ప్రపంచ వ్యాప్తంగా గల ఉత్తమ వ్యక్తిగత విహంగాలు

By N Kumar

మానవుడు సృష్టించిన అత్యంత వేగవంతమైన వాటిలో విమానం ఒకటి, వీటి ద్వారా ప్రపంచాన్ని మొత్తం చుట్టేసే అవకాశం కూడా లేకపోలేదు. ప్రస్తుతం కాలంలో దూరాన్ని ఎంతో దగ్గర చేసింది ఏవంటే విమానాలు అని ఠపీమని చెప్పవచ్చు.

బెస్ట్ స్కూటర్లు, బెస్ట్ కార్లు, బెస్ట్ ట్రైన్లు లాగే బెస్ట్ విమానాలు కూడా ఉన్నాయి. అందులో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఉత్తమ వ్యక్తిగత( ప్రయివేట్) విమానాలలో టాప్-9 గురించి మరియు వాటి ప్రత్యేకతలు గురించి క్రింది కథనం ద్వారా తెలుసుకుందాం రండి.

9.బీచ్ క్రాప్ట్ కింగ్ ఎయిర్ 250

9.బీచ్ క్రాప్ట్ కింగ్ ఎయిర్ 250

దీనిని అతి తక్కువ ఖర్చుతో మెయింటైన్ చేయవచ్చు మరియు రన్ వే మీద చక్కటి పనితీరును కనబరుస్తుంది. తరచుగా కూడా ఈ ఎయిర్ క్రాఫ్ట్‌ను ఉపయోగించవచ్చు. మరియు వ్యాపార అవసరాలకు కూడా వీటి వినియోగం పెరుగుతోంది.

బీచ్ క్రాప్ట్ కింగ్ ఎయిర్ 250 గురించి

బీచ్ క్రాప్ట్ కింగ్ ఎయిర్ 250 గురించి

  • ధర: 6.1 మిలియన్ అమెరికన్ డాలర్లు
  • సామర్థ్యం: ఎకధాటిగా 1,986 మైళ్లు ప్రయాణించగలదు
  • ఏ నగరాల మధ్య తిరుగుతోంది: ప్రస్తుతం ఇది బోస్టన్ నుండి చికాగో మధ్య సేవలు అందిస్తోంది.
  • అత్యధిక వేగం: గంటకు 574 కిలో మీటర్లు వేగంతో ప్రయాణిస్తుంది.
  • సీటింగ్ సామర్థ్యం: ఇందులో సౌకర్యవంతంగా 6 మంది వరకు ప్రయాణించవచ్చు.
  •  8. ఎంట్రీ లెవల్ : కెస్నా సిటేన్ ఎమ్2 (cessna citation m2)

    8. ఎంట్రీ లెవల్ : కెస్నా సిటేన్ ఎమ్2 (cessna citation m2)

    ఈ విమానం వ్యక్తిగత అవసరాలకు ఎక్కువగా ఉపయోగపడుతుంది. మంచి మైలేజ్ మరియు మెయింటెనెన్స్ ఖర్చులు కూడా తక్కువ ఉంటాయి. మరియు అతి తక్కువ దూరం గల రన్ వే మీద కూడా ఇది సురక్షితంగా ల్యాండ్ కాగలదు. ఇది ల్యాండ్ అవ్వడానికి కేవలం 3,000 అడుగులు పొడవున్న రన్‌ వే చాలు. మరియు ఇది సురక్షితంగా 300 నుండి 500 మైళ్ల వరకు ప్రయాణిస్తుంది.

     కెస్నా సిటేన్ ఎమ్2 (cessna citation m2) గురించి

    కెస్నా సిటేన్ ఎమ్2 (cessna citation m2) గురించి

    • ధర: 4.7 మిలియన్ అమెరికన్ డాలర్లు
    • సామర్థ్యం: ఎకధాటిగా 1,772 మైళ్లు ప్రయాణించగలదు
    • ఏ నగరాల మధ్య తిరుగుతోంది: ప్రస్తుతం ఇది బోస్టన్ నుండి మియామి మరియు డల్లాస్ నుండి లాస్ వెనాస్ మధ్య సేవలు అందిస్తోంది.
    • అత్యధిక వేగం: గంటకు 748 కిలో మీటర్లు వేగంతో ప్రయాణిస్తుంది.
    • సీటింగ్ సామర్థ్యం: ఇందులో సౌకర్యవంతంగా 4 నుండి 5 మంది వరకు ప్రయాణించవచ్చు.
    •  7. కెస్నా సిటేన్ సిజె3 ప్లస్( cessna citation cj3+)

      7. కెస్నా సిటేన్ సిజె3 ప్లస్( cessna citation cj3+)

      మీడియం లెంథ్ గల డొమెస్టిక్ విమానాలను కోరుకునే వారికి ఇది బాగా సరిపోతుంది. ఇది సాధారణ విమానాల కంటే అత్యధిక వేగంగా ప్రయాణిస్తుంది. అంతే కాకుండా అన్ని వాతావరణ పరిస్థితులలో అత్యధిక ఎత్తు వద్ద కూడా ఇది ప్రయాణించగలదు.

      కెస్నా సిటేన్ సిజె3 ప్లస్( cessna citation cj3+) గురించి

      కెస్నా సిటేన్ సిజె3 ప్లస్( cessna citation cj3+) గురించి

      • ధర: 8.4 మిలియన్ అమెరికన్ డాలర్లు
      • సామర్థ్యం: ఎకధాటిగా 2,348 మైళ్లు ప్రయాణించగలదు
      • ఏ నగరాల మధ్య తిరుగుతోంది: ప్రస్తుతం ఇది న్యూయార్క్ నుండి కాంకన్ మరియు లండన్ నుండి మాస్కో మధ్య సేవలు అందిస్తోంది.
      • అత్యధిక వేగం: గంటకు 772 కిలో మీటర్లు వేగంతో ప్రయాణిస్తుంది.
      • సీటింగ్ సామర్థ్యం: ఇందులో సౌకర్యవంతంగా 7 మంది వరకు ప్రయాణించవచ్చు.
      • 6.బాంబర్‌డియర్ లియర్‌జెట్ 75

        6.బాంబర్‌డియర్ లియర్‌జెట్ 75

        దీనిని ఎక్కువగా సూపర్ లైట్ అని సంభోదిస్తారు. దీని క్యాబిన్ మొత్తం చూడటానికి మిడ్ సైజ్ క్యాబిన్‌ను పోలి ఉన్నప్పటికి పవర్ మరియు వేగం విషయంలో ఉత్తమ పనితీరును కనబరుస్తుంది. మరియు టేకాఫ్ తీసుకున్న అతి తక్కువ సమయంలోనే ఎక్కువ ఎత్తుకు చేరుకోగలదు అంతే కాకుండా ప్రతి కూల వాతావరణ పరిస్థితులలో కూడా ఇది ప్రయాణించగలదు.

        బాంబర్‌డియర్ లియర్‌జెట్ 75 గురించి

        బాంబర్‌డియర్ లియర్‌జెట్ 75 గురించి

        • ధర: 13.8 మిలియన్ అమెరికన్ డాలర్లు
        • సామర్థ్యం: ఎకధాటిగా 2,348 మైళ్లు ప్రయాణించగలదు
        • ఏ నగరాల మధ్య తిరుగుతోంది: ప్రస్తుతం ఇది లాస్ ఎంజిల్స్ నుండి టొరెంటో మరియు ముంబాయ్ నుండి బ్యాంకాక్ మధ్య సేవలు అందిస్తోంది.
        • అత్యధిక వేగం: గంటకు 860 కిలో మీటర్లు వేగంతో ప్రయాణిస్తుంది.
        • సీటింగ్ సామర్థ్యం: ఇందులో సౌకర్యవంతంగా 8 మంది వరకు ప్రయాణించవచ్చు.
        •  5.కెస్నా సిటేన్ సొవెరియన్ ప్లస్( cessna citation sovereign+)

          5.కెస్నా సిటేన్ సొవెరియన్ ప్లస్( cessna citation sovereign+)

          మిడ్‌సైజ్ ఎయిర్ క్రాఫ్ట్‌లో ఉత్తమ ధర కలిగిన ఎయిర్ క్రాఫ్ట్ ఇది. దీని చక్కటి ల్యాండింగ్ పని తీరు చిన్న చిన్ని విమానాశ్రయాలలో ల్యాండ్ అవడానికి ఎంతో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా దీనిని రెండు తీర ప్రాంతాలను కలుపుతూ ప్రయాణం చేయడానికి ఎక్కువగా ఉపయోగిస్తారు.

           కెస్నా సిటేన్ సొవెరియన్ ప్లస్( cessna citation sovereign+) గురించి

          కెస్నా సిటేన్ సొవెరియన్ ప్లస్( cessna citation sovereign+) గురించి

          • ధర: 18.3 మిలియన్ అమెరికన్ డాలర్లు
          • సామర్థ్యం: ఎకధాటిగా 3,671 మైళ్లు ప్రయాణించగలదు
          • ఏ నగరాల మధ్య తిరుగుతోంది: ప్రస్తుతం ఇది లండన్ నుండి న్యూయార్క్ మరియు మాస్కో నుండి దుబాయ్ మధ్య సేవలు అందిస్తోంది.
          • అత్యధిక వేగం: గంటకు 851 కిలో మీటర్లు వేగంతో ప్రయాణిస్తుంది.
          • సీటింగ్ సామర్థ్యం: ఇందులో సౌకర్యవంతంగా 8 నుండి 9 మంది వరకు ప్రయాణించవచ్చు.
          • 4. సూపర్ మిడ్‌సైజ్: బాంబర్‌డియర్ ఛాలెంజర్ 350

            4. సూపర్ మిడ్‌సైజ్: బాంబర్‌డియర్ ఛాలెంజర్ 350

            లగ్జరీని ఎక్కువగా కోరుకునే వారికి ఎంతో బాగా సరిపోతుందని చెప్పవచ్చు. ఇటువంటి వారి కోసం ఇందులో అత్యంత సౌకర్యవంతమైన గదులను కల్పించారు. లగ్జరీ సౌకర్యాలతో కలిగిన సీట్లు కూడా ఇందులో ప్రత్యేకమే అని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రతి సీటుకు కూడా కమ్యూనికేషన్ వ్యవస్థను కల్పించారు. మరియు ఇది నిరంతరంగా ఆరు గంటల పాటు విహరించగలదు. మంచి మైలేజ్ మరియు ల్యాండింగ్ సమయంలో ఉత్తమ పనితీరును కనబరుస్తుంది.

            బాంబర్‌డియర్ ఛాలెంజర్ 350 గురించి

            బాంబర్‌డియర్ ఛాలెంజర్ 350 గురించి

            • ధర: 26.7 మిలియన్ అమెరికన్ డాలర్లు
            • సామర్థ్యం: ఎకధాటిగా 3,682 మైళ్లు ప్రయాణించగలదు
            • ఏ నగరాల మధ్య తిరుగుతోంది: ప్రస్తుతం ఇది న్యూయార్క్ నుండి డబ్లిన్ మరియు న్యూయార్క్ నుండి లాస్ ఎంజిల్స్ మధ్య సేవలు అందిస్తోంది.
            • అత్యధిక వేగం: గంటకు 849 కిలో మీటర్లు వేగంతో ప్రయాణిస్తుంది.
            • సీటింగ్ సామర్థ్యం: ఇందులో సౌకర్యవంతంగా 8 నుండి 9 మంది వరకు ప్రయాణించవచ్చు.
            • 3. బాంబర్‌డియర్ గ్లోబల్ 5000

              3. బాంబర్‌డియర్ గ్లోబల్ 5000

              బాంబర్‌‌డియర్ కు చెందిన ఈ గ్లోబల్ 5000 విమానం దాదాపుగా 5,000 మైళ్లు ఏకధాటిగా ప్రయాణిస్తుంది. ఇందులో ఉన్న ప్రత్యేకత విశాలమైన క్యాబిన్ మరియు లగేజి కోసం ప్రత్యేకమైన స్థలం మరియు మంచి కమ్యునికేషన్ వ్యవస్థను నిర్వహిస్తున్నారు.

              బాంబర్‌డియర్ గ్లోబల్ 5000 గురించి

              బాంబర్‌డియర్ గ్లోబల్ 5000 గురించి

              • ధర: 50.4 మిలియన్ అమెరికన్ డాలర్లు
              • సామర్థ్యం: ఎకధాటిగా 5,984 మైళ్లు ప్రయాణించగలదు
              • ఏ నగరాల మధ్య తిరుగుతోంది: ప్రస్తుతం ఇది లండన్ నుండి సియోల్ మరియు న్యూయార్క్ నుండి హొనొలులు మధ్య సేవలు అందిస్తోంది.
              • సీటింగ్ సామర్థ్యం: ఇందులో సౌకర్యవంతంగా 13 మంది ప్రయాణించవచ్చు.
              • 02.బాంబర్‌డియర్ గ్లోబల్ 6000

                02.బాంబర్‌డియర్ గ్లోబల్ 6000

                ఈ ప్రయివేట్ జెట్ విమానం ఏకధాటిగా దాదాపుగా 6,000 మైళ్లు ప్రయాణించగలదు. దీని ఎక్కువ దేశాధిపతులు రహస్య మంతనాలు జరపడానికి మరియు వ్యాపార లావాదేవీలు చేయడానికి మరియు ప్రయాణంలో కూడా బిజినెస్‌ చేయాలనుకునే బిజినెస్ మేన్‌లకు ఇది బాగా సరిపోకతుంది. అయితే దీనిని స-లెవల్ ఎక్సిక్యూటివ్‌లు ఎక్కువగా దీనిని ఉపయోగిస్తున్నారు.ఇందులో విశ్రాంతి గది, భోజన శాల, మీటింగ్ రూమ్‌లు వంటి సదుపాయాలును ఏర్పాటు చేశారు.

                బాంబర్‌డియర్ గ్లోబల్ 6000 గురించి

                బాంబర్‌డియర్ గ్లోబల్ 6000 గురించి

                • ధర: 62.3 మిలియన్ అమెరికన్ డాలర్లు
                • సామర్థ్యం: ఎకధాటిగా 6,904 మైళ్లు ప్రయాణించగలదు
                • ఏ నగరాల మధ్య తిరుగుతోంది: ప్రస్తుతం ఇది లండన్ నుండి కేప్ టౌన్ మరియు శాన్‌ఫ్రాన్సిస్కో నుండి మాస్కో మధ్య సేవలు అందిస్తోంది.
                • అత్యధిక వేగం: గంటకు 902 కిలో మీటర్లు వేగంతో ప్రయాణిస్తుంది.
                • సీటింగ్ సామర్థ్యం: ఇందులో సౌకర్యవంతంగా 13 మంది ప్రయాణించవచ్చు.
                • 01. గల్ఫ్ స్ట్రీమ్ జి650ఇఆర్

                  01. గల్ఫ్ స్ట్రీమ్ జి650ఇఆర్

                  ప్రపంచ వ్యాప్తంగా మొదటి స్థానంలో నిలిచిన ఈ ప్రయివేట్ ఎయిర్ క్రాప్ట్ ప్రత్యేకత ఎమిటో తెలుసా? ఇది ఏకదాటిగా అర్థ భూభాగాన్ని చుట్టేయగలదు. అన్నింటి కంటే ఇదే ముఖ్య అంశం విమానాల ప్రత్యేకత ఎప్పుడు అవి ఏకధాటిగా ప్రయాణించే దూరం మీద ఆధారపడి ఉంటుంది. ఇక ఇందులో విశాలమైన క్యాబిన్ కలదు. ఈ విమానంలో వ్యాపార కార్యకలాపాలు, విశ్రాంతి తీసుకోవడానికి ప్రత్యేక సదుపాయాలు కలవు.

                   గల్ఫ్ స్ట్రీమ్ జి650ఇఆర్ గురించి

                  గల్ఫ్ స్ట్రీమ్ జి650ఇఆర్ గురించి

                  • ధర: 66.5 మిలియన్ అమెరికన్ డాలర్లు
                  • సామర్థ్యం: ఎకధాటిగా 8,630 మైళ్లు ప్రయాణించగలదు
                  • ఏ నగరాల మధ్య తిరుగుతోంది: ప్రస్తుతం ఇది లాస్ ఎంజిల్స్ నుండి మెల్‌బోర్న్ మరియు హాంగ్‌కాంగ్ నుండి న్యూయార్క్ మధ్య సేవలు అందిస్తోంది.
                  • అత్యధిక వేగం: గంటకు 900 కిలో మీటర్లు వేగంతో ప్రయాణిస్తుంది.
                  • ప్రపంచ వ్యాప్తంగా గల ఉత్తమ విమానాలు
                    • మృదువైన పక్షి ఢీ కొంటె ఫతనమవుతున్న విమానాలు: అస్సలు దీని వెనకున్న మర్మం ఏమిటి?
                    • ISIS తీవ్రవాదుల అంతానికి ప్రత్యేక యుద్ద వాహనాలతో బయలుదేరిన ఫ్రాన్స్
                    • ఉత్తమ కథనాలు...
                      1. ప్రపంచంలో కెల్లా అత్యంత సుందరమైన రైలు మార్గాలు
                      2. ప్రపంచంలో కెల్లా 10 అత్యుత్తమ ఎయిర్‌లైన్స్
                      3. వయాసిస్ ఆఫ్ ది సీస్ - ఫన్ ఫ్యాక్ట్స్ (పూర్తి చిత్రాలతో..)

More from DriveSpark

Article Published On: Saturday, January 2, 2016, 12:34 [IST]
English summary
worlds best private aircrafts
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+