బజాజ్ పల్సర్: ఇప్పుడు అన్ని వేరియంట్లలో మల్టీ కలర్స్

కాగా.. ప్రస్తుతం పల్సర్ 150, పల్సర్ 180 మరియు పల్సర్ 220ఎఫ్ వేరియంట్లలో కూడా బజాజ్ మల్టీ కలర్ ఆప్షన్‌ను అందిస్తుంది. బ్లాక్ అండ్ రెడ్ కలయిక మరియు బ్లాక్ అండ్ బ్లూ కలయికలతో వస్తున్న కొత్త పల్సర్ మంచి లుక్‌ను కలిగి ఉండి పల్సర్ ప్రియులను మరింతగా ఆకట్టుకోనున్నాయి. ఇవి ముందువైపు ఫ్యూయెల్ ట్యాంక్ బ్లూ, రెడ్ కలర్స్‌ను కలిగి ఉండి, వెనుకవైపు బ్లాక్ కలర్ డిజైన్‌ను కలిగి ఉంటాయి.
బజాజ్ పల్సర్ బైక్‌లు బ్లూ, రెడ్, బ్లాక్ వంటి సోలో కలర్స్‌లో ఎంతో ప్రాచుర్యం పొందాయి. కాగా.. పల్సర్ ప్రియుల కోరిక మేరకు బజాజ్ ఆటో గతంలో ఇందులో ఆరెంజ్ కలర్ వేరియంట్‌ను ప్రవేశపెట్టింది. ఇప్పుడు కూడా బైక్ లవర్స్ కోరిక మేరకు బజాజ్ పల్సర్‌ను రెండు రంగుల కలయికతో అందిస్తుంది. ఇదిలా ఉండగా డిసెంబర్ నెలలో ఓ సరికొత్త పల్సర్‌ను విడుదల చేయనున్నామని కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ బజాజ్ ఓ ప్రకటనలో తెలిరపారు.


Click it and Unblock the Notifications








