షోరూమ్ సిబ్బందికి మరింత పనిపెట్టేసిన కస్టమర్.. ఎలా అనుకుంటున్నారా..?
సాధారణంగా ఒక కారు లేదా బైక్ కొనాలంటే మనం ఏదైనా చెక్కు లేదా డబ్బు (నోట్ల రూపంలో) రూపంలో షోరూమ్ లో చెల్లించి కొనుగోలు చేయవచ్చు. అయితే ఇటీవల ఉత్తరాఖాండ్ లో ఒక వ్యక్తి కేవలం నాణేలతో కొనుగోలు చేసాడు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి.

రూపాయి నాణేలతో, ఐదు రూపాయల నాణేలతో వాహనాలను కొనుగోలు చేసిన సంఘటనలు గతంలో చాలావే వెలువడ్డాయి. అయితే మళ్ళీ ఇలాంటి సంఘటనే ఉత్తరాఖండ్ లో జరిగింది. ఉత్తరాఖండ్ రుద్రపూర్ కి చెందిన ఒక వ్యక్తి 10 రూపాయల నాణేలతో టీవీఎస్ కంపెనీ యొక్క జుపీటర్ కొనుగోలు చేసాడు. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ వీడియోలో వ్యక్తి 10 రూపాయల నాణేలను మొత్తం 50,000 పోగేసి సమీపంలో ఉండే ఒక డీలర్షిప్ వద్ద జుపీటర్ స్కూటర్ కొనుగోలు చేయడానికి వెళతాడు. అతని వద్ద ఉన్న ఈ మొత్తన్ని ఆ డీలర్షిప్ సిబ్బంది లెక్కించడం కూడా చూడవచ్చు.

టీవీఎస్ జుపీటర్ దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన స్కూటర్. ఈ స్కూటర్ యొక్క స్టాండర్డ్ వేరియంట్ ధర మార్కెట్లో రూ. 85,210 వరకు ఉంది. కాగా ఆ వ్యక్తి 10 రూపాయల నాణేలను 50,000 మాత్రమే తీసుకువచ్చాడు. మిగిలిన మొత్తాన్ని ఆ వ్యక్తి ఎలా చెల్లించాడు అనేది స్పష్టంగా తెలియదు.

ఇలాంటి సంఘటనే గతంలో తమిళనాడులో వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటనలో తమిళనాడు సేలంకి చెందిన 'భూపతి' అనే వ్యక్తి తనకు ఎంతగానో ఇష్టమైన బజాజ్ డామినార్ బైక్ ను మొత్తం రూ. 1 నాణేలు చెల్లించి కొనుగోలు చేసాడు. దీనికి సంబంధించిన వీడియో కూడా అప్పట్లో చాలా వైరల్ గా మారింది.

నిజానికి 'భూపతి'కి బజాజ్ డామినర్ బైక్ అంటే చాలా ఇష్టం. కావున ఆ బైకుని అతడు మూడు సంవత్సరాలకు ముందే కొనుగోలుచేయాలనుకున్నాడు. అయితే ఆ సమయంలో అతని వద్ద అంత డబ్బు లేదు. ఆ సమయంలో ఆ బైకు ధర రూ. 2 లక్షల వరకు ఉండేది.

భూపతి ఒక యూట్యూబర్ కావడం వల్ల ఆ యూట్యూబ్ చానెల్ ద్వారా వచ్చే ఆదాయంతో కొనాలనుకున్నాడు. అయితే అతడు కావాల్సిన డబ్బు రెడీ చేసుకునే సరికి ఆ బైకు ధర రూ. 2.6 లక్షలకు చేరింది. ఈ మొత్తమ్ డబ్బుని ఒక రూపాయి నాణేల రూపంలో ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. దీనికోసం మొత్తం నాణేలను సేకరించుకున్నాడు. ఈ డబ్బుని షోరూముకి ఒక మినీ వ్యానులో తీసుకెళ్లాడు.
భూపతి తీసుకెళ్లిన మొత్తం నాణేలను లెక్కించడానికి ఆ షోరూమ్ సిబ్బందికి 10 గంటల సమయం పట్టింది. దీనికి భూపతి మరియు అతని స్నేహితులు కూడా సహాయం చేశారు. ఈ విధానం షోరూమ్ సిబ్బందికి కూడా కొంత కష్టంగా ఉన్నప్పటికీ ఇదొక కొత్త అనుభూతి అని అన్నారు. భూపతి యూట్యూబర్ కావడంతో ఈ మొత్తం వ్యవహారం మొదటి నుంచి వీడియో తీసాడు. అది తక్కువ కాలంలోనే మరింత వైరల్ అయిపోయింది.
ఇదిలా ఉండగా ఇటీవల టీవీఎస్ కంపెనీ కొత్త జుపీటర్ లాంచ్ చేసింది. స్మార్ట్‌ఎక్స్‌కనెక్ట్ టెక్నాలజీతో కూడిన కొత్త 2022 TVS Jupiter ZX ధర రూ.80,973 (ఎక్స్-షోరూమ్). ఇది స్మార్ట్‌ఎక్స్‌కనెక్ట్ (SmartXonnect ) టెక్నాలజీ వచ్చిన వాయిస్ అసిస్ట్ ఫీచర్ పొందుతుంది. అంతే కాకుండా ఇది ఫుల్లీ డిజిటల్ కన్సోల్, నావిగేషన్ మరియు వాయిస్ అసిస్ట్ ఫీచర్ కలిగిన ఏకైక 110 సీసీ స్కూటర్. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:
కొంతమంది కొన్ని విషయాలను సాధారణంగా చేయడానికంటే కొంత భిన్నంగా చేయడానికి ఇష్టపడతారు. దీనికోసం కొంత కొత్తగా ఆలోచిస్తారు. ఎవరైనా డబ్బుని నోట్ల రూపంలో చెల్లించి వాహనాలను కొనుగోలు చేస్తారు, కానీ చిల్లర నాణేల రూపంలో కొనుగోలు చేయడం అనేది చాలా కొత్తగా ఉంటుంది. ఈ విధానాన్ని గతంలో కూడా కొంతమంది ఫాలో అయ్యారు. ఇప్పుడు కూడా ఇలాంటి సంఘటనే మరోసారి వెలుగులోకి వచ్చింది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవడంతోపాటు మార్కెట్లో విడుదలయ్యె కొత్త కార్లు మరియు బైకులను గురించి ఎప్పటికప్పుడు అప్డేటెడ్ సమచారం తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.


Click it and Unblock the Notifications








