నేటి వీడియో: 12 కార్లను లాగి గిన్నిస్ ఎక్కిన బలశాలి

By Ravi

ఐదుసార్లు వరల్డ్స్ స్ట్రాంగెస్ట్ మ్యాన్ ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను గెలుచుకున్న జైడ్రునాస్ శావికాస్ ఒకేసారి ఏకంగా 12 కార్లను లాగి గిన్నిస్ బుక్ రికార్డుల్లో చోటు దక్కించుకున్నాడు. మొత్తం 12 నిస్సాన్ నోట్ కార్లను ఒకదానితో మరొకటి లింక్ చేసి, నడుముకు తాడు కట్టుకొని జైడ్రునాస్ ఈ ఫీట్ చేశాడు. ఈ 12 నిస్సాన్ నోట్ కార్ల మొత్తం బరువు 12,942 కేజీలు.

మనం ఒక్క కారును తోయడానికి/లాగటానికే ఆయాసపడుతుంటే, జైడ్రునాస్ మాత్రం సునాయాసంగా ఈ ఫీట్ చేసేశాడు. కేవలం 32.9 సెకండ్ల వ్యవధిలో 12,942 కేజీల బరువున్న ఈ 12 నిస్సాన్ నోట్ కార్లను 5 మీటర్ల దూరం లాగి జైడ్రునాస్ గిన్నిస్ బుక్ రికార్డును సాధించాడు. జైడ్రునాస్ శావికాస్ బరువు 170 కేజీలు ఈ కార్యక్రమం లిథువానియాలోని ద్రుస్కిన్కాయ్‌లో జరిగింది. మరి మనం ఆ వీడియోని వీక్షిద్దాం రండి..!
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/cSnnxqldprE?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center>
నిస్సాన్ ఇటీవలే తమ నోట్ కారును యూకేలో విడుదల చేసింది. టెక్నాలజీ, డిజైన్, వ్యాల్యూ ఫర్ మనీ వంటి అనేక విషయాల్లో నిస్సాన్ నోట్ కొత్త బెంచ్‌మార్క్‌ను సృష్టించింది. యూరోపియన్ మార్కెట్లను దృష్టిలో ఉంచుకొని ఈ కారు డిజైనింగ్ అండ్ ఇంజనీరింగ్‌ను చేశారు. నిస్సాన్ నోట్‌లో ప్యూర్ డ్రైవ్ 1.2 లీటర్ 98 పిఎస్ సూపర్‌ఛార్జ్‌డ్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది. ఇది తక్కువ కర్భన ఉద్ఘాలను విడుదల చేసి, ఎక్కువ మైలేజీనిస్తుంది.

Zydrunas Savickas

More from DriveSpark

Article Published On: Friday, December 6, 2013, 10:24 [IST]
English summary
Zydrunas Savickas, 5 times World's strongest man champion has entered the Guinness book of world records. He achieved this feat by pulling 12 Nissan Notes which accumulated to a total weight of 12,942kg. Zydrunas conquered this herculean task by wearing a special pulling harness and rope arrangement, which enabled him to pull the Nissan Notes for a staggering 5 metres in 32.9 seconds.&#13;
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+