అక్టోబర్ 13న మరో సూపర్‌బైక్‌ను ప్రవేశపెట్టనున్న హ్యోసంగ్

Hyosung GT650N
దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఎస్&టి మోటార్స్ భారత్‌లో మరో సరికొత్త హ్యోసంగ్ బ్రాండ్ సూపర్‌బైక్‌ను ఈ నెల 13న ప్రవేశపెట్టనుంది. ఇదే రోజున హ్యుందాయ్ కూడా భారత మార్కెట్లో తమ చిన్న కారు ఇయాన్‌ను కూడా విడుదల చేయనుంది. 'హ్యోసంగ్ జిటి650ఎన్' లేటెస్ట్ మోటార్‌సైకిల్‌ను పుణేకి చెందిన గర్వారే మోటార్స్‌ (హ్యోసంగ్ భారతీయ భాగస్వామి) విడుదల చేయనుంది.

కాగా.. భారత్‌లో హ్యోసంగ్‌కు ఇది మూడవ సూపర్‌బైక్. గర్వారే మోటార్స్‌ మోటార్స్ గత ఏప్రిల్ నెలలో హ్యోసంగ్ జిటి650ఆర్, హ్యోసంగ్ ఎస్‌టి7 అనే రెండు సరికొత్త సూపర్‌బైక్‌లను విడుదల చేసిన సంగతి తెలిసిందే. హ్యోసంగ్ జిటి650ఎన్ సూపర్‌బైక్ 650 సీసీ, వీ-ట్విన్ 8-వాల్వ్, డిఓహెచ్‌సి లిక్విడ్ కూల్డ్, ఫ్యూయెల్ ఇంజెక్టెడ్ ఇంజన్‌ను కలిగి ఉండి, 72 బిహెచ్‌పిల గరిష్ట శక్తిని ఉత్పత్తి చేస్తుంది.

గార్వారే మోటార్స్ ప్రస్తుతం దేశీయ విపణిలో అందిస్తున్న జిటి650ఆర్, ఎస్‌టి7 మోడళ్లతో పాటు జిటి650ఎన్ మోడల్‌ను కూడా పూర్తిగా విడిభాగాలుగా (సికెడి) దిగుమతి చేసుకొని మహారాష్ట్రలోని వాయ్ వద్ద ఉన్న గార్వారే-హ్యోసంగ్ అసెంబ్లింగ్ ప్లాంటులో వీటిని అసెంబ్లింగ్ చేయనున్నారు. వాస్తవానికి హ్యోసంగ్ 2004 సంవత్సరంలో లోనే భారత మార్కెట్లోకి ప్రవేశించింది.

అయితే 2007లో హ్యోసంగ్ మోటార్ డివిజన్‌ను ఎస్&టి గ్రూపు కొనుగోలు చేసింది. కాగా.. ప్రస్తుతం భారత్‌లో ఏర్పాటు చేసిన తాజా వెంచర్ కోసం ఎస్&టి మోటార్స్ పుణేకి చెందిన గర్వారే మోటార్స్‌తో చేతులు కలిపి మరోసారి రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ ప్లాంటు ఏర్పాటు కోసం రూ.20 కోట్లు వెచ్చించారు. దీని ఉత్పత్తి సామర్థ్యం రోజుకు (సింగిల్ షిఫ్ట్‌లో) 8 నుండి 10 బైక్‌లు.

More from DriveSpark

Article Published On: Tuesday, October 11, 2011, 11:51 [IST]
English summary
South Korean two-wheeler maker S&T Motors and its Indian partner Garware Motors are all set to launch a new Hyosung branded premium bike called 'Hyosung GT650N' in India on 13th October, 2011.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+