ఆ సెలబ్రిటీ చేసిన ఫీట్‌ను ఆరు కోట్ల మందికి పైగా వీక్షించారు

ఇటీవల ప్రముఖ హాలీవుడ్ నటుడు జీన్-క్లాడ్ వాన్ డామే రెండు భారీ వోల్వో ట్రక్కులపై చేసిన ఎపిక్ స్ప్లిట్ వీడియో యూట్యూబ్‌లో రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది. యూట్యూబ్‌లోనే మొట్టమొదటి సారిగా, అత్యధికంగా వీక్షించిన ఆటోమొబైల్ కమర్షియల్‌గా ఇది రికార్డు సృష్టించింది. ఈ ఎపిక్ స్ప్లిట్ వీడియోను యూట్యూబ్‌లో ఇప్పటి 6.1 కోట్ల మందికి పైగా వీక్షకులు వీక్షించారు.

ఈ ఫీట్‌లో వాన్ డామే రెండు రోడ్డుపై సమాంతరంగా అపసవ్యదిశలో (వెనక్కి) వెళ్తున్న రెండు భారీ వోల్వో ట్రక్కులకు సైడ్ మిర్రర్స్‌పై కాళ్లు పెట్టుకొని, దానిపై స్ప్లిట్ స్టంట్ చేస్తాడు. ఈ స్టంట్‌లో వాన్ డామే ఎలాంటి రోప్‌ల సాయం లేకుండా బ్యాలెన్సింగ్‌గా నిలుచుకొని స్ప్లిట్ చేయటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. తొలుస సమానంగా వెళ్లే ఈ ట్రక్కులు కొంత దూరం వెళ్లే సరికి రెండు కొద్దిగా కొద్దిగా పక్కకు జరుగుతూ ఉంటాయి.

ఇది కూడా చూడండి.. ఆటోరిక్షాలపై రజనీకాంత్ ఎపిక్ స్ప్లిట్ (పేరడీ)

ఇలా జరుగుతున్నప్పుడు వాన్ డామే తన కాళ్లను కూడా దూరంగా జరుగుతూ స్ప్లిట్ చేస్తాడు. వోల్వో ట్రక్కులలో ఉండే డైనమిక్ స్టీరింగ్ ఫీచర్ గురించి వివరించేందుకు వోల్వో బృందం మరియు వాన్ డామేలు ఖాలీగా ఉన్న రోడ్డుపై ఈ స్టంట్ చేశారు. వేగంగా వెళ్లేటప్పుడు స్టీరింగ్ అటు ఇటు కదలకుండా ఉండటమే ఈ డైనమిక్ స్టీరింగ్ ఫీచర్ యొక్క విశిష్టత. మనం కూడా ఆ వీడియోని మరోసారి వీక్షిద్దాం రండి..!
<center><center><center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/M7FIvfx5J10?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center></center></center>

More from DriveSpark

Article Published On: Thursday, December 19, 2013, 13:13 [IST]
English summary
Watch Jean-Claude Van Damme carry out his famous split between two reversing trucks. Never done before, JCVD says it's the most epic of splits -- what do you think?&#13;
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+