రోడ్డు పక్కన గుంతలో బోర్లా పడిన కొత్త టాటా నెక్సాన్‌.. చెక్కు చెదరని క్యాబిన్‌.!!

దేశంలో ప్రతి రోజూ రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉంటున్నాయి. ఇందుకు కొత్త కార్లు కూడా మినహాయింపు కాదు. అప్పుడే రోడ్డుపైకి వచ్చిన కొత్త కార్లు కూడా యాక్సిడెంట్లకు గురి అవుతున్నాయి. ఈ క్రమంలో రోడ్డు భద్రతను దృష్టిలో ఉంచుకుని ఆటో కంపెనీలు సైతం కార్లలో అధునాతన భద్రతా ఫీచర్లను ప్రవేశపెడుతున్నాయి.

కాగా ఇటీవల సరికొత్త టాటా నెక్సాన్‌(Tata Nexon Accident) ఫేస్‌లిఫ్ట్‌ యాక్సిడెంట్‌కు గురైంది. ఈ సంఘటన రోడ్డు పక్కన పొలంలో చోటుచేసుకుంది. రోడ్డుపై వెళ్తున్న కొత్త టాటా నెక్సాన్‌ ఎస్‌యూవీ అకస్మాత్తుగా రోడ్డు పక్కన గుంతలో బోర్లా పడిపోయింది. ఇది గమనించిన స్థానికులు కారును బయటకు తీసేందుకు యత్నించారు. వాహనం చివరను తాడుతో కట్టి ఎస్‌యూవీని పైకి లాగారు.

Tata-Nexon-Topples-On-Road

వీడియోను పరిశీలించినట్లయితే టాటా నెక్సాన్‌ ఎస్‌యూవీ డోర్‌ హ్యాండిల్స్‌పై ఉన్న రిబ్బన్ల ద్వారా ఇది కొత్త కారుగా తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదం ఎలా జరిగిందో పూర్తి సమాచారం వీడియోలో లేదు. కాగా ప్రమాదంలో టాటా నెక్సాన్‌ A పిల్లర్‌, రూఫ్‌ దెబ్బతిన్నట్లుగా తెలుస్తోంది. వాహనం స్టార్ట్‌ కాకపోవడంతో గ్రామస్థులు కారును తాళ్లతో లాగారు. కాగా ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు.

SUVలు ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన ప్రజాదరణను పొందుతున్నాయి. కఠినమైన రోడ్లను దృష్టిలో ఉంచుకుని వాటి డిజైన్‌ను రూపొందిస్తున్నారు. ఎలివేటెడ్‌ గ్రౌండ్‌ క్లియరెన్స్‌ కారణంగా స్టాండర్డ్‌ హ్యాచ్‌బ్యాక్‌లు, సెడాన్‌లతో పోలిస్తే ఎస్‌యూవీలను హై స్పీడ్‌తో నడిపేటప్పుడు జాగ్రత్తలను పాటించాలి. ఇక ఈ ప్రమాదంలో టాటా నెక్సాన్‌ ఎస్‌యూవీ విషయానికొస్తే..

Tata-Nexon-Topples-On-Road

టాటా నెక్సాన్‌ ఎస్‌యూవీ 2016లో మార్కెట్లోకి విడుదలైంది. అప్పట్లో గ్లోబల్‌ NCAP క్రాష్‌ టెస్ట్‌లో 4 స్టార్‌ రేటింగ్‌ను పొందింది. కాగా కొన్ని మార్పుల తర్వాత మిడ్‌ సైజ్‌ ఎస్‌యూవీ 5 స్టార్‌ రేటింగ్‌ను సాధించింది. భారత మార్కెట్లో అత్యధిక స్టార్ రేటింగ్‌ సాధించిన ఎస్‌యూవీ ఇదే.. ఇక ఆ తర్వాత వచ్చిన టాటా నెక్సాన్ అప్‌డేటెడ్‌ మోడళ్లన్నీ సేఫ్టీలో 5 స్టార్‌ రేటింగ్‌తో నిలిచాయి.

కాగా ఆగస్ట్ 2018లో నిర్వహించిన క్రాష్‌ టెస్ట్‌లో.. టాటా నెక్సాన్ బాడీ షెల్, ప్లాట్‌ఫారమ్ నిర్మాణం మారలేదు. అంతే కాకుండా నెక్సాన్‌లోని స్టాండర్డ్ డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌ల సంఖ్యలో ఎలాంటి మార్పులు చేయలేదు. డ్రైవర్ మరియు ప్యాసింజర్ సీట్‌బెల్ట్ రిమైండర్ సిస్టమ్‌తో పాటు ABS పూర్తి-ఛానల్ వెర్షన్‌ను స్టాండర్డ్‌ ఫీచర్స్‌.. అత్యధిక మార్కులు స్కోర్‌ చేయడంలో సహకరించాయి.

Tata-Nexon-Topples-On-Road

టాటా నెక్సాన్‌.. ఇటీవల తరచూ పలు ప్రమాదాలకు గురైనప్పటికీ ప్రమాదం తీవ్రత ఎంత ఉన్నా బిల్ట్‌ క్వాలిటీ కారును చెక్కచెదరకుండా కాపాడుతోంది. అంతే కాకుండా ప్రయాణికులు సైతం సురక్షితంగా బయటపడుతున్నారు. లారీలు, బస్సుసు ఢీకొన్నప్పటికీ కేవలం స్వల్ప డ్యామేజ్‌తోనే బయటపడటం టాటా మోటార్స్‌ నిబద్ధతకు నిదర్శనం. తాజా ఘటనలోనూ కారుకు పెద్దగా డ్యామేజ్‌ అవ్వలేదు.

దేశీయ ఆటో మొబైల్‌ తయారీదారు టాటా మోటార్స్‌తో పాటు దేశంలోని ప్రముఖ కార్ మేకర్లు ఇప్పుడు ప్రయాణికుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఈ క్రమంలో కార్లలో 6 ఎయిర్‌ బ్యాగులను తప్పనిసరిగా చేశాయి. ప్రతి అప్‌డేటెడ్‌ మోడల్‌లో కొత్త సేఫ్టీ ఫీచర్లను ప్రవేశపెడుతున్నాయి.

More from DriveSpark

Article Published On: Saturday, November 25, 2023, 14:49 [IST]
English summary
Brand new tata nexon topples beside road villagers recovered it safely here is the video
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+