తీర ప్రాంతాల్లో అమెరికా యుద్ద ట్యాంకులు మరియు ఆంపిబియస్ యుద్ద వాహనాలు.

By Anil

పక్కింటి వారు కొత్త వస్తువులు ఏమైనా కొన్నారంటే మన ఇంట్లో కూడా ఆ వస్తువులు ఉండాలని పట్టు పడుతుంటారు మన కుటుంబ సభ్యులు. అచ్చం ఇలాంటి ధోరణిలో అమెరికా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా తీవ్రవాద దాడులు పెచ్చు మీరుతున్న నేపథ్యంలో ప్రపంచ దేశాలన్ని తమ శక్తికి మించి భద్రతను ఏర్పాటు చేసుకుంటున్నాయి.
Also Read: రిలయన్స్ దిగ్గజ అధినేత ముఖేష్ అంబానీ లగ్జరీ కారు హోమ్!

ఈ మద్యనే మన దేశ నౌకా ధళం కొత్త జలాంతర్గామిని ప్రవేశ పెట్టింది, ఇక రష్యా ఐయస్‍ఐయస్ తీవ్రవాదుల అంతానికి కొన్ని కొత్త ఆయుధాలను సమకూర్చుకుంటోంది మరియు ఫ్రాన్స్‌లో మొన్న జరిగిన దాడులకు సంభంధించి ఆ దేశ అధ్యక్షుడు వారి పార్లమెంట్ ‍‌‌లో మాట్లాడుతూ ఈ దాడులకు సంభందించిన వారిని అంతం చేస్తానని ప్రతిజ్ఞ చేశాడు. ఇలాంటి పరిణామాల దృష్ట్యా అమెరికా తమ తీర ప్రాంతాల్లో భద్రత ను కట్టుదిట్టం చేసింది.
Also Read: భారతదేశపు భవిష్యత్తు మోటార్ సైకిల్స్...మరి ఇందులో దేనిని ఎంచుకుంటారు

ఇందులో భాగంగా అమెరికా నౌకా దళం నేల మరియు నీరు రెండింటి మీదనడిచే యుద్ద వాహనాలను ప్రవేశ పెట్టింది. ఈ వాహనాల గురించి మరింత సమాచారం క్రింద కథనాల ద్వారా తెలుసుకుందాం.....

తీర ప్రాంతాల్లో అమెరికా యుద్ద ట్యాంకులు మరియు ఆంపిబియస్ యుద్ద వాహనాలు

అమెరికా నౌకా ధళ సంస్థ ఇప్పుడు తమ తీర ప్రాంతాల్లో ఉన్న సిబ్బందికి ఆంపిబియస్ యుద్ద వాహనాలను అందించింది. అంటే అమెరికా సముద్ర తీరాల్లో కూడా యుద్దానికి తెర లేపింది అని అర్థం అవుతోంది. ఈ ప్రక్రియ‌లో కిల్ ఇన్ యాక్షన్ ను అమలు చేయనున్నారు.

తీర ప్రాంతాల్లో అమెరికా యుద్ద ట్యాంకులు మరియు ఆంపిబియస్ యుద్ద వాహనాలు

అత్యంత శక్తి వంతమైన ఈ ఆంపిబియస్ యుద్ద వాహనాలను తయారు చేయడానికి అమెరికా నావికా ధళం, బిఎఇ మరియు యస్‌‌ఎఐసి సంస్థలకు వీటి నిర్మాణ భాద్యతలను అప్పగించింది.

తీర ప్రాంతాల్లో అమెరికా యుద్ద ట్యాంకులు మరియు ఆంపిబియస్ యుద్ద వాహనాలు

నూతన పరిజ్ఞానంతో తయారు కాబడుతున్న ఈ ఆంపిబిస్ సముద్ర గస్తీ యుద్ద వాహనాలను దాదాపుగా 13 వరకు అమెరికా నావికా ధళానికి అందించాలని అమెరికా భావిస్తోంది.

తీర ప్రాంతాల్లో అమెరికా యుద్ద ట్యాంకులు మరియు ఆంపిబియస్ యుద్ద వాహనాలు

ఈ 13 ఆంపిబియస్ యుద్ద వాహనాల తయారి కోసం దాదాపుగా 225 మిలియన్ డాలర్లు ఖర్చు పెడుతోంది.

తీర ప్రాంతాల్లో అమెరికా యుద్ద ట్యాంకులు మరియు ఆంపిబియస్ యుద్ద వాహనాలు

అమెరికా వారి సముద్ర గస్తీ ఆంపిబియస్ వాహనాలు ఎనిమిది చక్రాలతో రానున్నాయి.

తీర ప్రాంతాల్లో అమెరికా యుద్ద ట్యాంకులు మరియు ఆంపిబియస్ యుద్ద వాహనాలు

నేల మరియు నీటి మీద ప్రయాణిస్తు యుద్దంలో పాల్గొనే ఈ ఆంపిబియస్ వాహనాలలో దాదాపుగా 700 బిహెచ్‌పి పవర్‌‌ను ఉత్పత్తి చేసే ఇంజన్‌లను ఇందులో అందించారు.

తీర ప్రాంతాల్లో అమెరికా యుద్ద ట్యాంకులు మరియు ఆంపిబియస్ యుద్ద వాహనాలు

ఒక్కొక్క యుద్ద ఆంపిబియస్ వాహనంలో ముగ్గురు ఆపరేటర్‌లు సురక్షితంగా ప్రయాణించవచ్చు. ఈ వాహనాల ద్వారా ఇందులో ప్రయాణించే సైన్యానికి ఎలాంటి ఆపద కలగకుండా వీటిని రూపొందించారు.

తీర ప్రాంతాల్లో అమెరికా యుద్ద ట్యాంకులు మరియు ఆంపిబియస్ యుద్ద వాహనాలు

అమెరికా తీర దళం వీటిని ఇప్పటి నుండే కాదు దాదాపుగా 70 సంవత్సరాల నుండి ఉపయోగిస్తోంది. అనగా అమెరికాకు వీటి వాడకంలో 70 సంవత్సరకాల సుధీర్ఘ అనుభవం ఉందని చెప్పవచ్చు.

తీర ప్రాంతాల్లో అమెరికా యుద్ద ట్యాంకులు మరియు ఆంపిబియస్ యుద్ద వాహనాలు

తీర ప్రాంత రక్షణలో ఈ ఆంపిబియస్ యుద్ద వాహనాలు ఎంతో బాగా ఉపయోగ పడ్డాయని అందుకే ఇప్పుడు అమెరికా వీటి మీద ఎక్కువ దృష్టి సారించినట్లు తెలుస్తోంది.

అమెరికా ఆంపిబియస్ యుద్ద వాహనాల గురించి ఒక చిన్న వీడియో ఉంది. దీని మీద ఓ లుక్కేయండి.

 యుద్ద ట్యాంకులు మరియు ఆంపిబియస్ యుద్ద వాహనాలు
  1. ప్యారిస్ టెర్రరిస్ట్‌ల దాడిని రికార్డ్ చేసిన కారు కెమెరా
  2. ఈ వాహనాలతో వరదలలో కూడా సురక్షితంగా ప్రయాణించండి
  3. భారతదేశపు కొత్త జలాంతర్గామి ఫ్రిగేట్ INS కల్వరి
  4. ఐయస్‌ఐయస్ తీవ్రవాదుల నాశనానికి బ్రహ్మాస్త్రం

Most Read Articles

English summary
The New US Marines Amphibious Assault Vehicle Is A 700bhp 8x8 Monster
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X