మార్కెట్లో 100 సీసీ బైక్‌లకు ఎందుకంత ప్రాధాన్యం?

Hero Honda Passion Pro
అసలు మన మార్కెట్లో 100 సీసీ మోటార్‌సైకిళ్లకు ఎందుకు అంత ప్రాధాన్యం? ద్విచక్ర వాహన విభాగంలో అన్ని సెగ్మెంట్లు ఉన్నప్పటికీ, 100 సీసీ సెగ్మెంట్ ఎందుకు అగ్రస్థానంలో ఉంది? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటే చాలానే ఉన్నాయి. వివిధ కంపెనీలు అందిస్తున్న 100 సీసీ మోటార్‌సైకిళ్లు సగటున ప్రతి లీటరు పెట్రోల్‌కు 60-70 కి.మీ. మైలేజీనిస్తాయి. 100 సీసీ బైక్‌ల అమ్మకాలు పెరగడానికి ఇది కూడా ఒక ప్రధాన కారణం.

అంతేకాకుండా.. వీటి ధరలు కూడా సగటున (కంపెనీ / మోడల్‌ను బట్టి) రూ.45,000 నుంచి రూ.65,000 మధ్యలో ఉంటాయి. అందుకే మెజారిటీ శాతం కొనుగోలుదారులు 100 సీసీ బైక్‌లను ఆశ్రయిస్తున్నారు. పవర్‌తో మైలేజ్‌ను కోరుకునేవారు 125 సీసీ బైక్‌లను ఆశ్రయిస్తున్నారు, ఇవి సగటున ప్రతి లీటరు పెట్రోల్‌కు 45-50 కి.మీ. మైలేజీనిస్తాయి. 150 సీసీ మోటార్‌సైకిళ్ల విషయానికి వస్తే.. ఇవి సగటున ప్రతి లీటరుకు 40-45 కిలోమీటర్లను అలాగే, 200 సీసీ మోటార్‌సైకిళ్లు 40 కి.మీ. లోపు మైలేజీనిస్తాయి.

సాధారణంగా 100 సీసీ బైక్‌లతో పోల్చితే 150 సీసీ బైక్‌ల ధరలు 30 శాతం నుంచి 40 శాతం అధికంగా ఉంటాయి. అంతేకాకుండా.. 150 సీసీ బైక్‌ల మెయింటినెన్స్, స్పేర్ పార్ట్స్ ధరలు కుడా 100 సీసీ బైక్‌ల కన్నా ఎక్కువగా ఉంటుండంతో కొనుగోలుదారులు 100 సీసీ బైక్‌లను కొనుగోలుచేస్తున్నారు. అంతెందుకు మనదేశంలో అమ్ముడయ్యే మొత్తం మోటార్‌సైకిళ్లలో 60 శాతం వాటా 100 సీసీ బైక్‌లదే.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో మొత్తం 31,87,682 ద్విచక్ర వాహనాలు అమ్ముడు కాగా... ఇందులో 60 శాతం 100 సీసీ బైక్‌లే ఉన్నాయి. దేశీయ అగ్రగామి ద్విచక్ర వాహన కంపెనీ హీరో మోటోకార్ప్ మూడు నెలల కాలంలో 15,29,557 ద్విచక్ర వాహనాలను విక్రయిస్తే, అందులో 73 శాతం 100 సీసీ బైక్‌లు ఉన్నాయి. అలాగే గతంలో బజాజ్ ఆటో కూడా ఎక్కువగా 100 సీసీ బైక్‌లను విక్రయించేంది.

అయితే, కంపెనీ స్పోర్ట్స్ బైక్ పల్సర్ విక్రయాలు ఊపందుకోవడంతో ప్రస్తుతం కంపెనీ ప్రధానంగా స్పోర్ట్స్ బైక్స్, గ్లోబల్ మార్కెట్లపైనే దృష్టి సారించింది. దీంతో ఇటీవల కాలంలో బజాజ్ 100 సీసీ బైక్‌ల అమ్మకాలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. హీరో హోండా స్ప్లెండర్ ప్లస్, స్ప్లెండర్ ప్రో, ప్యాషన్ ప్లస్, ప్యాషన్ ప్రో బైకులు, బజాజ్‌ డిస్కవర్, ప్లాటినా, టీవీఎస్‌ స్టార్ సిటీ, స్పోర్ట్స్ బైకులు ఈ సెగ్మెంట్‌లో అత్యధిక అమ్మకాలను నమోదు చేస్తున్నాయి.

More from DriveSpark

Article Published On: Saturday, October 1, 2011, 11:35 [IST]
English summary
100 cc motorcycles are the most preferred bikes in India. These bikes are not only inexpensive but also offers mileage of above 60kmpl making them the most preferred bikes. Hence more than 60 per cent of the motorcycles sold in India are 100cc bikes.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+