పేరడీ వీడియో: ఆటోరిక్షాలపై రజనీకాంత్ ఫన్నీ స్టంట్..!
సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లు వెర్రి పుంతలు తొక్కుతున్నాయి. ఈ సైట్లలో ఇప్పటికే అనేక మంది స్టార్ హీరోలపై జోక్‌లు వేయటాన్ని మనం నిత్యం గమనిస్తూనే ఉంటాం. అందులోను ప్రత్యేకించి తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌పై వేసే జోక్‌లు అందర్ని నవ్విస్తుంటాయి. ఎవరైనా స్టార్ హీరో ఏదైనా అద్భుతమైన ఫీట్ చేస్తే, దానికి పేరడీగా రజనీకాంత్‌ను చూపించడం చేస్తుంటారు నెటిజన్లు.
తాజాగా అలాంటి ఓ పేరడీ వీడియోనే యూట్యూబ్‌లో హల్ చల్ చేస్తుంది. ప్రముఖ హాలీవుడ్ నటుడు జీన్-క్లాడ్ వాన్ డామే రెండు రోడ్డుపై సమాంతరంగా వెళ్తున్న రెండు వోల్వో ట్రక్కులపై నిల్చుకొని స్ప్లిట్ స్టంట్ చేస్తాడు. ఈ స్టంట్‌లో వాన్ డామే పక్కపక్కనే వెళ్తున్న రెండు వోల్వో ట్రక్కుల సైడ్ మిర్రర్లపై కాళ్లు పెట్టి, ఎలాంటి రోప్‌ల సాయం లేకుండా బ్యాలెన్సింగ్‌గా నిలుచుకొని ఉంటాడు.
ఇది కూడా చదవండి: రజనీకాంత్ కార్ కలెక్షన్‌లో ఏమున్నాయ్..?
కొంత దూరం వెళ్లే సరికి రెండు వోల్వో ట్రక్కులు కొద్దిగా కొద్దిగా పక్కకు జరుగుతూ స్ప్లిట్ అవుతాయి. ఈ ప్రమాదరక స్టంట్‌ను రజనీకాంత్ సార్‌తో పేరడీ చేస్తూ, యూట్యూబ్‌లో ఓ యానిమేషన్ వీడియో విడుదలైంది. మరి అందులో రజనీకాంత్ చేసిన స్టంట్‌ను ఏంటో తెలియాలంటే, క్రింది స్లైడ్‌లోని వీడియోలో చూడాల్సిందే..!

వోల్వో ట్రక్కులలో ఉండే డైనమిక్ స్టీరింగ్ ఫీచర్ గురించి వివరించేందుకు వోల్వో బృందం మరియు వాన్ డామేలు ఖాలీగా ఉన్న రోడ్డుపై ఈ స్టంట్ చేశారు. వేగంగా వెళ్లేటప్పుడు స్టీరింగ్ అటు ఇటు కదలకుండా ఉండటమే ఈ డైనమిక్ స్టీరింగ్ ఫీచర్.

ఇదే విషయానికి పేరడీగా రజనీకాంత్ యానిమేషన్‌తో ఓ వీడియో యూట్యూబ్‌లో విడుదలైంది. ఇందులో రజనీకాంత్ భాషా మాదిరిగా ఆటోవాలా గెటప్‌లో ఉంటాడు.

ఆటోవాలా గెటప్‌లో రజనీకాంత్, వాన్ డామే ఎపిక్ స్ప్లిట్‌కు పేరడీగా ఆటోలపై స్ప్లిట్ చేస్తూ కనిపిస్తాడు.

ఒకటి కాదు రెండు కాదు మొత్తం ఆరు ఆటోలను కుడివైపు మూడు ఆటోలు, ఎడమవైపు మూడు ఆటోల (ఒకదానిపై ఒకటి ఉంటాయి)పై రజనీకాంత్ యానిమేటెడ్ క్యారెక్టర్ ఈ స్ప్లిట్ చేస్తూ కనిపిస్తుంది.

ఇటీవల ఫేస్‌బుక్‌లో కూడా ఇదే విషయంపై ఓ ఫన్నీ ఫొటోను తయారు చేశారు నెటిజెన్లు. ఇందులో రజనీకాంత్ రెండు జెట్ విమానాలపై కాళ్లు పెట్టి, తన రెండు చేతుల్తో వోల్వో ట్రక్కులను బ్యాలెన్స్ చేస్తూ కనిపిస్తాడు.
వీడియో
మరి ఆ ఫన్నీ యానిమేటెడ్ వీడియోను మీరు కూడా ఈ స్లైడ్‌లో వీక్షించండి.
వీడియో
వాన్ డామే చేసిన ఒరిజినల్ వోల్వో ఎపిక్ స్ప్లిట్ వీడియోను ఈ స్లైడ్‌లో వీక్షించండి.


Click it and Unblock the Notifications








