అతి వేగంతో ట్రక్కును ఢీకొట్టినా చెక్కు చెదరని టాటా నెక్సాన్ క్యాబిన్.. ఆ ఫీచర్లే కాపాడాయి.!!
ప్రముఖ దేశీయ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ మరోసారి తన బిల్ట్ క్వాలిటీని నిరూపించుకుంది. హై సేఫ్టీ, స్టాండర్డ్ ఫీచర్లతో సంస్థ కార్లను రూపొందిస్తుంది. ఇప్పటివరకూ జరిగిన ఎన్నో ప్రమాదాల్లో ప్రయాణికులను సురక్షితంగా ఉంచుతూ.. నాణ్యత పరంగా సాటిలేదని నిరూపించుకుంది. ఇటీవల జరిగిన ఓ యాక్సిడెంట్‌లోనూ టాటా మోటార్స్ ప్రశంసలు అందుకుంది.
దేశంలో ప్రతిరోజూ రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. అందుకే ప్రజలు కార్లను కొనేటప్పుడు సేఫ్టీ పరంగా అత్యుత్తమ కార్లకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎందుకంటే ప్రమాదాలు జరిగినప్పుడు కారుకు డ్యామేజ్ జరిగినప్పటికీ ప్రయాణికులు సురక్షితంగా బయపడుతున్నారు. ఈ క్రమంలోనే టాటా మోటార్స్‌కు చెందిన కార్లు సేఫ్టీ పరంగా ది బెస్ట్‌గా నిలుస్తున్నాయి.

ఇటీవల, టాటా నెక్సాన్ హై-స్పీడ్ క్రాష్‌లో చిక్కుకున్న తర్వాత ఇద్దరు వ్యక్తుల ప్రాణాలను ఎలా కాపాడిందో చూపించే వీడియో ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతోంది. గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్‌లో టాటా నెక్సాన్ 5 స్టార్ రేటింగ్‌ను సంపాదించుకుంది. అలాంటి అత్యుత్తమ కారు.. భయంకరమైన ప్రమాదం నుంచి ప్రయాణికులను ప్రాణాలతో బయటపడేసింది. ఇందుకు సంబంధించి కారు యజమాని తన అనుభవాన్ని పంచుకున్నారు.
ఉత్తరప్రదేశ్‌లోని మధుర సమీపంలో యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై ఇటీవల ఓ రోజు తెల్లవారుజామున 5 గంటలకు ప్రమాదం జరిగినట్లు వీడియోలో పేర్కొన్నారు. అయితే కారులో డ్యాష్‌క్యామ్ లేకపోవడంతో ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై.. కారు యజమాని వివరించినట్లు వీడియోలో తెలిపారు. తెల్లవారుజామున, వారి నెక్సాన్(Tata Nexon Crash) హై స్పీడ్‌తో ఆగి ఉన్న ట్రక్కును వెనుక నుంచి ఢీకొట్టిందని వీడియోలో వివరించారు.

అయితే అంత వేగంతో ట్రక్కు(Tata Nexon Crashes Into Truck)ను ఢీకొట్టినప్పటికీ టాటా నెక్సాన్ సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీలోని ప్రయాణికులకు గాయాలు కాకపోవడం ఆశ్చర్యకరం. సురక్షితంగా బయటపడటంతో టాటా నెక్సాన్ యజమాని.. కారు క్వాలిటీపై సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన తర్వాత అక్కడి నుంచి డీలర్‌షిప్‌కు టాటా నెక్సాన్‌ను తరలించారు.
కాగా యాక్సిడెంట్‌లో టాటా నెక్సాన్(Tata Nexon SUV) ఫ్రంట్ ఎండ్ మొత్తం దెబ్బతింది. ఫ్రంట్ గ్రిల్, హెడ్‌లైట్లు, బంపర్, రేడియేటర్ ఇంకా పలు భాగాలు దెబ్బతిన్నాయి. అయితే ముందు భాగం ఇంత డ్యామేజ్ అయినప్పటికీ.. వెనుక భాగం మరియు క్యాబిన్‌కు ఎటువంటి నష్టం వాటిల్లలేదు. దీంతో టాటా నెక్సాన్ మరోసారి క్వాలిటీ ఇంకా సేఫ్టీ పరంగా ది బెస్ట్‌గా నిరూపించుకుంది.

ఈ క్రమంలో ప్రజలు హై సేఫ్టీ ఫీచర్లు ఉన్న కార్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని అర్థమవుతోంది. ఈ కార్లు ప్రమాదం జరిగినప్పుడు గాయం లేదా ప్రాణాపాయ ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించడమే ఇందుకు కారణం. ముఖ్యంగా ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ మరియు అధునాతన డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్(ADAS)లు వంటి ఆధునిక భద్రతా లక్షణాలు.. రోడ్డు ప్రమాదాల్లో ప్రభావాన్ని నిరోధిస్తాయి.
అంతేకాకుండా కస్టమర్లు.. సురక్షితమైన కార్లను ఎంచుకోవడం ద్వారా చాలా డబ్బు ఆదా అవుతుంది. వీటిని కొనుగోలు చేసేటప్పుడు ధర అధికంగా ఉన్నప్పటికీ.. బీమా ప్రీమియం చేసుకోవడం ద్వారా ఇలాంటి ప్రమాదాలు చోటుచేసుకున్నప్పుడు ప్రాణాపాయం జరగకుండా చూడటంతో వైద్య ఖర్చులు, మరమ్మతుల వ్యయాన్ని చాలా వరకు తగ్గించి మీ డబ్బును ఆదా చేస్తుంది.


Click it and Unblock the Notifications








