భారత మార్కెట్‌కు రానున్న డ్యుకాటి మోన్‌స్టర్ 795‌

Ducati Monster 795
ఇటలీకు చెందిన ప్రముఖ సూపర్‌బైక్‌ల తయారీ సంస్థ డ్యుకాటి అతి త్వరలో భారత మార్కెట్‌కు మరో సూపర్‌బైక్‌ను పరిచయం చేయనుంది. మిడ్-లెవల్ సూపర్‌బైక్‌ల సెగ్మెంట్లో కవాసకి నిన్జా 650ఆర్, హ్యోసంగ్ జిటి650ఆర్ వంటి మోడళ్లకు గట్టి పోటీ ఇచ్చేందుకు "డ్యుకాటి మోన్‌స్టర్ 795" అనే ఓ సరికొత్త సూపర్‌బైక్‌‌ను సిద్ధం చేసింది.

డ్యుకాటి మోన్‌స్టర్ 1993లో ప్రారంభమైన ఎమ్900 నుండి ఎంతో ప్రాచుర్యం పొందిన మోటార్‌సైకిల్‌గా ఉంది. వాస్తవానికి కొత్త డ్యుకాటి మోన్‌స్టర్ 795 అనేది బేసిక్ మోన్‌స్టర్ 696, క్లాసీయర్ మోన్‌స్టర్ 796 మోడళ్ల విలీకరణమని చెప్పవచ్చు. సింగిల్-సైడెడ్ స్వింగ్ ఆర్మ్, 3-స్పోక్ అల్లాయ్ వీల్స్ వంటి ఆకర్షనీయమైన ఫీచర్లతో ఇది లభ్యం కానుంది.

డ్యుకాటి మోన్‌స్టర్ 795 బైక్ శక్తివంతమైన 803సీసీ డెస్మోడ్రొమిక్ ఎల్-ట్విన్, ఎయిర్ కూల్డ్ ఇంజన్‌తో లభిస్తుంది. ఈ ఇంజన్ 8250 ఆర్‌పిఎమ్ వద్ద 87 పిఎస్‌ల శక్తిని, 6250 ఆర్‌పిఎమ్ వద్ద 78 ఎన్ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. దాదాపు 167 కిలోల బరువున్న 'డ్యుకాటి మోన్‌స్టర్ 795' 6-వీల్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో లభ్యమవుతుంది.

ఈ సూపర్‌బైక్‌ను డ్యుకాటి మోటోజిపి రేసర్ వాలెన్టినో రోస్సీ చేతుల మీదుగా కంపెనీ ఇంటీవలే మలేషియా మార్కెట్లో విడుదల చేసింది. థాయ్‌లాండ్ మార్కెట్లో ఉత్పత్తి డ్యుకాటి మోన్‌స్టర్ 795 మొత్తం తొమ్మిది దేశాలలో.. థాయ్‌‌లాండ్, చైనా, ఇండియా, హాంగ్ కాంగ్, ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పీన్స్, వియత్నాం మరియు సింగపూర్‌లలో ఇది అమ్ముడు కానుంది.

డ్యుకాటి మోన్‌స్టర్‌కు సంబంధించిన మరింత సమాచారం కోసం నెక్స్ట్ (NEXT)పై క్లిక్ చేయండి

More from DriveSpark

Article Published On: Monday, October 31, 2011, 18:02 [IST]
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+