గోడను ఢీకొట్టి అవతలవైపునకు వెళ్లిన టాటా నెక్సాన్ కారు.. ఆ పిల్లర్‌ను ఢీకొట్టి ఉంటే..?
టాటా కార్లు నాణ్యమైన బిల్డ్ క్వాలిటీని కలిగి ఉంటాయని ఇప్పటికే చాలా సార్లు నిరూపితం అయింది. పలు ప్రమాదాల్లో టాటా కార్లలోని ప్రయాణికులు సురక్షితంగా బయటపడిన ఘటనలు కూడా అనేకం ఉన్నాయి. అయితే తాజాగా జరిగిన ఓ ఘటన టాటా కార్ల బిల్డ్ క్వాలిటిని మరోసారి వార్తల్లోకి తీసుకొచ్చింది.
తాజా ఘటనలో Tata Nexon కారు ఓ గోడను ఢీకొట్టి.. గోడలో నుంచి ముందుకు వెళ్లిపోయింది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ఘటన ఎలా జరిగిందనే దానిపై పూర్తి స్పష్టత లేదు. కానీ టాటా నెక్సాన్ కారు నియంత్రణ కోల్పోయి గోడను ఢీకొట్టి ఉండవచ్చు. ఫోటోలను బట్టి చూస్తే గోడను ఢీకొట్టిన కారు అవతలవైపునకు వెళ్లిపోయి నిలిచిపోయింది. అయితే కారుకు మాత్రం ఎటువంటి డ్యామేజ్ కాలేదు.

ఈ ఘటన ఆధారంగా చేసుకొని టాటా నెక్సాన్ కారు బిల్డ్ క్వాలిటీ అత్యుత్తమం అని నిర్ధారణకు రాలేం. ఎందుకంటే కారు ఢీకొట్టిన గోడ చాలా బలహీనంగా ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే ఢీకొట్టిన భాగానికి కొన్ని అంగుళాల దూరంలో కాంక్రీటు పిల్లర్ ఉంది. ఒకవేళ కారు పిల్లర్‌ను ఢీకొట్టి ఉంటే.. నెక్సాన్ బిల్డ్ క్వాలిటిపై మరోసారి ఓ నిర్ధారణకు మనం వచ్చే అవకాశం ఉండేది.
కానీ టాటా నెక్సాన్ కారు గ్లోబర్ NCAP టెస్ట్‌లో 5 స్టార్ రేటింగ్‌ను కలిగి ఉంది. మరియు ఆ సిగ్మెంట్‌లో అత్యంత సురక్షితమైన కారుగా గుర్తుంపు పొందింది. 2016లో టాటా నెక్సాన్ కారు తొలి క్రాష్ టెస్ట్‌లో 4 స్టార్ రేటింగ్‌ను సొంతం చేసుకుంది. అనంతరం కొన్ని మార్పులతో 5 స్టార్ రేటింగ్ సాధించింది. ఫలితంగా భారత్‌లో ఈ రేటింగ్ ఉన్న తొలికారుగా నెక్సాన్ గుర్తింపు పొందింది. 17 పాయింట్లకు గాను ఏకంగా 16.06 పాయింట్ల స్కోరును పొందింది.

2018 ఆగస్టులో టాటా నెక్సాన్ టెస్టింగ్ సమయంలో బాడీ షేల్, ప్లాట్‌ఫాంలో మార్పులు చేయలేదు. గతంలో ఉన్నట్లుగానే స్టాండర్డ్ డ్యూయర్ ఫ్రండ్ ఎయిర్‌బ్యాగ్‌ల సంఖ్యలోనూ మార్పులేదు. డ్రైవర్, ప్యాసింజర్ సీట్‌బెల్ట్ రిమైండర్ సిస్టమ్ సహా ABS పుల్ ఛానల్ వెర్షన్‌ను ప్రామాణిక ఫీచర్‌గా మార్చడం వల్ల టాటా నెక్సాన్ మంచి స్కోరు సాధించింది.
టాటా కార్లు నాణ్యమైన బిల్డ్ క్వాలిటీని కలిగి ఉంటాయి. గ్లోబల్ ఎన్‌సీఏపీ ఫలితాలు కూడా ఇదే చెప్పాయి. టాటా సంస్థ తన వాహనాలకు కనిష్ఠంగా 4 స్టార్ రేటింగ్ ఉండేలా చూస్తోంది. అలాగే భవిష్యత్‌లో వచ్చే అన్ని కార్లకు 5 స్టార్ రేటింగ్‌తో వచ్చేలా లక్ష్యం నిర్దేశించుకుంది. దీన్ని ఇతర కార్ల తయారీదారుల కూడా అనుసరించే అవకాశం ఉంది. ఫలితంగా భారత్ మార్కెట్‌లోకి అత్యంత భద్రతా ఫీచర్లు కలిగిన కార్లు మాత్రమే వచ్చే అవకాశం ఉంటుంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








