హ్యోసంగ్ జిటి650ఎన్ సూపర్‌బైక్ ధర తగ్గింపు

అయితే, ఈ డిస్కౌంట్ పరిమిత కాలమే అని భావించడం జరిగింది. కానీ ఇప్పుడు ఈ ఆఫర్‌ను కంపెనీ మరింత కాలం పొడింగించడమే కాకుండా, డిస్కౌంట్ తర్వాత ధరనే ప్రారంభ ధరగా నిర్ణయించింది. గడచిన అక్టోబర్ నెలలో పూణేకు చెందిన గార్వారే మోటార్స్ ఈ సూపర్‌బైక్‌ను దేశీయ విపణిలో విడుదల చేసింది.
హ్యోసంగ్ జిటి650ఎన్ సూపర్‌బైక్ 650సీసీ, వీ-ట్విన్ 8-వాల్వ్, డిఓహెచ్‌సి లిక్విడ్ కూల్డ్, ఫ్యూయెల్ ఇంజెక్టెడ్ ఇంజన్‌ను కలిగి ఉండి, 72 బిహెచ్‌పిల గరిష్ట శక్తిని ఉత్పత్తి చేస్తుంది. మొత్తం 196 కిలోల బరువు ఉండే ఈ మోటార్‌సైకిల్ గరిష్టంగా గంటకు 200 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుంది.
దేశవ్యాప్తంగా ఉన్న 14 డీలర్‌షిప్ కేంద్రాలలో ఈ హ్యోసంగ్ జిటి650ఎన్ సూపర్‌బైక్ లభ్యమవుతుంది. ఇదిలా ఉండగా, హ్యోసంగ్ సూపర్‌బైక్‌లను గార్వారే మోటార్స్ హైదరాబాద్ మార్కెట్లోకి కూడా తీసుకువచ్చింది. రాజ్‌భవన్ రోడ్‌లో ఓ కొత్త షోరూమ్‌ను ఏర్పాటు చేసి అన్ని మోడళ్లను అందిస్తుంది.


Click it and Unblock the Notifications








