200 రూపాయల ట్రాఫిక్ ఫైన్ రద్దు కోసం రూ. 10,000 ఖర్చు చేసిన వ్యాపారవేత్త

భారతదేశంలో రోడ్డుప్రమాదాలను తగ్గించడానికి ట్రాఫిక్ నిబంధనలను ఉల్లఘించిన వాహనదారులపై కేంద్ర మరియు రాష్ట్ర కఠినమైన చర్యలు తీసుకుంటున్నాయి. ఇందులో భాగంగానే ట్రాఫిక్ పోలీసులు భారీ జరిమానాలు విధిస్తున్నారు. కొంతమంది వాహనదారులు ట్రాఫిక్ పోలీసులకు సహకరిస్తూ ట్రాఫిక్ చలాన్లు కడతారు, అయితే కొంతమంది తమ తప్పులేకపోతే ఎంత దూరమైనా వెళ్ళడానికి వెనుకాడరు.

200 రూపాయల ట్రాఫిక్ ఫైన్ రద్దు చేయించడం కోసం రూ. 10000 ఖర్చు చేసే వ్యాపారవేత్త

ఇదే రీతిలో పూణేకు చెందిన ఒక వ్యాపారవేత్త రూ. 200 ట్రాఫిక్ జరిమానా రద్దు చేయించుకోవడం కోసం పోరాడుతున్న సంఘటన వెలుగులోకి వచ్చింది. నివేదికల ప్రకారం యితడు నో పార్కింగ్ లో పార్క్ చేయడం వల్ల అతనికి పోలీసులు 200 రూపాయల జరిమానా విధించినట్లు తెలిసింది.

200 రూపాయల ట్రాఫిక్ ఫైన్ రద్దు చేయించడం కోసం రూ. 10000 ఖర్చు చేసే వ్యాపారవేత్త

జనవరి నెలలో, బినాయ్ గోపాలన్ పింప్రి-చిన్చ్ వాడ్ ట్రాఫిక్ పోలీసుల నుండి రూ. 200 చలాన్ అందుకున్నాడు. పార్కింగ్ గుర్తుపై శ్రద్ధ చూపకుండా వాహనాన్ని పార్కింగ్ చేసినందుకు చాలా మందికి జరిమానా విధించబడింది. అక్కడ అందరూ జరిమానా చెల్లించారు.

MOST READ:ఎట్టకేలకు భారత్‌లో అడుగుపెట్టిన జాగ్వార్ ఐ-పేస్ : ధర, ఫీచర్లు & వివరాలు

200 రూపాయల ట్రాఫిక్ ఫైన్ రద్దు చేయించడం కోసం రూ. 10000 ఖర్చు చేసే వ్యాపారవేత్త

కానీ బినాయ్ గోపాలన్ రూ. 200 రూపాయల ట్రాఫిక్ జరిమానా చెల్లించడానికి నిరాకరించాడు. కేవలం 200 రూపాయల ట్రాఫిక్ జరిమానా చెల్లించినట్లైతే, ఆ కేసు అక్కడితో ముగుస్తుంది. కానీ జరిమానాలు చెల్లించే బదులు ట్రాఫిక్ పోలీసు కార్యాలయాన్ని సందర్శించి పలువురు ట్రాఫిక్ పోలీసులతో సమావేశమై పలు పిటిషన్లను అధికారులకు సమర్పించారు.

200 రూపాయల ట్రాఫిక్ ఫైన్ రద్దు చేయించడం కోసం రూ. 10000 ఖర్చు చేసే వ్యాపారవేత్త

అంతే కాకుండా అతను ట్రాఫిక్ పోలీస్ కమిషనర్ పై కేసు పెట్టాడు మరియు అనేక విచారణల తరువాత, వారు చేసిన తప్పులను అంగీకరించి, వారిపై జారీ చేసిన ఆన్‌లైన్ చలాన్‌ను ఉపసంహరించుకోవాలని ఆయన అధికారులను కోరారు.

MOST READ:ఇండియన్ ఆర్మీలో చేరనున్న 1300 మహీంద్రా వెహికల్స్, ఇవే

200 రూపాయల ట్రాఫిక్ ఫైన్ రద్దు చేయించడం కోసం రూ. 10000 ఖర్చు చేసే వ్యాపారవేత్త

45 ఏళ్ల బినాయ్ గోపాలన్ పూణేలోని ఖరాల్వాడి రోడ్‌లోని బ్యాంక్ ఆఫ్ బరోడాకు వచ్చినప్పుడు, తన బైక్‌ను బ్యాంకు వెలుపల అధికారిక పార్కింగ్ స్థలంలో ఉంచాడు.

200 రూపాయల ట్రాఫిక్ ఫైన్ రద్దు చేయించడం కోసం రూ. 10000 ఖర్చు చేసే వ్యాపారవేత్త

పార్కింగ్ స్థలం యొక్క కుడి వైపున ఉన్న పార్కింగ్ గుర్తు లేదు అని బినాయ్ గమనించి, ఎవరో తీసివేసి ఉంటారని అక్కడ పార్కింగ్ చేసాడు. అయితే తర్వాత అతనికి ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించారు. ఇందులో అతని తప్పు లేదని పోలీసులకు అర్థమయ్యేలా చెప్పడానికి బినాయ్ ప్రయత్నించాడు.

MOST READ:అర్ధరాత్రి స్విగ్గీ డెలివరీ బాయ్‌కి కెటిఎమ్ బైక్ ఇచ్చిన వ్యక్తి, ఎందుకో తెలుసా?

200 రూపాయల ట్రాఫిక్ ఫైన్ రద్దు చేయించడం కోసం రూ. 10000 ఖర్చు చేసే వ్యాపారవేత్త

కానీ, పోలీసులు దీనిని నమ్మలేదు. ఈ విషయాన్ని ఆయన ఉన్నతాధికారులకు తెలియజేశారు. సంబంధించిన అన్ని ఆధారాలు సమర్పించారు. అధికారులు మొదట అతని వాదనను అంగీకరించారు, కానీ రికార్డుల ప్రకారం, ఆ ప్రదేశం అధికారిక పార్కింగ్ స్థలం అని చెప్పారు.

200 రూపాయల ట్రాఫిక్ ఫైన్ రద్దు చేయించడం కోసం రూ. 10000 ఖర్చు చేసే వ్యాపారవేత్త

మొదట పోలీసులు చలాన్ రద్దు చేయడానికి నిరాకరించారు. తొలగించిన గుర్తు తమను గందరగోళానికి గురిచేసినట్లు అంగీకరించడంతో పోలీసులు తరువాత రూ. 200 జరిమానాను రద్దు చేశారు.

MOST READ:మీ టూవీలర్‌కి సైడ్ మిర్రర్ లేదా.. అయితే భారీ జరిమానా తప్పదు, జాగ్రత్త..!

200 రూపాయల ట్రాఫిక్ ఫైన్ రద్దు చేయించడం కోసం రూ. 10000 ఖర్చు చేసే వ్యాపారవేత్త

చివరకు బినాయ్ ట్రాఫిక్ చలాన్ రద్దుచేశారు, కానీ దీని కోసం అతడు రెండు నెలలుగా పోలీసు శాఖ కార్యాలయాలలో తిరుగుతున్నాడు. పోలీస్ కార్యాలయం చుట్టూ తిరగడానికి అతనికి దాదాపు 10,000 రూపాయలు ఖర్చు చేశాడు. అతడికి 200 రూపాయలు చెల్లించడం పెద్ద విషయం కాదు, కానీ అతను చేయని తప్పుకు జరిమానా చెల్లించటానికి అతను ఇష్టపడలేదు. అయితే అతడు న్యాయం కోసం రూ .10,000 ఖర్చు చేయడం నిజంగా బాధాకరం.

Most Read Articles

English summary
Pune Businessman Spends Rs. 10,000 To Win a Rs. 200 Traffic Fine Case. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X