చెక్కతో బుల్లెట్ మోటార్‌సైకిల్ తయారు చేసిన కేరళైట్; వావ్ అంటున్న నెటిజెన్స్!

బహుశా రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిళ్లంటే ఇష్టపడని వారెవరూ ఉండకపోవచ్చేమో. ప్రస్తుతం భారతదేశంలో అనేక రకాల మోటార్‌సైకిళ్లు అందుబాటులోకి వచ్చాయి. కానీ, ఒకప్పుడు రాయల్ ఎన్‌ఫీల్డ్, తన డుగు డుగు శబ్ధంతో వీధుల్లోకి వస్తే, ఎలాంటి వారైనా సరే తల తిప్పి చూడాల్సిందే.

చెక్కతో బుల్లెట్ మోటార్‌సైకిల్ తయారు చేసిన కేరళైట్; వావ్ అంటున్న నెటిజెన్స్!

రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిళ్లను ప్రేమించే వారికి ఆ మోటార్‌సైకిళ్లంటే ఎంత ప్రేమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇందుకు నిదర్శనమే ఈ బుల్లెట్ బుల్లోడు. కేరళకు చెందిన బుల్లెట్ ప్రియుడు తన క్లాసిక్ మోటార్‌సైకిల్ యొక్క ప్రతిమను పూర్తిగా కలపతో తయారు చేశాడు.

చెక్కతో బుల్లెట్ మోటార్‌సైకిల్ తయారు చేసిన కేరళైట్; వావ్ అంటున్న నెటిజెన్స్!

కేరళ కుర్రోడైన జితిన్ కరులై వద్ద ఇప్పటికే ఓ పాత క్లాసిక్ రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ మోటార్‌సైకిల్ ఉంది. దానిని ఆధారంగా చేసుకొని అతను పూర్తిగా చెక్కతో అచ్చుగుద్దినట్లు అసలు మోటార్‌సైకిల్‌లా ఉండేలా ఓ ప్రతిమను తయారు చేశాడు.

MOST READ:బాలీవుడ్ స్టార్ 'షాహిద్ కపూర్' కొనుగోలు చేయనున్న కొత్త కార్, ఇదే

చెక్కతో బుల్లెట్ మోటార్‌సైకిల్ తయారు చేసిన కేరళైట్; వావ్ అంటున్న నెటిజెన్స్!

నిజమైన రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ మోటార్‌సైకిల్‌లో కనిపించే ప్రతి డీటేల్‌ను ఈ చెక్క బుల్లెట్ మోటార్‌సైకిల్‌లోనూ కనిపించేలా జాగ్రత్తలు తీసుకున్నాడు. ఇందులో పూర్తి ఫంక్షనల్ వీల్స్, రొటేటింగ్ హ్యాండిల్ బార్, చివరకు చెక్కతోనే రూపొందించిన తాళం చెవి వంటి అనేక డీటేల్స్‌ను ఇందులో చూడొచ్చు.

చెక్కతో బుల్లెట్ మోటార్‌సైకిల్ తయారు చేసిన కేరళైట్; వావ్ అంటున్న నెటిజెన్స్!

ఇంకా ఇందులో బ్రేక్స్, కిక్‌స్టార్ట్, గేర్ బాక్స్, స్టాండ్‌, ఇంజన్, సైలెన్సర్, బ్రేక్ కేబుల్స్, ఫుట్ పెగ్స్, హెడ్‌లైట్ మరియు సైడ్ మిర్రర్స్ వంటి అన్ని అంశాలు కనిపిస్తాయి. వీటన్నింటినీ అతను పూర్తిగా చెక్కతోనే తయారు చేశాడు.

MOST READ:పిల్లలు చేసిన తప్పుకు తల్లిదండ్రులకు రూ. 1 లక్ష జరిమానా.. ఆ తప్పేమిటో తెలుసా?

చెక్కతో బుల్లెట్ మోటార్‌సైకిల్ తయారు చేసిన కేరళైట్; వావ్ అంటున్న నెటిజెన్స్!

ఈ మోటార్‌సైకిల్‌లోని ప్రతి భాగం చెక్కతో తయారు చేసినప్పటికీ, ఇవి చూడటానికి చాలా వాస్తవికంగా కనిపిస్తాయి. ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్న జితిన్ కరులై ఈ చెక్క బుల్లెట్ మోటార్‌సైకిల్ తయారీ కోసం మలేషియా చెట్లను ఉపయోగించారు.

చెక్కతో బుల్లెట్ మోటార్‌సైకిల్ తయారు చేసిన కేరళైట్; వావ్ అంటున్న నెటిజెన్స్!

చిన్నపాటి భాగాలను మలిచేందుకు గాను అతను టేకు చెక్కను కూడా ఉపయోగించాడు. చెక్కతో ఈ రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ బైక్‌ను డిజైన్ చేయటానికి అతనికి సుమారు 2 సంవత్సరాలు సమయం పట్టిందని చెబుతున్నాడు.

MOST READ:రోడ్డుపై యాక్టివా స్కూటర్‌పై ఉన్న యువతి చేసిన పనికి చిర్రెత్తిన కెటిఎమ్ బైక్ రైడర్‌

చెక్కతో బుల్లెట్ మోటార్‌సైకిల్ తయారు చేసిన కేరళైట్; వావ్ అంటున్న నెటిజెన్స్!

ఓవైపు ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తూనే, ఖాలీ సమయంలో ఈ చెక్క మోటార్‌సైకిల్ తయారీపై దృష్టిపెట్టినట్లు జితిన్ చెప్పుకొచ్చాడు. ఈ బైక్‌లోని కిక్ స్టార్ట్ మరియు గేర్ లివర్ రెండూ ఒకే వైపు ఉండటాన్ని చూస్తుంటే, ఇది ఖచ్చితంగా చాలా పాత మోడల్ అని తెలుస్తోంది.

ఇంటర్నెట్ ద్వారా జితిన్ ప్రతిభ వెలుగులోకి రావటంతో, అతని ప్రతిభను చూసిన వారంతా ఔరా అని ఆశ్చర్యపోతున్నారు. మరి మీకు ఈ చెక్క బుల్లెట్ మోటార్‌సైకిల్ నచ్చిందా. కామెంట్ల రూపంలో తెలియజేయగలరు.

MOST READ:ఇకపై ఈ వాహనాలకు రీ-రిజిస్ట్రేషన్ నిషేధం.. అవి ఏవో చూడండి

Image Courtesy: Jidhin Karulai

Most Read Articles

English summary
Kerala Youngman Made Royal Enfield Bullet Old Model From Wood. Read In Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X