పీల్ 50 మైక్రోకార్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు..

Peel 50
పీల్ 50 కారు రెండు వేరియంట్లలో లభ్యమవుతుంది. ట్రైడెంట్ వేరియంట్ పీల్ 50 కారు ఎంట్రీ లెవల్ మోడల్. పి50 వేరియంట్ పీల్ 50 కారు టాప్ ఎండ్ వేరియంట్. అయితే, రెండు వేరియంట్లలోనూ రివర్స్ గేర్ లేదు. మరి కారును వెనక్కు నడపటం ఎలా అనే కదా మీ సందేహం. ఏముంది, చాలా సింపుల్.. కారు దిగి వెనక్కు నెట్టుకోవటమే.

పీల్ 50లో ఉపయోగించిన 50సీసీ ఇంజన్ 3.5 బిహెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇది గరిష్టంగా 24 కి.మీ. వేగంతో (అబ్బా ఎంత స్పీడో కదా...) పరుగులు తీస్తుంది. ఒకవేళ ఇందులో శక్తివంతమైన కారు కావాలనుకుంటే మీరు ఎలక్ట్రిక్ వెర్షన్ పీల్‌ను ఎంచుకోవచ్చు. ఇదైతే గరిష్టంగా 45 కి.మీ వేగంతో పరుగులు తీస్తుంది.

ఎలక్ట్రిక్ వెర్షన్ కారును పూర్తిగా ఛార్జ్ చేస్తే 80 కి.మీ. రేంజ్ వరకూ ప్రయాణం చేయవచ్చు. మరి పీల్ 50 కారు ధరెంతో తెలుసా జస్ట్ 15,600 బ్రిటీష్ పౌండ్లు మాత్రమే. అంటే మన దేశ కరెన్సీలో రూ.12 లక్షల పైచిలుకు అన్నమాట. ఈ డబ్బుతో కనీసం నాలుగు టాటా నానో కార్లు కొనుక్కోవచ్చు. అప్పటికీ ఇంకాస్త డబ్బులు మిగులే అవకాశం కూడా ఉంది.

మరి పీల్ 50 కారు ధరను అంత ఎక్కువకు ఎందుకు విక్రయిస్తున్నారని కంపెనీని అడిగితే.. వారు చెప్పే సమాధానం ఏంటంటే, ఇది చాలా అరుదుగా దొరికే కారు, కాబట్టే ఇంత అధిక ధర అని అంటోంది. మరి మీరేమంటారు.. పీల్ 50 కారును ఇండియాకు తీసుకురావాలంటారా..?

More from DriveSpark

Article Published On: Monday, January 23, 2012, 18:49 [IST]
English summary
How small can a car get? Here is one car that is just 54 inches long, 41 inches wide and weighs only 59kgs. What you are looking at is the world's smallest car, the Peel 50. The Peel 50 was manufactured in the 1960s and it is set to be relaunched soon by a new company in the United Kingdom.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+