హ్యాపి బర్త్ డే టు రజనీ కాంత్: రజనీ కార్ కలెక్షన్
కోట్ల రూపాయల సిరి సంపదలు ఉన్నప్పటికీ అత్యంత సాదాసీదా వ్యక్తిగా జీవించడం మన సూపర్ స్టార్ రజనీకాంత్‌కే చెల్లుతుంది. కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్‌లలోనే కాకుండా ప్రపంచ సినీ పరిశ్రమలో సైతం ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న మన 'బాషా' నేటితో 65 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. ప్రేక్షకులను తనదైన శైలిలో ఆకట్టుకుంటూ సందేశాత్మక సినిమాల్లో నటించే మన 'శివాజి' ఓ సామాన్య బస్ కండక్టర్ నుండి తన కెరీర్‌ను ప్రారంభించి, నేడు యావత్ ప్రపంచం గుర్తించదగిన సూపర్ స్టార్ స్థాయికి ఎదిగాడు.
రజనీకాంత్ తన హోదాతో సంబంధం లేకుండా ఎల్లప్పుడూ సామాన్య జీవితానికే ఇష్టపడే వాడు. అదే రజనీకాంత్ హోదాలో వేరే ఎవరైనా ఉండుంటే కోట్ల ఖరీదు చేసే కార్లలో సరదా సవారీలు చేస్తుండే వారు. సింప్లిసిటీకి అద్దం పట్టే మన రజనీకాంత్ తన జీవితంలో ఉపయోగించిన కార్లేంటో, వాటి కథేంటో ఈ కథనంలో తెలుసుకుందాం రండి..!
కొంచెం డిఫరెంట్‌గా...!
రజనీకాంత్ 2012 నాటి పుట్టిన రోజు విశేషాలు...రజనీకాంత్ గురించి కొందరు కాస్తంత భిన్నంగా ఆలోచిస్తుంటారు. అలాంటి ఆలోచనల్లో నుంచి పుట్టుకొచ్చిన వాటిల్లో ఇదొకటి..! రజనీకాంత్ 12/12/12తో 63 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు. ఈ తేదిని కూడితే 36 అనే అంకె వస్తుంది. రజనీ సినీ పరిశ్రమలోకి ప్రవేశించి కూడా 36 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ 36 అంకెను తిరగేసి చదివితే 63 అవుతుంది. మళ్లీ ఈ అంకె రజనీకాంత్ వయస్సును తెలియజేస్తుంది. మొత్తానికి ఈ తేది రజనీకాంత్ జీవితంలో ఓ చక్కని రోజుగా మిగిలిపోయింది.. ఆయనకు మా డ్రైవ్ స్పార్క్ బృందం తరఫున హార్థిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. (Drivespark wishes the super star a very happy birthday)

రజనీకాంత్ - ప్రీమియర్ పద్మిని
అప్పట్లో అత్యంత పాపులర్ అయిన ఫియట్ ప్రీమియర్ పద్మిని కారును రజనీకాంత్ 1980 నుంచి 1990 కాలంలో ఉపయోగించేవారు.

రజనీకాంత్ - అంబాసిడర్
అత్యంత సౌకర్యవంతమైన అంబాసిడర్ కారులో రజనీకాంత్ షూటింగ్‌లకు వెళ్లేవారు. ఈ కారును 1990-2000 కాలంలో ఉపయోగించారు.

రజనీకాంత్ - హోండా సివిక్
ఆ తర్వాతి కాలంలో రజనీకాంత్ ఓ హోండా సివిక్ కారును ఉపయోగించారు.

రజనీకాంత్ - ఇన్నోవా
ప్రస్తుతం రజనీకాంత్ ఓ టొయోటా ఇన్నోవా కారును ఉపయోగిస్తున్నారు.

రజనీకాంత్ - షారుఖ్ ఖాన్ - బిఎమ్‌డబ్ల్యూ 7-సిరీస్
షారుఖ్ ఖాన్ నటించిన సైన్స్ ఫిక్షన్ చిత్రం రావన్‌లో గెస్ట్ రోల్ చేసినందకు గాను, రజనీకాంత్‌కు షారుఖ్ ఖాన్ ఓ బిఎమ్‌డబ్ల్యూ 7-సిరీస్ కారును కానుకగా ఆఫర్ చేశారు. అయితే, ఈ బహుమతి రజనీ స్వీకరించలేదని సమాచారం.

హ్యాపీ బర్త్ డే రజనీకాంత్

రజనీకాంత్ - ఇన్నోవా

రజనీకాంత్ - ఇన్నోవా



Click it and Unblock the Notifications








