అజిత్ బైక్ సవారీ.. పూనే టూ చెన్నై వయా బెంగుళూరు
తమిళ నటుడు అజిత్‌కు బైక్ రైడ్స్ అన్నా సూపర్‌బైక్‌లన్నా ఎంతో మక్కువ అన్న విషయం మనకు తెలిసినదే. అజిత్ ఇటీవలే తన కొత్త బిఎమ్‌డబ్ల్యూ ఎస్1000ఆర్ఆర్ (BMW S1000RR) మోటార్‌సైకిల్‌పై చెన్నై నుంచి బెంగళూరు వరకు రైడ్ చేసుకుంటూ వెళ్లి, రోడ్ సేఫ్టీ గురించి బైకర్లలో అవగాన కల్పించే ప్రయత్నం చేసిన సంగతి తెలిసినదే.
తాజాగా, అజిత్ అలాంటి మరో లాంగ్ బైక్ జర్నీ చేశాడు. ఈసారి పూనే నుంచి బెంగుళూరుకు, తిరిగి అక్కడి నుంచి చైన్నైకు బిఎమ్‌డబ్ల్యూ సూపర్‌బైక్‌పై వెళ్లారు. అయితే, ఈసారి తన రైడ్ కోసం బిఎమ్‌డబ్ల్యూ ఎస్1000ఆర్ఆర్ సూపర్‌బైక్‌ను కాకుండా, బిఎమ్‌డబ్ల్యూ కె1300ఎస్ (BMW K1300S) సూపర్‌బైక్‌ను ఉపయోగించాడు. తన ప్రయాణ ఫొటోలను ఇంటర్నెట్‌లో అప్‌లోడ్ చేశారు.
మరి ఆ కథాకమామిషీ ఏంటో తెలుసుకుందాం రండి..!

నటనతో పాటుగా మోటార్‌స్పోర్ట్ అంటే ఇష్టపడే అజిత్‌కు వాయు వేగంతో జయ్యిమని పరుగులు తీసే సూపర్‌బైక్‌లంటే కూడా అంతే ఇష్టం. అజిత్ తన లేటెస్ట్ రైడ్ కోసం సుమారు రూ.25 లక్షలకు పైగా ఖరీదు చేసే బిఎమ్‌డబ్ల్యూ కె1300ఎస్ బైక్‌ను ఎంచుకున్నాడు.

అజిత్ తన లేటెస్ట్ లాంగ్ బైక్ రైడ్‌ను పూనే నుంచి ప్రారంభించి, బెంగుళూరు చేరుకొని, అక్కడి నుంచి చెన్నైకు వెళ్లారు. ఈ మార్గంలో ఆయన బెంగుళూరు వద్ద విశ్రాంతి తీసుకున్నారు.

అజిత్ కేవలం 16 గంటల సమయంలోనే ఈ బైక్ రైడ్‌ను పూర్తి చేశాడు. బిఎమ్‌డబ్ల్యూ కె1300ఎస్ బైక్‌పై ఆయన సుమారు 1300 కిలోమీటర్లకు పైగా దూరాన్ని కవర్ చేశారు.

అజిత్ తన బైక్ రైడ్ కోసం కావల్సిన పూర్తి సరంజామాను తన వెంట తీసుకువెళ్లాడు. బైక్ గేర్ ప్రోడక్ట్స్ అయిన హ్యాండ్ గ్లౌవ్స్, లెగ్ అండ్ క్నీ ప్యాడ్, సేఫ్టీ జాకెట్, హెల్మెట్, మెడికల్ కిట్ మొదలైనవన్నీ తన వెంట తీసుకువెళ్లాడు.

అజిత్ తన లాంగ్ బైక్ జర్నీ మార్గమధ్యంలో హైవేపై ఓ డాబా రెస్టారెంట్‌లో భోజనం చేస్తుండా క్లిక్‌మనిపించిన ఫొటో ఇది.

అజిత్ బైక్ ట్రిప్‌కు సంబంధించిన రోడ్ రూట్ మ్యాప్.

హీరో అజిత్ ఇటీవలే ఓ ఆప్రిలియా సూపర్‌బైక్‌ను కొనుగోలుచేశాడు. ఈ బైక్‌కు సంబంధించిన పూర్తి సమాచారం కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

అజిత్ తన లేటెస్ట్ రైడ్ కోసం ఉపయోగించింది ఇలాంటి ఓ బిఎమ్‌డబ్ల్యూ కె1300ఎస్ బైక్‌నే.

భారత్‌లో బిఎమ్‌డబ్ల్యూ కె1300ఎస్ సూపర్ బైక్ ధర రూ.25 లక్షలకు పైగా ఉండొచ్చని అంచనా.


Click it and Unblock the Notifications








