ఈ-చలాన్ విధించారని పోలీసుల క్యాప్ & ఎటిఎం లాక్కుని, బోరున ఏడ్చిన మహిళ [వీడియో]

భారతదేశంలో రోజురోజుకి రోడ్డు ప్రమాదాలు ఎక్కువవుతున్నాయి, ఈ ప్రమాదాలను నివారించడానికి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఇటీవల కాలంలో ట్రాఫిక్ రూల్స్ మరింత కఠినతరమయ్యాయి. ట్రాఫిక్ నియమాలను ఉల్లఘించే వాహనదారులకు కఠినమైన శిక్షలు విధించడంతో పాటు, ట్రాఫిక్ ఫైన్స్ కూడా వసూలు చేస్తున్నారు.

ఈ-చలాన్ విధించారని పోలీసుల క్యాప్ & ఎటిఎం లాక్కుని, బోరున ఏడ్చిన మహిళ [వీడియో]

ట్రాఫిక్ ఉల్లంఘించేవారి కోసం ఇ-చలాన్ సిస్టం అమలులో ఉంది. వాహనదారులు మరియు పోలీసుల మధ్య ఘర్షణను నివారించడానికి ఈ, ఈ-చలాన్ అమలుచేయడం జరిగింది. కానీ అప్పుడప్పుడు ఈ చలాన్ వల్ల కూడా కొన్ని గొడవలు వస్తున్నాయి. ఇలాంటి సంఘటన ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లో వెలుగులోకి వచ్చింది.

ఈ-చలాన్ విధించారని పోలీసుల క్యాప్ & ఎటిఎం లాక్కుని, బోరున ఏడ్చిన మహిళ [వీడియో]

నివేదికల ప్రకారం ఉత్తర ప్రదేశ్‌లో ఇ-చలాన్ సమస్యపై ఒక మహిళ పోలీసులతో వాగ్వాదానికి దిగినట్లు తెలిసింది. ఈ సంఘటన నైజు యుపి అనే యూట్యూబ్ ఛానెల్ అప్‌లోడ్ చేసింది. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లోని గోమతి నగర్‌లో జరిగింది.

MOST READ:మొదలైన ఫాస్ట్‌ట్యాగ్ వసూళ్ల జాతర.. రోజుకు రూ. 100 కోట్లు వసూల్

ఈ-చలాన్ విధించారని పోలీసుల క్యాప్ & ఎటిఎం లాక్కుని, బోరున ఏడ్చిన మహిళ [వీడియో]

వీడియోలోని సమాచారం ప్రకారం, వీడియోలోని మహిళ స్కూటర్‌లో గోమతి నది వంతెనను దాటుతోంది. ఆ సమయంలో అక్కడ వున్న ఐస్ క్రీం విక్రేతను చూసి, ఐస్ క్రీం తినటానికి బ్రిడ్జ్ మీద స్కూటర్ నిలిపింది. అదే సమయంలో అక్కడ పోలీసులు కాలినడకన పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు.

ఈ-చలాన్ విధించారని పోలీసుల క్యాప్ & ఎటిఎం లాక్కుని, బోరున ఏడ్చిన మహిళ [వీడియో]

బ్రిడ్జ్ మీద పార్క్ చేయకూడదని ఆ మహిళకు చెప్పారు, కానీ ఆమె ఆ పోలీసుల మాటలు వినలేదు. తర్వాత ఆ మహిళ అక్కడ నుంచి వెళ్లిపోయింది. అప్పుడు మహిళ సెల్ ఫోన్ కు ఈ-చలాన్ ఇచ్చినట్లు ఎస్ఎంఎస్‌ వచ్చింది. ఈ చలాన్ రావడంతో కోపోద్రిక్తురాలైన ఆ మహిళా మళ్ళీ అదే బ్రిడ్జ్ మీదకు వచ్చింది.

MOST READ:హీరో 100 మిలియన్ స్పెషల్ ఎడిషన్లపై సెలబ్రేషన్ ఆఫర్స్; స్టాక్ ఉన్నంతవరకే!

ఈ-చలాన్ విధించారని పోలీసుల క్యాప్ & ఎటిఎం లాక్కుని, బోరున ఏడ్చిన మహిళ [వీడియో]

ఆ పోలీసులు అక్కడే ఉండటాన్ని గమనించిన ఆ మహిళ అక్కడకు వెళ్లి బోరున ఏడ్చడం ప్రారంభించి, వారిపై గట్టిగా అరవడం కూడా ప్రారంభించింది. ఏడుస్తూనే ఆ మహిళ పోలీసుల యొక్క క్యాప్ మరియు ఎటిఎం కార్డును తీసుకుని తన స్కూటర్ డిక్కీలో ఉంచి లాక్ చేసింది.

ఈ-చలాన్ విధించారని పోలీసుల క్యాప్ & ఎటిఎం లాక్కుని, బోరున ఏడ్చిన మహిళ [వీడియో]

ఇంతటితో ఆ మహిళ ఆగకుండా ఏడుస్తూనే ఉంది, ఆ స్త్రీ ఏడుపును గమనించి చాలా మంది ప్రజలు పెద్ద సంఖ్యలో అక్కడ గుమికూడారు. మొదట ఆమె ఏడుపుని ఆపడానికి చాలామంది ప్రయత్నించారు. అయితే చివరకు ఆమె తన ఈ చలాన్ రద్దు చేయాలనీ డిమాండ్ చేసింది.

MOST READ:రోడ్డుపై యాక్టివా స్కూటర్‌పై ఉన్న యువతి చేసిన పనికి చిర్రెత్తిన కెటిఎమ్ బైక్ రైడర్‌

ఈ-చలాన్ విధించారని పోలీసుల క్యాప్ & ఎటిఎం లాక్కుని, బోరున ఏడ్చిన మహిళ [వీడియో]

ఆ మహిళను అక్కడున్న ప్రజలు పోలీసుల క్యాప్ మరియు ఎటిఎం ఇవ్వాలని చెప్పారు, ప్రజల కోరిక మేరకు ఆ మహిళ పోలీసు క్యాప్, ఎటిఎం కార్డును తిరిగి ఇచ్చింది. మధ్యాహ్నం 2 గంటలకు ఈ-చలాన్ రద్దు చేయబడుతుందని పోలీసులు మహిళకు తెలిపారు. పోలీసులు జారీ చేసిన ఇ-చలాన్ రద్దు చేయబడిందా లేదా అనే దానిపై ప్రస్తుతం సమాచారం అందుబాటులో లేదు.

ఈ సంఘటన యొక్క వీడియోను చూసిన ప్రజలు మహిళపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ-చలాన్ జారీ చేసే అధికారాన్ని పోలీసులు దుర్వినియోగం చేస్తే, కోర్టులలో అప్పీల్ చేయడం ద్వారా పరిష్కరించుకోవాలి, ఈ విధంగా చేయడం సరైనపద్ధతి కాదని తెలిపారు. పోలీసులతో గొడవపడటం మరియు వారి వస్తువులను లాక్కోవడం కూడా మంచి పద్ధతి కాదు.

MOST READ:నడి రోడ్డుపై మహిళా స్కూటరిస్ట్ చెంప చెళ్లుమనిపించిన పిఎస్‌ఐ [వీడియో]

ఈ-చలాన్ విధించారని పోలీసుల క్యాప్ & ఎటిఎం లాక్కుని, బోరున ఏడ్చిన మహిళ [వీడియో]

ఇటీవల ఒక వ్యక్తి తనకు అనవసరంగా 200 ట్రాఫిక్ ఫైన్ వేసినప్పుడు దాన్ని రద్దు చేయించడానికి కోర్టును సంప్రదించి రద్దు చేయించాడు. దీని కోసం అతడు దాదాపు 10,000 రూపాయలు ఖర్చు చేసాడు. దీని గురించి పూర్తి సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Image Courtesy: NYOOOZ UP- Uttarakhand

Most Read Articles

English summary
Woman Cries And Snatches Belongings Of A Cop After Receiving E Challan. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X