మిమీ, వెడల్పు 2004 మిమీ, ఎత్తు 1,745 మిమీ , గ్రౌండ్ క్లియరెన్స్ 214 మిమీ మరియు బూట్ స్పేస్ 650 లీటర్ల వరకు ఉంటుంది.

ఈ లగ్జరీ కారు అద్భుతమైన డిజైన్ కలిగి ఉండటమే కాకుండా.. అధునాతన ఫీచర్స్ పొందుతుంది. ఇది ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, ఎల్ఈడీ టైల్‌లైట్లు, ఎల్ఈడీ ఫాగ్ లైట్స్ మరియు బ్రాండ్ లోగో వంటి వాటిని పొందుతుంది. సైడ్ ప్రొఫైల్ లో 20 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ ఉంటాయి.

ఇక ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో 12.3 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, వాయిస్ కామండ్, జిపిఎస్ నావిగేషన్, వైర్లెస్ ఛార్జర్, అడ్జస్టబుల్ ఫ్రంట్ సీట్లు, డ్రైవర్ సీట్ కోసం మెమరీ ఫంక్షన్ మరియు ఆరు స్పీకర్లు మొదలైనవి ఉన్నాయి. ఇవన్నీ కూడా వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి.

ఇక చివరగా ఇందులోని సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో ఆరు ఎయిర్ బ్యాగులు, ఏబీఎన్ విత్ ఈబిడి, కార్నరింగ్ బ్రేక్ కంట్రోల్, డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్, డైనమిక్ ట్రాక్షన్ కంట్రోల్, ఆటో హోల్డ్ ఫంక్షన్‌తో కూడిన ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్, హిల్ డిసెంట్ కంట్రోల్, ఫార్వర్డ్ కొలీషియన్ వార్ణింగ్ మరియు సీట్ బెల్ట్ వార్ణింగ్ వంటివి ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రయాణికుల భద్రతను నిర్థారిస్తాయి.

ఆడ్రూస్ అలియాస్ అవినాష్ విషయానికి వస్తే, ఇతడు KGF2 సినిమాలో విలన్ గా నటించారు. ఎక్కువ జిమ్ లో వర్కౌట్ చేస్తూ 6 ప్యాక్ కలిగి ప్రస్తుతం చాలా ట్రేండింగ్ లో ఉన్నారు, అంతే కాకుండా KGF2 భారీ విజయం పొందిన తరువాత అవినాష్ చాలా సినిమాల్లో బిజీగా ఉన్నాడు. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలతోపాటు మార్కెట్లో విడుదలయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.


Click it and Unblock the Notifications








