Just In
- 2 hrs ago
పూర్తి చార్జ్‌పై 350 కిలోమీటర్లు ప్రయాణించిన మహీంద్రా ఈ2ఓ ప్లస్!
- 5 hrs ago
విడుదలకు ముందే లీకైన స్కొడా కుషాక్ ఫొటోలు; జూన్ 2021లో లాంచ్!
- 6 hrs ago
ఆనంద్ మహీంద్రా నుండి థార్‌ను గిఫ్ట్‌గా పొందిన క్రికెటర్ శుబ్‌మన్ గిల్
- 7 hrs ago
కొత్త ఫోక్స్‌వ్యాగన్ పోలో ఫేస్‌లిఫ్ట్ వెల్లడి: ఫీచర్లు, స్పెసికేషన్లు మరియు వివరాలు
Don't Miss
- Sports
సన్‌రైజర్స్‌కు ఊహించని షాక్.. ఐపీఎల్ 2021 నుంచి స్టార్ పేసర్ ఔట్! ఆందోళనలో ఫాన్స్!
- News
కరోనా వేళ అమెరికాతో భారీ ఒప్పందం -‘ఇండియా-యూఎస్ క్లైమెట్, క్లీన్ ఎనర్జీ ఎజెండా’ ప్రకటించిన ప్రధాని మోదీ
- Finance
Forbes 30 under 30 list: ఇద్దరు హైదరాబాదీలకు చోటు
- Movies
ఆయన ఊర మాస్.. ఆ అద్భుతమైన అనుభవానికి థ్యాంక్స్.. రకుల్ ప్రీత్ సింగ్ హాట్ కామెంట్స్
- Lifestyle
‘తనను వదిలేసి తప్పు చేశా.. అందం, ఆస్తి ఉందని ఆ ఇద్దరిరీ పడేశా... కానీ చివరికి...’
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
త్వరపడండి.. అక్కడ ఒక కేజీ కేక్ కొంటె ఒక లీటర్ పెట్రోల్ ఫ్రీ
భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి. ఈ కారణంగా వాహనదారులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దేశవ్యాప్తంగా పెట్రోల్ మరియు డీజిల్ వాహనాలు ఎక్కువగా ఉన్నాయి, కావున ఒక్కసారికా వాటిని వదిలివేయడం సాధ్యమయ్యేపని కాదు. అందుకోసం పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని వాహనదారులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నారు.

పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ టాక్స్, వ్యాట్ తగ్గించాలని వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు. కానీ ఇప్పటివరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి ప్రకటన చేయలేదు. వాహనదారులు పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పుడెప్పుడు తగ్గుతాయా అని ఎదురుచూస్తున్నారు.

ఇటీవల త్రిచిలో కొత్తగా ఓపెన్ చేసిన బేకరీలో ఒక కొత్త విధానాన్ని అమలులోకి తీసుకువచ్చింది. ఈ విధానం ప్రకారం ఈ బేకరీలో ఒక కేజీ కేక్ కొనుగోలు చేస్తే, 1 లీటర్ పెట్రోల్ ఉచితంగా ఇవ్వబడుతుంది. ఈ బేకరీ ఓనర్ సాగైరాజ్ ఈ విధానం ద్వారా ఇప్పుడు అందరిని ఆకర్షిస్తున్నారు. కొత్తగా తెరిచిన బేకరీ కావున ఈ ఆఫర్ అందుబాటులో ఉంది.
MOST READ:అక్రమ బిఎస్4 కార్లను విక్రయిస్తున్న ముఠా గుట్టు రట్టు; హైదరాబాద్‌లో కూడా మూలాలు!

బేకరీ ప్రారంభోత్సవంలో బేకరీ యజమాని సాగిరాజ్ ఈ ఆఫర్ గురించి మాట్లాడుతూ, పెట్రోల్ ధరలు ఇప్పుడు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ క్లిష్ట సమయంలో పెట్రోల్ ఉచితంగా ఇస్తే వినియోగదారులకు కొంతవరకు ప్రయోజనం చేకూరుతుంది కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

ఈ ఆఫర్లు వినియోగదారులకు చాలా ప్రయోజనం చేకూర్చుతుంది, ఒక కిలో కేక్ కొనుగోలు చేసిన వారికి 1 లీటర్ ఉచిత పెట్రోల్ ఆఫర్ లభిస్తుందని తెలిపారు. పెట్రోల్ మరియు డీజిల్ ఉచితంగా ఇవ్వడం ఇదే మొదటిసారి కాదు. గతంలో, చాలా బేకరీలు ఈ విధమైన ఆఫర్లను ప్రకటిచింది.

పెట్రోల్ ధరలు రోజురోజుకి పెరిగిపోవడం వల్ల ఇటీవల చలమాది వాహనదారులు ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలుచేయడానికి ముందుకు వస్తున్నారు. ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలుచేసేవారికి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని రాయితీలు కూడా కల్పిస్తున్నారు.

పెట్రోల్‌ను బేకరీలలోనే కాకుండా కొన్ని సమావేశాల్లోనూ మరియు వేడుకలోనూ బహుమతిగా అందిస్తున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. ఇటీవల మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో జరిగిన క్రికెట్ మ్యాచ్ లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ విజేతకు 5 లీటర్ పెట్రోల్‌తో బహుమతిగా ఇచ్చి అనాద్రి దృష్టిని ఆకర్షిస్తున్నారు. దీనికి సంబంధించిన సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
MOST READ:అడవి ఏనుగు భారినుంచి తృటిలో తప్పించుకున్న ప్రముఖ సింగర్ [వీడియో]
Source: Behindwoods