ద్విచక్ర వాహనాలపై ఆకర్షనీయమైన ఆఫర్లు

ఈ నేపథ్యలో కొనుగోలుదారులు ఎక్కువ మైలేజీనిచ్చే 100 సీసీ రేంజ్ బైక్‌ల వైపు మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా వీటి అమ్మకాలు కూడా ఊపందుకున్నాయి. ఇప్పటి వరకూ గ్రామీణ మార్కెట్లను రూల్ చేస్తున్నవి 100 సీసీ బైక్‌లే. అయితే, ఇప్పుడు ఈ ట్రెండ్ పట్టణాలకు కూడా పాకింది. మార్కెట్ మందగనం కారణంగా ఓ వైపు కార్ల అమ్మకాలు తగ్గినా బైక్‌ల జోరు మాత్రం ఆగలేదు.
కాగా.. ఈ మార్కెట్ మందగమనం ద్విచక్ర వాహన విభాగంపై ప్రభావం చూపకుండా ఉండేందుకు అటు కంపెనీలు ఇటు డీలర్లు జాగ్రత్తలు తీసుకొంటున్నారు. తక్కువ వడ్డీరేట్లతో కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నారు. మార్కెట్లో ఫైనాన్స్ రేట్లు 13-14 శాతం ఉండగా.. బజాజ్ ఆటో 9.99 శాతం, టీవీఎస్ 8 శాతం వడ్డీకే ఫైనాన్స్ సదుపాయాలను ఆఫర్ చేస్తున్నాయి. ఇవి కాకుండా పండుగ సీజన్‌ను పురస్కరించుకొని వివిధ ప్రోత్సాహకాలను కూడా ఆఫర్ చేస్తున్నాయి.
ఇదిలా ఉండగా.. బజాజ్ ఆటో ఇటీవలే బాక్సర్ బైక్‌ను అప్‌గ్రేడ్ చేసి శక్తివంతమైన 150 సీసీ ఇంజన్‌తో మార్కెట్లోకి విడుదల చేయగా.. టీవీఎస్ కూడా దసెరా పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకొని భారత క్రికెట్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ స్పెషల్ ఎడిషన్ పేరిట ఓ సరికొత్త టీవీఎస్ స్టార్ సిటీ మోటార్‌సైకిల్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications








